Skip to main content

Posts

13March2018

❇ దేవుడు పౌలు చేత అసాధారణమైన అద్భుతాలు చేయించాడు. అతని శరీరానికి తాకిన చేతి గుడ్డలైనా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దయ్యాలు కూడా వదలిపోయాయి. అప్పుడు, దేశసంచారం చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టే యూదులు కొందరు, దయ్యాలు పట్టిన వారిపై౼“పౌలు ప్రకటించే యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాం” అని యేసుప్రభువు పేరు చెప్పడానికి పూనుకొన్నారు. స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు అలా చేశారు. ఆ దయ్యం వారితో౼“నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అంది. ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారిమీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత వారు గాయాలతో బట్టల్లేకుండా ఆ ఇంటి నుండి పారిపోయారు ❇ ■ యూదా మతస్తుడైన పౌలు ప్రభువును తెలుసుకోక ముందు ఎంతో భక్తిపరునిగా, మతాసక్తి గల వానిగా ఉన్నాడు(ఫిలిప్పీ 3:6). ఆ సమయంలో అతని జీవితంలో ఎలాంటి ప్రభావం లేదు. ప్రభువును తెల్సుకున్న తర్వాతే అతని ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయించాడు. దెయ్యాలు సైతం పౌలును గుర్తుపట్టాయి. ఒకడే వ్యక్తి..! కానీ అతని జీవితంలో ఎంతో తేడా కనిపిస్తుంది. కారణం..పౌలు దేవుణ్ని తెల్సుకున్నాడు-దేవుని చేత త...

12Mar2018

శోధన: ■ 'శోధన'౼ అనగా ఒక విశ్వాసి పాపం చెయ్యడానికి ప్రేరేపించబడటం. విశ్వాసిని దేవుని నుండి(ఆయన వాక్యంలో నిలువకుండా) వైదొలిగించడానికి సాతాను పన్నే వల. సహజంగా మనం దేవుణ్ని తెలిసికొనక మునుపు ఏ పాపాలను ఇష్టంగా చేస్తామో..ఆ విషయాలనే శోధనకు సాధనాలుగా సాతాను వాడుకుంటాడు. పూర్వం మనకు ఉన్న దురాశలను అనుసరించి నడుచుకొనునట్లుగా ప్రేరేపిస్తాడు (ఎఫె 4:22, తీతు 3:3). 'శోధన' అనేది ప్రతి విశ్వాసికీ సహజంగా కలిగే అనుభవమే! ఇది దేవుని అనుమతితోనే మనకు వస్తాయి. మనం భరింపదగిన దాని కంటే-అనగా మన శక్తికి మించిన శోధనా బలాన్ని మన జీవితంలో ఆయన అనుమతించడు(1కోరింథి 10:13). ఇందులో దేవుని ఉద్దేశ్యం మనల్ని మరింత బలవంతులుగా చెయ్యాలనే కానీ పాపంలో పడటం ఆయన చిత్తం కాదు! 'శోధించబడటం'(పాపపు ప్రేరణ రావటం) తప్పు కాదు, కాని ఆ ప్రేరణకు లొంగి ఆ పాపంలో పడి అపవాదితో ఏకీభవించడం 'పాపం'. శోధన జయించిన ప్రతిసారి మనకు మరికొంత ఆధ్యాత్మిక బలం తోడౌతుంది. ■ ఒకవేళ మనం శోధనలో పడినప్పుడు, వెంటనే దేవుని కృపా సింహాసనాన్ని ఆశ్రయించి ఆ పాపాన్ని వెంటనే కడిగివేసుకోవాలి(1యోహా 2:1). బలహీనతలను (పుర్వపు పాపాలను) చులకనగా తీ...

08Mar2018

❇ వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి౼“యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు౼“అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు౼“నా గొర్రెల్ని మేపు” అని అతనితో చెప్పాడు..... ఆయన మూడోసారి౼“యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి౼“ ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు(యోహాను 21:15-17) ❇ ■ ఓడిపోయి, నిరాశ-నిస్పృహలో కృంగివున్న ప్రతి విశ్వాసికి ఓదార్పు..పై వాక్యభాగం. పేతురు-'ఒకప్పుడు నేను ప్రభువు కోసం సమస్తం వదులుకొని వచ్చాను, నమ్మకంగా సేవిస్తున్నాను గనుక దేవుని కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నాకు ఉన్నదనుకున్నాడు'. తన భక్తికి ఉన్న బలం, తన స్వంత శక్తి మీదే ఆధారపడివుందన్న విషయం గ్రహించలేకపోయ్యాడు. ఆ స్థితి మనల్ని గురించి మనం అతిగా ఉహించుకునేందుకు ప్రేరేపించి మనల్ని మోసపుచ్చుతుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆ అబద్ధం మనల్ని విడిపించాలని...

