Skip to main content

23Feb2018

❇ యబ్బేజు తన సోదరులకంటే ఘనుడయ్యాడు. అతని తల్లి “బాధతో ఇతణ్ణి కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు ఇశ్రాయేలు ప్రజల దేవునికి ఇలా మొర పెట్టాడు౼“దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.(1దిన 4:9,10) ❇

■ 'యబ్బేజు' అనే పేరు(వేదన) అతనికి తన ప్రమేయమేమి లేకుండానే వచ్చింది. మన ప్రమేయమేమి లేకుండా మన జీవితంలోకి వచ్చినవి దేవుని అనాదికాల ప్రణాళికల నెరవేర్పుకు దేవుని చేత పంపబడినవే..అవి అలాగే ఉండటం సరైనదే! వాటిని ఆయన తన సంకల్పాల నెరవేర్పుకు అవి ఉండవాల్సి ఉన్నది. ఉదాహరణకు మన రూపం,శరీర ఆకృతి, జనన-సమయాలు,మన తల్లిదండ్రులు, జీవనశైలి, సామాజిక-ఆర్ధిక పరిస్థితులు, అభిరుచులు (భావోద్రేకాలు), పుట్టుకతోనే వచ్చే కొన్ని సమర్ధతలు-అసమర్ధతలు మె||నవి. అంతేకాకుండా మన జీవితాల్లో అకస్మాత్తుగా సంభవించి, మనల్ని బలహీనులుగా మార్చిన చేదైన సంఘటనలు. ఇలా కొన్ని మనం కోరుకోకుండానే మనకు దేవుని చేత ఇవ్వబడ్డాయి. దేవుని చేత నియమించబడినవి, కొన్నిసార్లు మనకు నిరుస్సాహన్ని, దుఃఖాన్ని కలిగించేవిగా ఉంటాయి గనుక ఇలా కాకుండా, 'మరొకనిలా(మరొక విధంగా) ఉంటే బాగుంణ్ణు' అనిపిస్తుంది. 'యబ్బేజు' తన పేరును పిలుస్తున్న ప్రతిసారి తన సహోదరుల కంటే ఎక్కువ తన తల్లిని దుఃఖపెట్టిన నష్టజాతకులా అందరి ముందు కనిపించాడు.

■ ఎక్కడ అవమానం, కృంగుదల ఉంటాయో అక్కడ దేవుని కృప మరి యెక్కువగా విస్తరిస్తుంది (మీకా 5:2). ఒక నిస్సహాయత వాణ్ని దేవునికి మరింత దగ్గరగా చేర్చితే అదే వానికి నిజమైన బలం. అందుకే పౌలు తన బలహీనతల్లో దేవుని కృపను చూస్తూ..దాని బట్టి సంతోషించి అతిశయించాడు (2 కోరింథి 12:9). సహజంగా ఒకడు తన బలహీన సమయంలోనే ఎక్కువగా దేవునిపై ఆధారపడతాడు. అందుకే పాపులు, సుంకరులు క్రీస్తు దగ్గరకు రాగలిగారు. మేము బలవంతులం అనుకున్న మత పెద్దలు క్రీస్తును తిరస్కరించడానికి ఇదొక కారణం. తాను బలవంతుడ్ని అనుకునేవారికి దేవుని అవసరం ఏముంటుంది? ఇది అర్ధం చేసుకున్నప్పుడు మన బలహీనతలు దేవుని నుండి మనల్ని తొలగి పోనియ్యాక, ఆశ్రయించి అంటిపెట్టుకునటానికి సాధకాలని గ్రహించి వాటిని బట్టి పౌలు వలె అతిశయిస్తాము.

■ 'యబ్బేజు' తన సహోదరులందరి కంటే మరి యెక్కువగా దేవుణ్ని ఆనుకొనే వానిగా, ప్రార్ధనాపరునిగా ఉన్నాడు. అతని ప్రార్ధనను దేవుడు ఆలకించాడు. మన స్థితికి కారకులుగా కనిపిస్తున్న వారెవరిని నిందించకూడదు గాని అందులో ఉన్న దేవుని ప్రణాళికలను, ఆయన యొక్క సర్వభౌమ ఆధిపత్యాన్ని గుర్తించి, ఆయన చిత్తాలను గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు, బలహీన ఘటాల్లో శ్రేష్ఠమైన దేవుని మహిమ మరియెక్కువగా కుమ్మరించబడుతుంది. అప్పుడు మన వేదన ఆశీర్వాదంగా మారిపోతుంది. యబ్బేజు అనే వేదన పుత్రుడు, అనేకులకు ఆశీర్వాద పుత్రునిగా మారాడు. యదార్థవంతుడైన ప్రతి ఒక్కడూ తాను బలహీనుడనని గ్రహిస్తాడు. దేవుని అవసరం సమస్త మానవాళికి ఉంది. నీ బలహీనతల్లో దేవుడు మాత్రమే నింపగలిగిన ఖాళీ ప్రదేశం ఉంది. తన ఆత్మ శక్తితో నింపమని ఆయన్ను అడుగు..!అదే నీ బలంగా మారుతుంది.. అప్పుడు మనం వట్టి వారమని గ్రహిస్తూ దేవునికే సంపూర్ణ మహిమను ఆపాదిస్తాము.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...