(నిన్నటి ధ్యానానికి కొనసాగింపు.....)
❇ అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి తెగ నరికాడు. యేసు పేతురుతో౼“కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?” అన్నాడు.అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని బంధించారు.(యోహా 18:10-12)
ఆదిలో “వాక్కు” ఉన్నాడు. “వాక్కు” దేవునితో ఉన్నాడు. “వాక్కు” దేవుడై ఉన్నాడు.(యోహా 1:1) ❇
◆ ఆ దేవుని వాక్కు(bible) శరీరం ధరించుకొని యేసుక్రీస్తుగా మన మధ్యలోకి వచ్చాడు. వాక్కుయైన(bible) క్రీస్తును అవమానించి, శిక్ష విధించడానికి తీసుకవెళ్తుంటే, పేతురు కత్తితో పోరాడి యేసును కాపాడాలనుకున్నాడు.
ఆ వాక్కే పేతురుతో చెప్పింది౼“కత్తిని దాని ఒరలో పెట్టు.నా తండ్రే నాకు ఈ శ్రమను పంపాడు". ఆ తర్వాత ఆ వాక్కు పిలాతు(government) ముందు నిలుచుంది. పిలాతు(government) ౼"నీకు తెల్సా నిన్ను విడిపించే శక్తి నాకుందని".ఐతే ఆ వాక్కు౼"ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప, నా మీద నీకు ఏ అధికారం ఉండదు"(నేను మీకు ఏం చెప్తున్నానో అర్ధమైయిందా?)
నేడు bible పక్షాన యుద్ధం చేద్దాం రండని పిలిచేవారు,తమ కత్తులతో పోరాడే పేతురు వలె ఉన్నవారు. Government ను ఆశ్రయించి క్రైస్తవుల హక్కులను పరిరక్షించుకుందాం అని చెప్పే వారు భూసంభంధమైన అధికారాన్నే ఘనంగా యెంచే క్రైస్తవులు. వీరి కళ్ళకు పైనున్న అధికారం మాసకబారిబాట్లు కనిపిస్తుంటుంది.
◆ మీకు తెలుసా! అనేక మంది అన్యులు క్రీస్తు గూర్చి చెప్పిన సాక్ష్యల్లో సిలువపై క్రీస్తు క్షమాపణ గుర్చి మాట్లాడతారు. క్రీస్తు తనను చంపుతున్న వారి కోసం ప్రార్థన చేశాడు(స్తెఫను కూడా). ఇది వాక్యం బోధించే క్రైస్తవ్యం. ఈ రోజుల్లో 'bible ని అవమానించేవారిని వదలం' అని పిలుపునిచ్చే భోధకుల్లో క్రీస్తు లేడు, ఆయన మాదిరి లేదు. ఒకవేళ అదే క్రైస్తవ్యం ఐతే మన కంటే పౌలు ఎక్కువగా క్రైస్తవ్యన్ని కాపాడగలడేమో! ఎందుకంటే పౌలుకు కత్తితో మనుష్యులును హింసించడం, చంపడం కూడా తెల్సు! కానీ ఆయన క్రైస్తవునిగా మారాక, మనుష్యుల చేత అనేక హింసలు పొందినా ప్రతి దాడికి దిగలేదు. క్రొత్తనిభంధన క్రైస్తవ్యం మనకు అలా నేర్పించడం లేదు.క్రీస్తు ఒక వినతి పత్రం పట్టుకొని తనను ఇబ్బందులకు గురి చేసే మత పెద్దలకు విరోధంగా గవర్నర్/హేరోదు ముందు నిల్చోవడం ఉహించగలమా!తండ్రి అనుమతి లేకుండా, ఆయన సమయం రాకుండా ఎవ్వరు ఆయన్ని ఏమి చేయలేకపోయారు. సంఘాన్ని హింసిస్తున్న సౌలును చూసి క్రీస్తు౼'నన్నెందుకు హింసిస్తున్నావు' అని పలికి అతన్ని సిలువ సాక్షిగా మార్చేశాడు. Bible ను కాల్చేసిన సాధు సుందర్ సింగ్ ను జీవితకాలం క్రీస్తు ప్రేమ బానిసగా చేశాడు. మనుష్యులను సంధించడానికి దేవుడు ఎంచుకునే మార్గాలు మన ఊహకు అందవు. దేవుని పనిని, ఆయన గౌరవాన్ని ఏ నరుడు తన స్వంత శక్తితో నిలపలేడు. ఐనా క్రీస్తు ఆయన మాదిరిని మనలో కోరితే, అది వదిలేసి క్రీస్తు చెప్పని పోరాటం చేస్తూన్నానంటావేం?
◆ 'మీలో కొందరు క్రీస్తు కొరడా పట్టాడని చెప్తారేమో!'౼ఆయన మతం ముసుగులో దేవుని పేరున వ్యాపారం చేస్తూ దేవుని ఆలయాన్ని దోచే నేటి భోధకుల్లాంటి వారిపైనే గానీ సత్యం ఎరుగక ఎదురాడే వారిపై కాదు. నేడు దేవుణ్ని ఎరుగక(bible ను కాల్చే)ఇలాంటి వారిని చూసి వీళ్లేమి చేస్తున్నారో వీళ్ళకు తెలియదు. వీళ్ళను క్షమించమని తండ్రికి ప్రార్ధన చేస్తాడు. పౌలు మన కంటే జ్ఞానవంతుడు, ఆయన శ్రమలు కలిగినప్పుడు అక్కడి నుండి పారిపోయేవాడు కానీ హక్కుల కోసం పోరాటాలకు దిగలేదు. మీలో కొందరు 'పౌలు రోమియుగా తన పౌరసత్వం గూర్చి మాట్లాడ్డాడని చెప్తారేమో'!౼అపొస్తలులు కార్యములు ఒక చరిత్ర పుస్తకం. అందులో వారి చర్యలన్నింటిని(వారి తప్పులతో సహా) దేవుడు వ్రాయించాడు. పూర్తిగా వాళ్లేమి చేశారో అది మనకు పూర్తిగా ప్రామాణికం అని కాదు! అందరూ ఆస్తులు అమ్మి అపొస్తలులు పాదాల దగ్గర పెట్టారు, అపొస్తలులు చీట్లు వేసి దేవుని చిత్తం తెలుసుకున్నారు. పౌలు, బర్నబా గొడవ పడ్డారు. పౌలు గుండు చేయించుకున్నాడు..మొ|| నవి.
౼ ఐతే పత్రికలు విశ్వాసి అనుసరించాల్సిన సరైన కట్టడలు. మన రాజ్యాంగాన్ని బట్టి మనకు హక్కులు వచ్చినా, రాకపోయినా౼పరలోక రాజు చెప్తున్నాడు, 'శ్రమకు(సిలువకు) సిద్ధపడు, హింసించే వారి కోసం ప్రార్ధన చెయ్యి' అని! కనుక మన పోరాటం మనలో ఉన్న పాపంపై, అపవాదిపై,వాయుమండల అంధకార శక్తులపైనే కానీ దేవుని స్వరూపంగా సృష్టింపబడిన మనుష్యులపై కాదు.(నిన్నటి ధ్యానాల్లో శ్రమలో దాగిన మేలును చూశాము)

Comments
Post a Comment