05Mar2018

❇ యేసు నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు. ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి౼“ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. యేసు౼“చిన్నవాడా, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు. అందరూ భయంతో నిండిపోయి౼”మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలను సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు. ❇ ■ విధవరాలి కుమారునికి ఆ మరణాన్ని అనుగ్రహించినది ఏవరు? దేవుడే కదా! మరి ఆయనే ఆమె దగ్గరకు వచ్చి 'ఏడవవద్దు' అని పలకడం నాటకీయంగా లేదా!మానవ జ్ఞానంతో దేవుని మనస్సును ఎన్నడూ అర్ధం చేసుకోలేము. క్రీస్తు ఆ చిన్నవాడ్ని చావు నుండి లేపాడు. కాని కొన్ని సంవత్సరాలుకు అతను మళ్ళీ చనిపోయాడు. అంటే ఇక్కడ చావునుండి లేపటం కంటే విలువైనది ఎదో ఉందని గ్...

03Mar2018

❇ యెహోషువ యెరికో దగ్గర ఉన్నప్పుడు అతడు తలెత్తి చూశాడు. అతనికి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ మనుషుడు కత్తి దూసి చేతపట్టుకొని ఉన్నాడు. యెహోషువ ఆయన దగ్గరికి వచ్చి-“నీవు మా ప్రజల పక్షమా, లేక నీవు మా శత్రువర్గం వాడివా?” అని అడిగాడు. “కాదు! యెహోవా సైన్యానికి అధిపతిగా నేనిప్పుడు వచ్చాను” అని ఆయన జవాబిచ్చాడు. యెహోషువ ఆయనను గౌరవిస్తు సాష్టాంగపడి౼“ప్రభూ! తమ దాసుడైన నాకు ఏమి సెలవిస్తున్నారు?” అని అడిగాడు. యెహోవా సైన్యాధిపతి యెహోషువతో౼“నీవు నిలబడ్డ ఈ స్థలం పవిత్రం గనుక నీ కాళ్ళనుంచి చెప్పులు తీసివెయ్యి” అన్నాడు. యెహోషువ అలా చేశాడు ❇ దేవుడు ఎవరి పక్షాన నిలుస్తాడు? ■ దేవుని సర్వ సైన్యాలు(దేవదూతలు) తమకు నచ్చిన పని తాము చేసుకుపోరు గాని దేవుని ఆదేశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఆయన ఏం చెప్తే అదే చేశారు. కొద్దివారికేమి, గొప్పవారికేమి దేవుడు చెప్పమన్న వార్తను మోసుకుపోయ్యారు, దేవుని ప్రజలకు సహాయకులుగా నిలిచారు. యుద్దాలు చేశారు, రక్షకులుగా నిలిచారు, ఓదార్చారు-బలపర్చారు, పరిశుద్ధులకు పరిచర్య చేశారు. ఐతే వారు దేవుడు సెలవివ్వకుండా ఏ ఒక్క పని చెయ్యరు. ఆ విధంగా వారు దేవుని పక్షం ఉన్నారు కనుకనే దేవుడు వారి...

