Skip to main content

Posts

Showing posts from October, 2017

30Oct2017

❇ రాజైన అహష్వేరోషు ద్వారం దగ్గరవున్న సేవకులందరూ 'హామాను'కు వంగి నమస్కారం చేయాలని రాజాజ్ఞను జారీ చేశాడు. కనుక వాళ్ళంతా అలా చేశారు. కానీ, యూదుడైన 'మొర్దెకై' వంగలేదు, నమస్కారం చేయనూ లేదు. కనుక హామాను ఆగ్రహంతో నిండిపోయాడు. అతణ్ని ఒకణ్ణే చంపడం చిన్న సంగతి అనుకొన్నాడు, కనుక అతను ఏ జాతికి చెందాడో ఆ జాతివారందరినీ (యూదులందరినీ) నాశనం చేయడానికి అవకాశంకోసం వెదకసాగాడు. మరియు యాభై మూరల ఎత్తు గల ఉరికొయ్యను మొర్దెకై కొరకు చేయించాడు. రాజు అనుమతి కోసం యుక్తిగా సిద్ధపడ్డాడు. ఆ రాత్రి రాజైన అహష్వేరోషుకు నిద్ర పట్టలేదు. గనుక రాజ్య చరిత్ర గ్రంథం తెప్పించి చదివి వినిపించమని సేవకులకు ఆజ్ఞ జారీ చేశాడు. ఒక్కప్పుడు మొర్దెకై రాజుగారి ప్రాణాలను తీయాలని కుట్ర పన్నిన వారిని పట్టించాడు కానీ అప్పుడు అతని మేలును రాజు గుర్తించలేదు. ఇప్పుడు మొర్దెకై చేసిన దాని గూర్చి రాజు విని, అతనికి ఏమి చేయలేదని గుర్తెరిగి.. రాజవస్త్రాలనూ ధరింపజేసి, రాజు యొక్క గుర్రం మీద అతణ్ణి ఎక్కించి నగర వీధుల్లో బహిరంగంగా ఘనపర్చాడు. ఈ పని అంతా హామాను చేత చేయించాడు. హామాను మొర్దెకై జాతిని నాశనం చెయ్యాడానికి కుట్ర పన్నాడని, అతని ...

27Oct2017

❇ పౌలు౼"నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడ్డాను. కాబట్టి ఇక మీదట నేను జీవించటం లేదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న ఈ జీవితం..'నన్ను ప్రేమించి, నా కోసం తన్నుతాను అప్పగించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను'" ❇ 1.జ్ఞానం(intellectual) 2.భావోద్వేగాలు (emotions), 3.స్వచిత్తం(self will)తో కలబోసిన దేవుని స్వభావంలో మానవుడు ప్రత్యేకంగా దేవునిచేత నిర్మించబడ్డాడు. ఏదెను తోటలో మొదటి మానవులు బుద్ధిపూర్వకంగా దేవుడ్ని తిరస్కరించినప్పుడు, చెడిపోయిన స్వభావాన్ని ఫలితంగా పొందారు. తద్వారా దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. మానవుడు తిరిగి ఆయనతో సంభంధంలోకి రావడానికి ఈ మూడింటిని ఆయన తిరిగి వాడుకుంటాడు. మనలో ఆయన్ను గూర్చిన జ్ఞానంతో వెలిగిస్తాడు. మన చెడిపోయిన స్థితిని బట్టి, పశ్చాత్తాపంతో మారుమనస్సు సంబంధమైన దుఃఖాన్ని కలిగిస్తాడు. మన స్వేచ్ఛపూర్వకమైన నిర్ణయంతో మన హృదయాల్లో నివసిస్తాడు. జ్ఞానం, భావోద్రేకాలు మనల్ని చివరికి దేవుని చెంతకు మరలే తీర్మానాలకు నడిపించాలి. అలా జరగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. 1) (వాక్య)జ్ఞానం: దేవుణ్ని గూర్చిన జ...

