❇ వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి౼“యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు౼“అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు౼“నా గొర్రెల్ని మేపు” అని అతనితో చెప్పాడు.....
ఆయన మూడోసారి౼“యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి౼“ ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు(యోహాను 21:15-17) ❇
■ ఓడిపోయి, నిరాశ-నిస్పృహలో కృంగివున్న ప్రతి విశ్వాసికి ఓదార్పు..పై వాక్యభాగం. పేతురు-'ఒకప్పుడు నేను ప్రభువు కోసం సమస్తం వదులుకొని వచ్చాను, నమ్మకంగా సేవిస్తున్నాను గనుక దేవుని కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నాకు ఉన్నదనుకున్నాడు'. తన భక్తికి ఉన్న బలం, తన స్వంత శక్తి మీదే ఆధారపడివుందన్న విషయం గ్రహించలేకపోయ్యాడు. ఆ స్థితి మనల్ని గురించి మనం అతిగా ఉహించుకునేందుకు ప్రేరేపించి మనల్ని మోసపుచ్చుతుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆ అబద్ధం మనల్ని విడిపించాలని ఎల్లప్పుడూ కోరతాడు. నిజంగానే పేతురుకు క్రీస్తుపై యెనలేని ప్రేమ ఉంది. కానీ అది దైవబలంతోనే పరిపూర్ణమౌతుంది.
■ మూడున్నర సంవత్సరాలు ఒకనితో ఎంతో సన్నిహిత్యంగా నడిచి, శ్రమల్లో ఉన్నప్పుడు ఆ స్నేహితుడు-'అతనెవరో నాకు తెలియదంటే', అతణ్ని ఎంత నయవంచకునిగా భావిస్తాము. అతనితో తిరిగి స్నేహం చేస్తామా? దగ్గరకు రానిస్తామా? మరో అవకాశం ఇస్తామా? ఆ విధమైన అపరాధ భావంతో పేతురు కుమిలిపోయ్యాడు. ఐతే క్రీస్తు౼'ఓడిపోయి, అపరాధభావంతో, కృంగినపోయి ఉన్న వారిని వెతుక్కుంటూ వచ్చి ప్రేమించే నిజస్నేహితుడు'. ఇప్పుడు పేతురు స్వంత బలం ముక్కలు ముక్కలుగా విరగొట్టబడాలి. అంటే 'ఇక నా బలం శూన్యం, నా గురించి నేను అతిగా ఉహించుకున్నాను, దీనికి నేను అర్హుడను కాను' అనేంతగా నలుగగొట్టబడాలి. అలా ఖాళీగా పాత్రలోనే దేవుని బలం కుమ్మరించడానికి ఖాళీ ప్రదేశం దొరుకుతుంది. మన బలం సంపూర్ణంగా ఖాళీ చెయ్యబడితేనే, దైవం బలం అక్కడకు ప్రవేశిస్తుంది. అదే దీనత్వం.
■ ఇది లోకం చెప్పే దీనత్వం వంటి అర్ధం కాదు. దీనుడు అనగా దేవుని యెదుట తన నిజస్థితిని తాను గుర్తించగలిగిన వాడని అర్ధం. మన జ్ఞానం కంటే దేవుని జ్ఞానం గొప్పదని, ఆయన అంతటి పైన ఉన్నవాడని గుర్తించి, దేవుడు నియమించిన స్థానాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరించి, సంపూర్ణంగా ఆయన చేతికి అప్పగించుకోవటం. 'ఆయన లేకుండా నేనేమి చేయలేను' అని గుర్తించడం. సంపూర్ణంగా దేవునిపై ఆధారపడటం. అలాంటి వారికి(దీనులకు) ఆయన కృప చూపుతాడు. విరగొట్టబడిన వాడు చెప్పే సమాధానం- 'అది మీకే తెలియును ప్రభువా! నా అంచనాలు తారుమారు అవుతాయి. నీవే అన్నిటినీ, అందరిని తెలిసికొన్నవాడవు' అని చెప్పగలుగుతాడు. అంటే దానార్ధం ఆత్మనూన్యతలో ఉండి, ఎల్లప్పుడూ తమ నిస్సహాయతను వ్యక్తం చేసేవారు ఆత్మీయులని కాదు(అట్టి వారు అల్పవిశ్వాసులు, దేవుని శక్తిపై అనుకొనివారు). దేవుని బలాన్ని తమ బలంగా చేసుకుని, ఆయనపై ఆధారపడే వారే నిజమైన దీనులు. బలమైన విశ్వాసులు.
★ అపవాది వాడే అగ్ని బాణం- 'అహంకారం'. అహం భావం ఎక్కడ ఉంటే, అక్కడ దేవుడు తన కృప చూపలేడు. పాపస్వభావం కలిగివున్న మనందరిలో (leaning on own self) గర్వపు తునకలు ఉంటుంది. కొందరిలో స్పష్టంగా, మరికొందరిలో అంతర్గతంగా గూడుకట్టుకొని ఉంటుంది. ఐతే దేవుడు విశ్వాసులను త్రోసి వెయ్యడు గానీ ఎల్లప్పుడూ ప్రత్యక్షతనిస్తూ, విరిస్తూ, తన కృప నుండి తొలగిపోకుండా కాపాడుకుంటాడు.
Comments
Post a Comment