28Feb2018

❇ తెరహు(అబ్రాము తండ్రి) తన కుటుంబముతోబాటు కల్దీయుల 'ఊరు' అను పట్టణమును పెట్టి, 'కనాను'కు ప్రయాణం చేయాలని అనుకున్నారు. తన కుమారుడు అబ్రామును, మనమడు లోతును, కోడలు శారయిని తెరహు తన వెంట తీసుకు వెళ్లాడు. ఐతే వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి,అక్కడ ఉండిపోవాలని నిర్ణయించు కొన్నారు. తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో మరణించాడు. అప్పుడు యెహోవా అబ్రాముతో౼“నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు. నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి, నేను నీకు చూపించు దేశానికి వెళ్లు..." అబ్రాము తన భార్య శారయిని, లోతుని, హారానులో వారు గడించిన సంపదనూ, సంపాదించుకొన్న వ్యక్తులనూ తీసుకొని 'కనాను' దేశానికి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు (ఆది 11:31,32; 12:1-5)❇ ■ దేవుడు అబ్రామును 'హారాను' పట్టణంకు రాక ముందే అనగా కల్దీయుల దేశంలోని 'ఊరు' అను పట్టణములో ఉండగానే పిలిచాడు(అపో 7:2). తన తండ్రియైన తెరహు ఇంటి పెద్దగా ఉండగా అబ్రాము, అతనితో పాటు కానానుకు ప్రయాణం అయ్యాడు (హెబ్రీ 11:8). 'కానాను' అనే పేరు గల ప్రదేశానికి వెళ్ళమని కూడా దేవుడు చెప్పలేదు. ఎప్పుడైనా దేవుడు పూర్తి వ...

26Feb2018

❇ పౌలు బర్నబాతో౼“ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్కు ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, వారెలా ఉన్నారో చూద్దాం” అన్నాడు. అప్పుడు 'మార్కు' అనే పేరున్న యోహానును వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకొని పోవడం భావ్యం కాదని తలంచాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. (అపో 15:36-41)❇ ■ "బర్నబా" భక్తిపరుడునూ,ఆదరణ చూపటంలో ఆసక్తిపరుడుగా కనిపిస్తాడు (అపో 4:36,37). ఒకప్పుడు క్రూరుడైన సౌలు(పౌలుగా) మారాక ప్రతి ఒక్కరూ అతన్ని నమ్మక, భయపడి దూరంగా ఉన్నప్పుడు,బర్నబానే అతణ్ణి ఆదరించి అపొస్తలులకు పరిచయం చేశాడు(అపో 9:27). ఆదరించే అతని స్వభావాన్ని బట్టి "బర్నబా" అని అపొస్తలులే అతనికి పేరు పెట్టారు.పౌలు దేవుణ్ని ఎంతో శ్రద్ధగా వెంబడించే వానిగా ఉన్నాడు(zealous for GOD) . క్రీస్తును ఎంత బలంగా ద్వేషించాడో, దేవుడు అతనికి కనపర్చుకొన్న తర్వాత అంతే ప్రేమతో, భయభక్తులతో క్రీస్తును సేవించాడు. క్రీస్తును ధరించుకోవడం కొరకు, తన పట్ల దే...

23Feb2018

❇ యబ్బేజు తన సోదరులకంటే ఘనుడయ్యాడు. అతని తల్లి “బాధతో ఇతణ్ణి కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు ఇశ్రాయేలు ప్రజల దేవునికి ఇలా మొర పెట్టాడు౼“దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.(1దిన 4:9,10) ❇ ■ 'యబ్బేజు' అనే పేరు(వేదన) అతనికి తన ప్రమేయమేమి లేకుండానే వచ్చింది. మన ప్రమేయమేమి లేకుండా మన జీవితంలోకి వచ్చినవి దేవుని అనాదికాల ప్రణాళికల నెరవేర్పుకు దేవుని చేత పంపబడినవే..అవి అలాగే ఉండటం సరైనదే! వాటిని ఆయన తన సంకల్పాల నెరవేర్పుకు అవి ఉండవాల్సి ఉన్నది. ఉదాహరణకు మన రూపం,శరీర ఆకృతి, జనన-సమయాలు,మన తల్లిదండ్రులు, జీవనశైలి, సామాజిక-ఆర్ధిక పరిస్థితులు, అభిరుచులు (భావోద్రేకాలు), పుట్టుకతోనే వచ్చే కొన్ని సమర్ధతలు-అసమర్ధతలు మె||నవి. అంతేకాకుండా మన జీవితాల్లో అకస్మాత్తుగా సంభవించి, మనల్ని బలహీనులుగా మార్చిన చేదైన సంఘటనలు. ఇలా కొన్ని మనం కోరుకోకుండానే మనకు ద...