26Oct2017

❇ యోసేపు మరణశయ్యపై ఉన్నప్పుడు తన సహోదరులతో ౼"నేను చనిపోబోతున్నాను, అయితే దేవుడు మిమ్ములను తప్పక దర్శించి, ఈ దేశం(ఐగుప్తు)నుంచి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన వాగ్ధాన దేశానికి తప్పక తీసుకువెళ్తాడు. సహోదరులారా! నాకు ఒక ప్రమాణం చెయ్యండి. దేవుడు మిమ్మల్ని ఆ వాగ్ధాన దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో కూడ తీసుకొని వెళ్లండి" అని అడిగాడు. యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఐగుప్తులో మరణించాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని మృతదేహాన్ని సిద్ధపరచి, ఐగుప్తులో ఒక శవపేటికలో ఉంచారు ❇ ■ (ఇశ్రాయేలు జాతికి మూలపురుషుడైన) అబ్రాహాముతో దేవుడు ప్రమాణం చేసినట్లుగా, తప్పకుండా ఐగుప్తు దేశం నుండి దేవుడు తీసుకుని వెళ్తాడని యోసేపు దృఢంగా నమ్మాడు(ఆది 15:13,14). అతని విశ్వాసానికి గుర్తుగా తన ఎముకలను వాగ్దాన దేశంలో పూడ్చిపెట్టమని కోరాడు. జ్ఞానవంతుడైన యోసేపు ఒకప్పుడు భయంకరమైన కరువు నుండి ఐగుప్తు సామ్రాజ్యాన్ని రక్షించాడు.తర్వాత ఎన్నో తరాలు గడిచిపోయాయి.ఆ తర్వాత రోజుల్లో యోసేపు ఎవరో కూడా గుర్తుపట్టలేని రాజులు పరిపాలన చేశారు.యోసేపు విశ్వాసాన్ని దేవుడు తరాల వెంబడి తరాలకు చేరవేస్త...

25Oct2017

❇ ఆ రాత్రిలోనే దేవుడు గిద్యోనుతో౼"మీ తండ్రికున్న ఎద్దులల్లో ఏడేళ్ళ వయస్సున్న ఎద్దును తీసుకో! మీ తండ్రి బయలు దేవుడికి కట్టిన బలిపీఠాన్ని పడగొట్టు! దాని ప్రక్కన ఉన్న అషేరాదేవి స్తంభాన్ని నరికివెయ్యి! అప్పుడు ఈ బండమీద చక్కగా పేర్చి నీ దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టు. ఆ ఎద్దును తీసుకువచ్చి, హోమబలిగా అర్పించు! నీవు నరికివేసిన అషేరాదేవి స్తంభం చెక్కను కట్టెలుగా వాడుకో!" గిద్యోను తన పనివాళ్ళలో పదిమందిని తీసుకువెళ్ళి, యెహోవా తనకు చెప్పినట్టే చేశాడు. ఐతే అతడు తన కుటుంబం వారికీ, ఆ ఊరివాళ్ళకూ భయపడి పగలు చెయ్యకలేక రాత్రి వేళ అలా చేశాడు. ప్రొద్దున ఊరివాళ్ళు లేచేసరికి బయలు దేవుడి బలిపీఠం ముక్కలైవుంది! దాని ప్రక్కగా ఉన్న అషేరాదేవి స్తంభం నరికివేసివుంది! క్రొత్తగా కట్టిన బలిపీఠం ఒకటి ఉంది! దానిమీద ఎద్దు బలిగా అర్పించబడివుంది! ఆ ఊరి వారు గిద్యోను చేశాడని తెల్సుకొని, అతణ్ణి చంపాలనుకున్నారు. ❇ ■ ఇశ్రాయేలీయులు సజీవుడైన దేవుణ్ణి విడిచి, విగ్రహారాధన వైపు తిరిగి, దేవునికి బహు దుఃఖాన్ని కలుగజేశారు. కనుక ఆయన వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. వారు ఇశ్రాయేలీయుల్ని దోచుకొని, విపరీతంగా వారిని భ...

