Skip to main content

02Feb2018

❇ ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని యేసును ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజనం వరసలో కూర్చున్నాడు. ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు.

అప్పుడు ప్రభువు౼“పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతో, చెడుతనంతో నిండి ఉంది...

ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు౼“బోధకుడా! ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు” అని ఆయనతో అన్నాడు (లూకా 11:37-54) ❇

■ మనల్ని ఎవరైనా భోజనానికి పిలిస్తే వారి ఆత్మీయ స్థితి గూర్చి ఇలా ఘాటుగా మాట్లాడగలమా? దేవుని వాక్యంలోని దేవుడు, సశరీరునిగా వారి మధ్యలోకి వస్తే ధర్మశాస్త్ర భోధకులు, మత నిష్ఠగల వారు ఆయన్ను తిరస్కరించారు (ద్వేషించారు). దీనిని బట్టి ఏమి అర్ధమౌతుంది? వారికి వ్రాయబడిన వాక్యం తెల్సు! కానీ వాక్యంలోని సజీవునిగా ఉన్న దేవుణ్ని వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. బైబిల్లో ఉన్న క్రీస్తు, మనం ఊహించుకొని క్రీస్తుకు చాలా తేడా ఉంటుంది. క్రీస్తు సమాధానధిపతి కనుక చాలా మృదువుగా,సున్నితంగా అందరితో మాట్లాడుతూ, అందరి మనన్నలు పొందుతాడని అనుకోవద్దు! అలావుంటే వారు ఆయనకు అసలు సిలువ వేసేవారే కాదు. మనలో చాలా మంది కూడా అందరి మన్ననలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.నిజానికి ఆ సాక్ష్యం వారు అతిశయించడానికి తప్ప ఎందుకూ పనికి రాదు.సత్యవాక్యన్ని చేపట్టి నడుస్తున్న క్రైస్తవుడు అనేకుల చేత ద్వేషించ బడతాడు.అలా జరగకపోతే క్రీస్తు కానీ వేరొక క్రీస్తును నీవు అనుసరిస్తున్నావు.

■ ఆయన వ్యభిచారులతో, అన్యాయస్తులతో, దొంగలతో, నరహంతకులతో ప్రేమగా మాట్లాడేవాడు, పైన చెప్పిన వేషధారులలాంటి వారితో కఠినంగా మాట్లాడేవాడు. ఇది లోకానికి మింగుడు పడని విషయమే! దానికి గల కారణం ఇదే! పాత్ర లోపట, బయట శుభ్రంగా లేని వారు.పాపులుగా లోపల బయట కనబడేవారు. వీరు మారుమనసుకు అవకాశాలు ఉన్నాయి. వీరిలో యదార్థవంతులైన వారంతా దేవున్ని చేరుకుంటారు. బయట శుభ్రం చేసుకుంటూ, లోపల దేవుని వాక్యాన్ని తిరస్కరించే వారినే క్రీస్తు మిక్కిలి అపాయంలో ఉన్నట్లుగా గద్దించాడు.

■ 'పాత్ర బయట మాత్రమే'౼దేవుని వాక్యం చిన్నప్పట్నుంచి తెల్సు, మాకు మనుష్యల మధ్యలో మంచి సాక్ష్యం ఉంది, పరిచర్యలో వాడబడుతున్నాను(మా దేవుడు జోలికి వస్తే ఎంతటి వారినైనా వదలం, చర్చకు రండి మిమ్మల్ని ఒడిస్తాం) అని భక్తి ముసుగులో తృప్తిపడే వ్యక్తులు. ఐతే వారి అంతరంగం దేవుని వాక్యానికి అవిధేయతతో నింపబడి ఉంటుంది. తమ చెడిపోయిన స్వభావాన్ని, దాని భావోద్రేకాలను తృప్తి పరుచుకోవడానికి వాక్యాన్ని వెతుకుతారు. వాక్యం పై వీరు అధికారం చెయ్యడానికి చూస్తారు.కనుక దేవుడు వారిని భ్రష్టత్వానికి అప్ప జెప్పుతాడు. ఒకవేళ క్రీస్తు సశరీరునిగా వారి ముందుకు వస్తే గనుక ఖచ్చితంగా పరిసయ్యుల వలె ఆయన్ను ద్వేషిస్తారు. వీరు దేవునికి చెందిన వారు కారు!

■ అంతరంగంలో ఉన్న పాపాలను-దేవుని యెదుట మన అవిధేయతలను గుర్తిస్తూ మన రక్షకుడైన యేసును ఆ పాపాల నుండి విమోచించే విమోచకునిగా, వ్యక్తిగతంగా దేవుని పరిశుద్ధాత్మ శక్తితో లోకేచ్చలను,పాపాలను జయిస్తూ, క్రీస్తు రూపాన్ని మారే క్రైస్తవునిగా, లోపట శుభ్రపర్చబడే వారుగా వారుంటారు. వీరు క్రీస్తు సంభంధులు.క్రీస్తును పోలి నడుచుకోవడాన్నే ఇష్టపడతారు. వారు తమ స్వభావానికి దినదినం సిలువ వేస్తూవుంటారు. వీరిపై దేవుని వాక్యం అధికారం చేస్తుంది.దేవుని వాక్య అధికారానికి, ఆయన యెలుబడికి వీరు సమ్మతిస్తారు.

★ నీ గిన్నెను లోపట(దేవుని యెదుట), బయట(మనుషులను యెదుట) శుభ్ర పర్చుకోవడానికి ఇష్టపడతావా?

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...