19Feb2018

మనం భాధలు, దుఃఖాలు, శ్రమలు, అన్యాయాలు గుండా వెళ్తున్నప్పుడు ఈ క్రింది రెండు సత్యాలను బట్టి ధైర్యంగా వాటిని ఎదుర్కొవచ్చు. 1. దేవునికి తెలిసే ఈ విషయాలు నా జీవితంలోకి వచ్చాయి. ఆయన నన్ను దగ్గర నుండి (అనగా నాలో నుండే నన్ను) ఎరిగివున్నాడు. 2. దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడు. పై సత్యాలు నేను దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నానని తెలియజేస్తుంటాయి. యేసు౼"రెండు పిచ్చుకలు పది పైసలకు అమ్ముడు పోతాయి గదా. అయినా వాటిలో ఒక్కటి కూడా మీ పరమ తండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. మీ తల వెంట్రుకలు ఎన్నో లెక్క ఉంది. అందుచేత నిర్భయంగా ఉండండి. అనేక పిచ్చుకలకంటే మీ విలువ ఎక్కువ" (మత్తయి10:29-31) పేతురు౼"ఆయన మీ విషయం పట్టించుకొంటున్నాడు. గనుక మీ చింత యావత్తూ ఆయనమీద వేయండి". 1 Peter 5:7 *** దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ***

20Feb2018

❇ ఒకసారి యేసు దేవాలయంలోకి ఉన్నప్పుడు ప్రజలంతా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన కూర్చుని వారికి ఉపదేశించడం మొదలుపెట్టాడు. అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆమెను అందరి మధ్య నిలబెట్టారు. వారు ఆయనతో౼“బోధకా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు.ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. ఆయన తల ఎత్తి చూసి౼“మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది... ❇ ■ ఈ సన్నివేశాన్ని ఇలా ఊహించవచ్చు! ఒకవైపు ధర్మశాస్త్రం! మరోవైపు క్రీస్తు! మధ్యలో పాపం చేసిన నరుడు! ఎదురుగా అపవాదియైన సాతాను! సాతాను యొక్క నేరారోపణ నిజమైనదే! ఆ...

14Feb2018

❇ పేతురు౼"కాబట్టి కార్యసిద్ధికి మీ మనసులను సిద్ధం చేయండి. మెళకువగా ఉండండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు ఇవ్వబోయే కృప కోసం సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. విధేయతగల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలో లాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి! మిమ్ములను పిలిచినవాడు పవిత్రుడు. అలాగే మీ ప్రవర్తనంతట్లో పవిత్రులై ఉండండి. ఎందుకంటే౼'నేను పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండండి' అని వ్రాసి ఉంది" (1పేతురు 1:13-16) ❇ ■ మొదటి ఆదాముతో మనం కోల్పోయినది తిరిగి ఇవ్వడానికే కడపటి ఆదాముయైన క్రీస్తు వచ్చాడని మనకు తెల్సు(1కొరింథి 15:22)! 'కోల్పోయినది' అనగానే వెంటనే మన మనస్సులో మెదిలే మొదటి ఆలోచన౼'పరలోక రాజ్యం'. అవును! అది నిజమే! కానీ ఆదాము కోల్పోయింది అదొక్కటే కాదు. మనిషిపై దేవుని యేలుబడి పోయి, పాపం యెలుబడి క్రిందకు వెళ్ళాడు(అప్పగించ బడ్డాడు). కనుకనే క్రీస్తు మన వలె రక్తమాంసాలు గల నరుడుగా పుట్టి ఈ లోకానికి , సంపూర్ణంగా దేవుని యెలుబడికి తనను తాను జీవితాంతం అప్పగించుకొన్నాడు. పాపం చెయ్యడానికి లాగే బలం..దాని ఆకర్షణ-ప్రేరణ-శోధన క్రీస్తుపై కూడా పనిచేశాయి. ఆయ...

