Skip to main content

12Mar2018

శోధన:

■ 'శోధన'౼ అనగా ఒక విశ్వాసి పాపం చెయ్యడానికి ప్రేరేపించబడటం. విశ్వాసిని దేవుని నుండి(ఆయన వాక్యంలో నిలువకుండా) వైదొలిగించడానికి సాతాను పన్నే వల. సహజంగా మనం దేవుణ్ని తెలిసికొనక మునుపు ఏ పాపాలను ఇష్టంగా చేస్తామో..ఆ విషయాలనే శోధనకు సాధనాలుగా సాతాను వాడుకుంటాడు. పూర్వం మనకు ఉన్న దురాశలను అనుసరించి నడుచుకొనునట్లుగా ప్రేరేపిస్తాడు (ఎఫె 4:22, తీతు 3:3). 'శోధన' అనేది ప్రతి విశ్వాసికీ సహజంగా కలిగే అనుభవమే! ఇది దేవుని అనుమతితోనే మనకు వస్తాయి. మనం భరింపదగిన దాని కంటే-అనగా మన శక్తికి మించిన శోధనా బలాన్ని మన జీవితంలో ఆయన అనుమతించడు(1కోరింథి 10:13). ఇందులో దేవుని ఉద్దేశ్యం మనల్ని మరింత బలవంతులుగా చెయ్యాలనే కానీ పాపంలో పడటం ఆయన చిత్తం కాదు! 'శోధించబడటం'(పాపపు ప్రేరణ రావటం) తప్పు కాదు, కాని ఆ ప్రేరణకు లొంగి ఆ పాపంలో పడి అపవాదితో ఏకీభవించడం 'పాపం'. శోధన జయించిన ప్రతిసారి మనకు మరికొంత ఆధ్యాత్మిక బలం తోడౌతుంది.

■ ఒకవేళ మనం శోధనలో పడినప్పుడు, వెంటనే దేవుని కృపా సింహాసనాన్ని ఆశ్రయించి ఆ పాపాన్ని వెంటనే కడిగివేసుకోవాలి(1యోహా 2:1). బలహీనతలను (పుర్వపు పాపాలను) చులకనగా తీసుకోక, వేటి విషయంలో నాకు రక్షకుడు అవసరం అని తీర్మానం చేసుకున్నావో (ఆయన రక్తంలో కడుకున్నావో), ఆ రక్షకుణ్ణి ఆశ్రయించి, ఆయన బలంతోనే పాపంతో పోరాటం కొనసాగించాలి(హెబ్రీ 12:4). మన సొంత రక్షణను నిర్లక్ష్యం చేయక, శోధనలో క్రీస్తు యోధునిగా, సర్వాంగ కవచం ధరించుకొని, పాత స్వభావంతో, లోకంతో, అపవాదితో పోరాటం చేయాలి. దేవుని ఆత్మే మనకు సహాయకుడని మరువకూడదు (యోహా 14:26). మనం క్రీస్తు సారూప్యంలోకి మారడానికి దేవుడు తాను ఇవ్వవలినవి మొత్తాన్ని అంతా విశ్వాసికి అనుగ్రహించేశాడు(2 పేతు 1:2, ఎఫె 1:3). విశ్వాసంతో దేవుని వాగ్ధానాలను స్వతంత్రించు కోవడం విశ్వాసి భాద్యతే! మనమంతా జయశీలులుగా ఉండాలనేది మన పట్ల దేవుని చిత్తం. నిజమైన విశ్వాసి ఎవ్వడూ పాపంలో ఆనందించలేడు.గాని ఆ పాపంలో పడిపోయినందుకు దుఃఖపడతాడు. (పాపాన్ని స్నేహించడానికి ఇష్టపడని) దైవచిత్తానుసారమైన దుఃఖం క్రీస్తు కృపలో స్థిరంగా నిలవడానికి దారితీస్తుంది(2 కోరింథి 7:9).

■ శోధనలో పడిపోవడం అనే విషయాన్ని చులకనగా తీసుకుంటే కొన్ని రోజులకు తప్పు చేస్తున్నామన్న భావన మనలో నుండి దూరమౌతుంది. మొదట్లో పాపంలో పడినప్పుడు కలిగిన దుఃఖం కొన్ని రోజులకు సమసిపోతూ ఉంటుంది(ప్రక 3:15). అప్పుడు మన మనసాక్షి శుభ్రంగా లేకుండా, దేవుని ఆత్మకు లోబడకుండా తిరుగు తున్నామని గ్రహింపుకు రావాలి. అలా విశ్వాసి మెల్లగా (అపవాది) తిరిగి తన శరీర యెలుబడికి రహస్యంగా వెళ్లగలడు (హెబ్రీ 6:1-20). అలా కొనసాగడానికి ఇష్టపడేవారు దానిని సమర్ధించుకోవడానికి కారణాలను వెతకుతారు. దేవుని వాక్యం దీనిని ఆత్మీయ వ్యభిచారంగా చెప్తుంది (యకో 4:4). అనగా క్రీస్తును వివాహం చేసుకొని, ఈ లోకంతో రహస్యం సాంగత్యం కోరుకోవడం. ఇది విశ్వాసికి సాధ్యమే! అప్పుడు దేవుడు విశ్వాసి స్వేచ్ఛను గౌరవిస్తూనే, ప్రేమతో గద్దిస్తూనే తిరిగి రమ్మని పిలుస్తుంటాడు.

★ శోధన౼పాపం పట్ల విశ్వాసి వైఖరిని దేవుని యెదుట బహిర్గతం చేస్తుంది. పోరాడుతూ, జయించు వారు ఒక రోజు దేవుని యెదుట ప్రతిఫలం పొందుతారు (ప్రక 2:17). అన్నీ విధాల శోధనల్లో జయాశీలనిగా నిలిచిన 'యేసు' అనే ఒక సంపూర్ణ నరుడు మనం ముందు మాదిరిగా నిలచివున్నాడు. ఆయన మనకు సహాయకుడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...