మనం భాధలు, దుఃఖాలు, శ్రమలు, అన్యాయాలు గుండా వెళ్తున్నప్పుడు ఈ క్రింది రెండు సత్యాలను బట్టి ధైర్యంగా వాటిని ఎదుర్కొవచ్చు.
1. దేవునికి తెలిసే ఈ విషయాలు నా జీవితంలోకి వచ్చాయి. ఆయన నన్ను దగ్గర నుండి (అనగా నాలో నుండే నన్ను) ఎరిగివున్నాడు.
2. దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడు.
పై సత్యాలు నేను దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నానని తెలియజేస్తుంటాయి.
యేసు౼"రెండు పిచ్చుకలు పది పైసలకు అమ్ముడు పోతాయి గదా. అయినా వాటిలో ఒక్కటి కూడా మీ పరమ తండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. మీ తల వెంట్రుకలు ఎన్నో లెక్క ఉంది. అందుచేత నిర్భయంగా ఉండండి. అనేక పిచ్చుకలకంటే మీ విలువ ఎక్కువ" (మత్తయి10:29-31)
పేతురు౼"ఆయన మీ విషయం పట్టించుకొంటున్నాడు. గనుక మీ చింత యావత్తూ ఆయనమీద వేయండి". 1 Peter 5:7
*** దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ***
Comments
Post a Comment