12Feb2018

"దేవుడు నోవహుకు ఆజ్ఞ ఇచ్చినట్టే శరీరం ఉన్న ప్రతిదీ-మగవీ, ఆడవీ ఓడలో ప్రవేశించాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశాడు" (ఆది 7:16) ■ దేవుడు నోవహు ముందు కొన్ని సవాలుకరమైన విషయాలు ఉంచాడు. కొన్ని ప్రశ్నలు నోవహు మదిలో మెదిలి ఎదో ఒక క్షణాన ఆ పని విరమించుకోవచ్చు. "ఈ పని నా సామర్థ్యానికి మించింది.నేను చెయ్యగలనా? నేను ఎప్పుడూ ఓడను కట్టలేదు. నాకు సహాయం ఎవరున్నారు?మొదటికే నాతో ఎవ్వరూ ఏకీభవించరు. ఐనా వర్షం కురుస్తుందా? సకల జీవరాసులు జాతలుజాతలుగా రాగలవా?జంతువులు, ఒకదానిని ఒకటి చంపుకొని తింటాయి..అవి ఏలా ఒకే చోట ఇన్ని నెలలు ఉండగలవు?" ● అవన్నీ చూపునకు అసాధ్యాలు, మునుపెన్నడూ విననివి. ఇవేమీ అతని పనిని ఆపలేకపోయాయి. కారణం! నోవహు అతని సామర్ధ్యం వైపుగాని, ప్రకృతి సహజ నియమాలను గాని చూడలేదు. కానీ వీటన్నిటి పైనున్న దేవుని బలాన్ని మాత్రమే చూశాడు. సృష్టికర్తయైన దేవుని బలసామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయలేదు. దేవుడు తను చెప్పిన మాట తాను నెరవేర్చుకోగల సమర్థుడు. నోవహు దేవుణ్ని విశ్వసించాడు కనుక దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. దేవుని పని మన జీవితంలో జరగాలంటే లోకం వైపు చూడక, దాని అభిప్రాయాలను లక్ష్యపె...

09Feb2018

❇ దేవుడు యిర్మీయాతో౼"యిర్మీయా! నీవు పుస్తకపు చుట్ట తీసుకొని, ఆ మొదటి రోజునుంచి ఈ రోజువరకు నేను చెప్పిన మాటలన్నీ వ్రాయి. నేను వారిమీదికి రప్పించాలనుకొన్న విపత్తు అంతటి విషయం యూదా ప్రజ విని ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవనుంచి మళ్ళితే నేను వారి అపరాధాన్నీ పాపాన్నీ క్షమిస్తాను!” అప్పుడు యిర్మీయా లేఖకుడైన బారూకును పిలిపించాడు. యెహోవా తనతో పలికిన మాటలన్నీ యిర్మీయా చెప్పి బారూకు చేత ఆ చుట్టబడే గ్రంథంలో వ్రాయించాడు. అప్పుడు యిర్మీయా బారూకుతో౼“యెహోవా ఆలయానికి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు. గనుక నీవు వెళ్ళి, ఈ చుట్టిన కాగితంలో నీచేత నేను వ్రాయించిన యెహోవా మాటలను ప్రజలకు చదివి వినిపించు. ఉపవాస దినాన నీవు వెళ్ళాలి. యూదా పట్టణాలనుంచి వచ్చే ప్రజలందరికీ ఈ మాటలు వినిపించు! ఒకవేళ వాళ్ళ విన్నపం యెహోవా సన్నిధానానికి చేరవచ్చు! ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవలనుంచి మళ్ళవచ్చునేమో. నిజంగా ఈ ప్రజకు వ్యతిరేకంగా యెహోవా ప్రకటించిన కోపం, ఆగ్రహం ఇంతంత కాదు.” ❇ ■ యాజకుడైన పషూరు, అధికారుల ఆజ్ఞ మేరకు ఆలయంలోకి యిర్మీయాకు ప్రవేశం లేదు!ఇశ్రాయేలు, యూదా ప్రజలు తమకు మేలు చేసే దేవుని వాక్యాలను మోసుకొచ్చే దైవజనుడిని బుద్ధి...