24Oct2017

❇ ఆయన యెరూషలేంకు ప్రయాణమై గలిలయ నుండి సమరయ పొలిమేరలకు వచ్చాడు. అక్కడ పదిమంది కుష్టురోగులు ఆయన దగ్గరకు వచ్చారు. వారు ఆయనకు కొద్ది దూరంలో నిలుచొని౼"యేసు ప్రభూ! మాపై దయచూపు" అని గట్టిగా కేకలు వేసారు. ఆయన వారిని చూసి౼"మీరు వెళ్లి, యాజకులకు కనపడండి" అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి బిగ్గరగా, దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.అతను సమరయ జాతివాడు. అందుకు యేసు౼"పది మంది శుద్ధులయ్యారు కదా! మిగతా తొమ్మిది మంది ఎక్కడ? ఈ సమరయుడు తప్ప మరెవ్వరూ దేవుణ్ణి స్తుతించటానికి తిరిగి రాలేదా?" అన్నాడు. ఆ తర్వాత అతనితో౼"నువ్వు లేచి వెళ్ళు! నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది" అని చెప్పాడు. ❇ ■ పదిమంది కుష్ఠురోగులు యేసును వేడుకున్నప్పుడూ.. స్వస్థత పొందినప్పుడూ.. వారిని  గూర్చి ఒక గుంపుగానే చెప్పబడింది. వారు బాగుపడిన తర్వాత, మిగితా వారికి భిన్నంగా ఒక్కడు ప్రవర్తించాడు.వాడు యూదుల చేత హీనంగా ఎంచబడే(అధమ జాతి) సమరయుడు. వాడు బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ ...

23Oct2017

❇ ఫిలిష్తీయ సైనికుల గుంపు బేత్లెహేంలో ఉంది. అప్పుడు దావీదు అదుల్లాం గుహలో దాగి ఉన్నాడు. దావీదు సైన్యంలో ముఖ్యులైన ముగ్గురు యోధులు అప్పుడు అతనితో పాటే ఉన్నారు. దావీదు౼"బేత్లెహేం ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే బావుండు!" అని ఆశపడ్డాడు. ఆ ముగ్గురు యోధులు ప్రాణాలకు తెగించి, ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి వెళ్లి, బేత్లెహేం ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు చేదుకొని దావీదు దగ్గరకు తీసికొని వచ్చారు.అయితే అతడు ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించి దేవుని సన్నిధానంలో పారబోశాడు.  “నేను ఈ నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక! వీరు ప్రాణానికి తెగించి వెళ్ళి ఇవి తెచ్చారు. ఇవి వీరి రక్తంతో సమానం. నేను తాగుతానా?” అని చెప్పి ఆ నీళ్ళు త్రాగలేదు (1దిన 11:16-19). ❇ "బేత్లెహేం" దావీదు స్వంత ఊరు. అందుకే ఒకవేళ ఆ నీళ్లు త్రాగాలని కోరిక పుట్టి ఉండొచ్చు! ముగ్గురు యోధులు ప్రాణాలకు తెగించి తమ రాజు కోరికను తీర్చడానికి సిద్దమయ్యారు.(వారి ప్రాణాలు కోల్పోలేదు). కానీ ఆ నీళ్ళను వారి రక్తంగా రాజు భావించాడు. అప్పటికి తన వరకే ఆలోచించాడు కానీ, తర్వాత ఉన్న ప్రాణాపాయాన్ని గుర్తి...

20Oct2017

❇ దేవుడు అబ్రాహామును పరీక్షించాలనుకొన్నాడు. దేవుడు అబ్రాహాముతో౼"నీకున్న ఒకే కొడుకును, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకొని మోరీయా ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతణ్ణి దహనబలిగా నాకు అర్పించు!" అన్నాడు.... అబ్రాహాము ఉదయాన్నే లేచి దేవుడు తనకు వెళ్లమని చెప్పిన చోటుకి కుమారునితో వెళ్లాడు. అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును కట్టివేసాడు. బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు. దేవునికి బలిగా అర్పించడానికి తన చెయ్యి చాపి ఖడ్గం పైకెత్తి సిద్ధమయ్యాడు.. అప్పుడు దేవునిదూత ఆకాశం నుండి౼"అతణ్ణేమీ చేయకు. దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని ఇప్పుడు నాకు తెలుస్తుంది. నా కోసం నీ కొడుకును బలిగా అర్పించడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకున్న ఏకైక కుమారుడు. అతణ్ణి సైతం నాకివ్వడానికి వెనక్కు తీయలేదు కనుక నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను...."(ఆది 22) ❇ ■ అబ్రాహాము అప్పటికే ధనాన్ని తుచ్ఛమైనది ఎంచి, దేవుని మాటను ఘనపర్చాడు. కానీ ఈ సంఘటనతో దేవుణ్ని పరిపూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడని రుజువు చేసుకున్నాడు. ...

