Skip to main content

28Feb2018



❇ తెరహు(అబ్రాము తండ్రి) తన కుటుంబముతోబాటు కల్దీయుల 'ఊరు' అను పట్టణమును పెట్టి, 'కనాను'కు ప్రయాణం చేయాలని అనుకున్నారు. తన కుమారుడు అబ్రామును, మనమడు లోతును, కోడలు శారయిని తెరహు తన వెంట తీసుకు వెళ్లాడు. ఐతే వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి,అక్కడ ఉండిపోవాలని నిర్ణయించు కొన్నారు. తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో మరణించాడు.

అప్పుడు యెహోవా అబ్రాముతో౼“నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు. నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి, నేను నీకు చూపించు దేశానికి వెళ్లు..."

అబ్రాము తన భార్య శారయిని, లోతుని, హారానులో వారు గడించిన సంపదనూ, సంపాదించుకొన్న వ్యక్తులనూ తీసుకొని 'కనాను' దేశానికి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు (ఆది 11:31,32; 12:1-5)❇


■ దేవుడు అబ్రామును 'హారాను' పట్టణంకు రాక ముందే అనగా కల్దీయుల దేశంలోని 'ఊరు' అను పట్టణములో ఉండగానే పిలిచాడు(అపో 7:2). తన తండ్రియైన తెరహు ఇంటి పెద్దగా ఉండగా అబ్రాము, అతనితో పాటు కానానుకు ప్రయాణం అయ్యాడు (హెబ్రీ 11:8). 'కానాను' అనే పేరు గల ప్రదేశానికి వెళ్ళమని కూడా దేవుడు చెప్పలేదు. ఎప్పుడైనా దేవుడు పూర్తి వివరాలు ఇవ్వకుండా ముందుకు పంపితే, అందును బట్టి అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉందని దానర్ధం(1 సమూ 16:1, నిర్గమ 14:2 అపో 10:19). ఐతే విగ్రహారధికుడు (యెహో 24:2), వ్యాపారస్తుడు ఐన తెరహు సంపాదనకు 'హారాను' అనువైన ప్రదేశమని తలంచి అక్కడే అబ్రాముతో నిలిచిపోయాడు. ఆత్మీయ ప్రయాణంలో దైవికత్వం లేని ప్రజల ఆధ్వర్యం దేవుని ప్రణాళికలకు అడ్డుబండలుగా మారతారు. దేవునితో నడక అంటే దేవునితో వివాహం అని అర్ధం. అప్పటివరకు ఎవరి ఆధ్వర్యంలో పెరిగామో, ఆ తల్లిదండ్రులను విడచి జీవిత భాగస్వామిని హత్తుకొని ఏక శరీరమైనట్లుగా(ఆది 2:24), మనం కూడా దేవుని అధికారం క్రిందకు సంపూర్ణంగా వెళ్లడం వంటిది. అనగా మన దేహంపై మన కంటే మన జీవిత భాగస్వామికే హక్కు ఉన్నట్లుగా, మనపై సమస్త హక్కును దేవునికి సమర్పించుకొని ముందుకు వెళ్లడం. అలాగే ఆయనవన్నీ మనం స్వతంత్రించు కోవడం (1కొరింధి 7:4, యోహా 17:10). అబ్రాము తండ్రి చాటు బిడ్డగా, తండ్రి మాట కాదనలేక-దేవుని పిలుపును విస్మరించలేక సతమతమయ్యాడు. కనుకనే ఆ అవంతరాన్ని దేవుడే తొలిగించాడు. హారానులో అబ్రాము తండ్రియైన తెరహును దేవుడు తీసుకున్నాడు.

■ దేవుని పిలుపుపై గురిలేని వారు, దేవుని అధికారం క్రింద ఉన్న వారితో తమ ప్రయాణాలను మొదలు పెట్టచ్చోమో గాని, దానిని కొనసాగించలేరు. ఇది మరోసారి అబ్రాము జీవితంలో నిరూపించబడింది. లోతు ఇహలోక ధనార్జననే ధ్యేయంగా ముందుకు వెళ్ళాడు. తన పిన తండ్రియైన అబ్రాము దేవుని చిత్తాన్ని బట్టి,మంచి వ్యాపార స్థలాలను దాటి వెళ్తుంటే ఎంతో అసంతృప్తికి గురైయ్యాడు. ఒక సమయంలో లోకసంభంధమైన విషయాలను బట్టి వేరైయ్యాడు. ఆ విధంగా జరగడానికి పునాది వేసింది కూడా దేవుడే! అబ్రాము జీవితంలో ధనార్జన ఒక భాగమే కానీ అదే ప్రథమం కాదు. అతను దేవుని ఉన్నతమైన పిలుపుకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. లేదంటే వర్తక పట్టణమైన హారాను విడిచే వాడే కాదు. ఉన్నతమైన పిలుపులో అబ్రాము కొనసాగాలంటే దైవిక విషయాల్లో ఆసక్తిలేని, దేవుని ప్రణాళికలకు విలువ ఇవ్వని వారి నుండి దూరం అవ్వడమే సరైనది. కొన్నిసార్లు దేవుడే ఈ వేరుపడే పనిలో చొరవ చూపిస్తాడు. ఈ ఇద్దరు వ్యక్తులు అబ్రాము జీవితం నుండి వేరు పడడాన్ని బట్టి, అతని జీవితంలో అమోఘమైన విశ్వాస పాఠాలను అతను నేర్చుకున్నాడు. అబ్రాము హారానులోనే నివసించి నట్లైతే నేడు అతని విశ్వాసం గూర్చి మాట్లాడుకునే వారం కాము. లోతు దూరం అవ్వకపోతే, ఒకప్పుడు బంజరు భూమిగా ఉన్న ఆ ప్రదేశం పాలుతేనెలు ప్రవహించే దేశంగా చేస్తానన్న దేవుని ప్రమాణాన్ని విశ్వాసంతో చూడటం దూరమయ్యేదేమో! కొన్ని ఎడబాటులు విశ్వాసాన్ని వృద్ధిచేయడానికి దేవుడు ఎంచుకునే అవకాశాలు. నేడు జరుగుతున్న సంఘటనలు దేవుడు ఒకవేళ ఆ దిశగా నడుపుతున్నాడేమో! దేవుడు నడిపే దిశగా విశ్వాస అడుగులు వేస్తావా?నీ చూపు విశ్వాసానికి కర్త దానిని కొనసాగించే దేవుని శక్తిపై కాకుండా పరిస్థితులను, మానవ అంచనాలపై ఆధారపడొద్దు!ఈ ఆత్మీయ పాఠాలకు సిద్ధంగా ఉన్నావా?

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...