05Feb2018

❇ పౌలు౼"ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి" (అపో 17:27,28) ❇ ■ నీ కంటూ భూమిపై ఏ ఉనికి లేనప్పుడు, నీవేవరో నీకు జ్ఞప్తిలేని సమయానికి, ఏ బంధుత్వాలు నిన్ను అలుముకోనప్పుడు,ఈ లోకానికి౼చివరికి నీ కన్న తల్లిదండ్రులు సైతం నీవేవరో తెలియనప్పుడు,నీవు పుట్టక మునుపే నిన్ను స్పష్టంగా తెలుసుకొని ఉన్న వాడు దేవుడే. ఆయనే నీ ఉనికికి కారణం, ఆయన ఆలోచనలే నీకు రూపాన్ని ఇచ్చాయి. నీ పుట్టుక ఆయన ఎంపిక! ఆయన నిర్ణయించిన స్థలంలో నీవు ఇప్పుడు ఉన్నావు. నీ పట్ల దేవుని ఆలోచనలు (ప్రణాళికలు) ఈ భూమికి పునాదులు వేయకముందే నిర్ణయింపడ్డాయి. నిన్ను కలుసుకోవడానికి ఆయన ఒక దినం నీ కోసం నియమించాడు. నీ మనస్సు నీ సృష్టికర్తను వెతకక ముందే, ఆయనే మొదట నిన్ను వెతికి, నీకు ప్రత్యక్షమైనాడు. నీ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, స్నేహితులు, బంధుమిత్రులు ఒక్కరొకరిగా నిన్ను విడిచి వెళ్ళిపోతారు గానీ శాశ్వతంగా నిలిచిపోయే భంధం దేవునిదే! నీవు దేవుని సొత్తు! ■ సర్వశక్తిగల దేవుడు నీ మేలు గూర్చి ఆలోచించడం ఎంత గొప్ప సంగతీ! నీ ప్రతి బలహీనతలు, బలాలు, భావోద్వేగాలు, యిష్టాలు, అయిష...

02Feb2018

❇ ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని యేసును ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజనం వరసలో కూర్చున్నాడు. ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ప్రభువు౼“పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతో, చెడుతనంతో నిండి ఉంది... ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు౼“బోధకుడా! ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు” అని ఆయనతో అన్నాడు (లూకా 11:37-54) ❇ ■ మనల్ని ఎవరైనా భోజనానికి పిలిస్తే వారి ఆత్మీయ స్థితి గూర్చి ఇలా ఘాటుగా మాట్లాడగలమా? దేవుని వాక్యంలోని దేవుడు, సశరీరునిగా వారి మధ్యలోకి వస్తే ధర్మశాస్త్ర భోధకులు, మత నిష్ఠగల వారు ఆయన్ను తిరస్కరించారు (ద్వేషించారు). దీనిని బట్టి ఏమి అర్ధమౌతుంది? వారికి వ్రాయబడిన వాక్యం తెల్సు! కానీ వాక్యంలోని సజీవునిగా ఉన్న దేవుణ్ని వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. బైబిల్లో ఉన్న క్రీస్తు, మనం ఊహించుకొని క్రీస్తుకు చాలా తేడా ఉంటుంది. క్రీస్తు సమాధానధిపతి కనుక చాలా మృదువుగా,సున్నితంగా అందరితో మాట్లాడుతూ, అందరి మనన్నలు పొందుతాడని అనుకోవద్దు! అలావుంటే వారు ఆయనకు అసలు సిలువ వేస...

31Jan2018

(నిన్నటి ధ్యానానికి కొనసాగింపు.....) ❇ అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి తెగ నరికాడు. యేసు పేతురుతో౼“కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?” అన్నాడు.అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని బంధించారు.(యోహా 18:10-12) ఆదిలో “వాక్కు” ఉన్నాడు. “వాక్కు” దేవునితో ఉన్నాడు. “వాక్కు” దేవుడై ఉన్నాడు.(యోహా 1:1) ❇ ◆ ఆ దేవుని వాక్కు(bible) శరీరం ధరించుకొని యేసుక్రీస్తుగా మన మధ్యలోకి వచ్చాడు. వాక్కుయైన(bible) క్రీస్తును అవమానించి, శిక్ష విధించడానికి తీసుకవెళ్తుంటే, పేతురు కత్తితో పోరాడి యేసును కాపాడాలనుకున్నాడు. ఆ వాక్కే పేతురుతో చెప్పింది౼“కత్తిని దాని ఒరలో పెట్టు.నా తండ్రే నాకు ఈ శ్రమను పంపాడు". ఆ తర్వాత ఆ వాక్కు పిలాతు(government) ముందు నిలుచుంది. పిలాతు(government) ౼"నీకు తెల్సా నిన్ను విడిపించే శక్తి నాకుందని".ఐతే ఆ వాక్కు౼"ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప, నా మీద నీకు ఏ అధికారం ఉండదు"(నేను మీకు ఏం చెప్తున్నానో అర్ధమైయిందా?) నేడు bible పక్షాన యుద్ధం చేద్దాం...