Skip to main content

26Feb2018

❇ పౌలు బర్నబాతో౼“ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్కు ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, వారెలా ఉన్నారో చూద్దాం” అన్నాడు. అప్పుడు 'మార్కు' అనే పేరున్న యోహానును వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకొని పోవడం భావ్యం కాదని తలంచాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. (అపో 15:36-41)❇
■ "బర్నబా" భక్తిపరుడునూ,ఆదరణ చూపటంలో ఆసక్తిపరుడుగా కనిపిస్తాడు (అపో 4:36,37). ఒకప్పుడు క్రూరుడైన సౌలు(పౌలుగా) మారాక ప్రతి ఒక్కరూ అతన్ని నమ్మక, భయపడి దూరంగా ఉన్నప్పుడు,బర్నబానే అతణ్ణి ఆదరించి అపొస్తలులకు పరిచయం చేశాడు(అపో 9:27). ఆదరించే అతని స్వభావాన్ని బట్టి "బర్నబా" అని అపొస్తలులే అతనికి పేరు పెట్టారు.పౌలు దేవుణ్ని ఎంతో శ్రద్ధగా వెంబడించే వానిగా ఉన్నాడు(zealous for GOD) . క్రీస్తును ఎంత బలంగా ద్వేషించాడో, దేవుడు అతనికి కనపర్చుకొన్న తర్వాత అంతే ప్రేమతో, భయభక్తులతో క్రీస్తును సేవించాడు. క్రీస్తును ధరించుకోవడం కొరకు, తన పట్ల దేవునికున్న ఉద్దేశ్యాల నెరవేర్పు కొరకు ఆకలిదప్పులుగా భావించాడు.
పౌలు-బర్నబాలు మొదటి ప్రయాణంలో బర్నబాకు దగ్గర బంధువైన మార్కును కూడా వెంట తీసుకొని వెళ్లారు.కారణాన్ని దేవుడు వ్రాయించలేదు గాని మార్కు వారిని, దేవుని పరిచర్యను మధ్యలో వదిలివేసి వెళ్ళాడు.ఐతే అది అంత ఆమోద యోగ్యమైనది కాదని, పౌలు బలమైన నిర్ణయాన్ని బట్టి తెలుసుకోవచ్చు. యవ్వనుడైన పౌలులో క్రీస్తు రూపం సంతరించుకుంటున్న దినాలవి. పౌలు దేవుని రూపాన్ని తర్వాత తరాలకు చూపే వ్యక్తిగా రూపుదిద్దుకుంటున్నాడు.
■ పౌలు మార్కును ద్వేషిస్తున్నాడా? రెండవ అవకాశాన్ని ఇవ్వక కృప లేకుండా ప్రవర్తిస్తున్నాడా(పరిసయ్యులు పాపిని నిలదీసినట్లుగా)!?..కాదు! పౌలు దైవికమైన క్రమశిక్షణ చేస్తున్నాడు. పాపాన్ని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.
i. ఒక వ్యక్తికి దైవికమైన వెలిగింపు లేకుండా(దేవుని వాక్యం తెలియక) చేసే అవిధేయత.
ii. కొందరికి వాక్యానుసారం ప్రవర్తించాలనే మనస్సు ఉన్నా  బలహీనత చొప్పున(మునుపు ఉన్న పాపపు బలం చేత) పడిపోయే పాపం.వీరి మనస్సు నిండా దేవుని కొరకు నిలబడాలనే తృష్ణ ఉంటుంది కాక శక్తి చాలక పడే పాపం.
iii. వెలిగింపు(దేవుని ఒప్పింపు) ఉన్నా చులకనగా చూసి ధిక్కరించే పాపం ఉంటుంది. బుద్ధిపూర్వకమైన తమ స్వేచ్ఛతో అవిధేయత!
◆ మొదటి తప్పుకు కృపా, ప్రేమతో సత్యాన్ని చెప్పే వారిగా, పాపం నుండి బయటకు తెచ్చే సహాయకులంగా నిలవాలి. (క్రీస్తు పాపులతో స్నేహితునిగా వారిని దేవుని మార్గానికి త్రిప్పినట్లుగా)
◆ రెండవ తప్పుకు విశ్వాసిని బలపరచే ఊతగా మరొక బలమైన విశ్వాసి నిలవాలి. ఎందుకంటే నేడు బలవంతుడిగా(యవ్వనుడిగా) ఉన్న ప్రతి విశ్వాసి అలాంటి పరిస్థితుల ద్వారా స్థిరపర్చబడినవాడే!(క్రీస్తు పేతురును బలపరచినట్లుగా)
◆ మూడవ తప్పుకు దైవికమైన క్రమశిక్షణ చెయ్యాలి. మేలుకోరి గద్దించడం, తప్పు తెల్సుకొని తిరిగి వచ్చేవరకు వారి స్వేచ్ఛకు విడిచి పెట్టడం, సహవాసం నుండి దూరంగా ఉంచడం లాంటివి.ఇవి ప్రేమలేని తనం కాదు గాని ఆ వ్యక్తిని హృదయపూర్వకంగా ప్రేమించి, తిరిగి దేవునిలో సరి చేసుకోవడానికి ఇచ్చే మౌన సమయం.(క్రీస్తు పరిసయ్యులను, మత పెద్దలను హెచ్చరించినట్లుగా)
ఇది దైవవిధానం.పైన చెప్పిన వారంతా దేవునికి అవిధేయులే కానీ వారితో ఆయన ప్రవర్తించిన తీరు భిన్నమైనది.
■ ఇక్కడ పౌలు మార్కు విషయంలో మూడవ విధానాన్ని అవలంభించాడు. తర్వాత రోజుల్లో సరి చేసుకున్న మార్కును మళ్ళీ పౌలు చేర్చుకున్నాడు. మళ్ళీ సంఘాలు అతన్ని చేర్చుకోవాలని పత్రికలు వ్రాశాడు. తర్వాత కాలంలో ఈ మార్కునే పౌలు సేవలో ఎంతో ఉపయోగకరంగా మారాడు, మార్కు సువార్తను అతనే వ్రాశాడు (కొలస్సి 4:10, 2తిమో 4:11, ఫిలేమో 1:24). దేవునితో నడచే వ్యక్తులు చేసే క్రమశిక్షణలో పగ, ప్రతీకారాలకు అతీతంగా ఆత్మీయ మేలు ఉంటుంది. ఈ సంఘటన అంతరం ఇక అపొస్తలులు కార్యములు గ్రంథంలో బర్నబా పేరు కనిపించదు. సంఘం, పరిశుద్ధాత్ముడు పౌలుతో ఏకీభవిస్తున్నట్లుగా కనబడుతుంది(అపో 15:40,41). మన ప్రేమ కృపలు మానవ జ్ఞానంలో నుండి కాక దైవవాక్యానుసారంగా, అది కూడా సరైన అన్వయింపుతో కొనసాగాలి.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...