18Oct2017

★ i) క్రూరుడు, క్రీస్తు సంఘాన్ని హింసించిన సౌలు(పౌలు) క్రైస్తవునిగా మారిపోయిన తర్వాత తొలిసారిగా యెరూషలేములో ఉన్న అపొస్తలులను(క్రీస్తు శిష్యులును) కలవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతడు మారిపోయ్యాడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు. ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. ఐతే "బర్నబా" అతనిని చేరదీసి, అపొస్తలుల దగ్గరికి తీసుకొని వచ్చి వారికి పరిచయం చేశాడు (అ.కా 9:26-29). కొన్ని సంవత్సరాల తర్వాత.. ii) పౌలు బర్నబాతో౼ "మనం ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్యం ప్రకటించామో, ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్లి, వారెలా ఉన్నారో చూద్దాము" అన్నాడు. మునుపు తమతో రాకుండా మధ్యలో విడిచి వెళ్ళిపోయిన మార్కును వెంట బెట్టుకొని పోవడం భావ్యం కాదని పౌలు తలంచాడు. ఐతే అతణ్ని వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు (అ.కా 15:36-41). iii) పౌలు-"పేతురు (క్రీస్తు శిష్యులలో ముఖ్యుడు) అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. అతడు అన్యులతో(యూదులు కాని వారితో) భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో యూదులు రాగానే వా...

17Oct2017

❇ అమాలేకీయులు వచ్చి రెఫిదీంలో ఇశ్రాయేలీయులతో యుద్ధం జరిగించారు. గనుక మోషే యెహోషువతో ౼"మనకోసం మనుషులను ఎన్నుకొని వారిని తీసుకువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరంపై నిలబడతాను" అన్నాడు. మోషే తనకు చెప్పినట్టే యెహోషువ చేసి అమాలేకీయులతో యుద్ధం జరిగించాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరమెక్కారు. అప్పుడు జరిగినదేమిటంటే, మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలవసాగారు; చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవసాగారు. అయితే మోషే చేతులు బరువెక్కాయి. అందుచేత వారు ఒక రాయి తీసుకువచ్చి దానిమీద మోషేను కూర్చోబెట్టారు. అహరోను ఈ ప్రక్క, హూరు ఆ ప్రక్క ఉండి, అతని చేతులు క్రిందకు దించకుండా ఎత్తి పట్టుకొన్నారు. అలా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకూ కదలకుండా ఉన్నాయి. ఆలోగా యెహోషువ ఖడ్గంతో అమాలేకీయుల రాజునూ, అతని సైన్యాన్ని ఓడించాడు. ❇ ■ రెఫిదీంకు దేవుడే ఇశ్రాయేలీయులను నడిపించాడు(నిర్గ 17:1). మొదట అక్కడ నీళ్లు దొరకనదుకు వాళ్ళు మోషేపై దేవునిపై సణిగారు. దేవుడు బండను చీల్చి వారి దాహాన్ని తీర్చాడు. తర్వాత అక్కడే అమాలేకీయులు వారితో యుద్దానికి దిగారు...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...

14Oct2017

❇ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. వారి ముందు ఇశ్రాయేలీయులు నిలువలేక పారిపోయారు.చాలా మంది సైనికులు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు. రాజైన సౌలు యొక్క ముగ్గురు కుమారులను అతని కళ్ళ ముందే చంపారు. ఇది చూసి అప్పటికే బాగా గాయపడిన సౌలు తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలిష్తీయులు సౌలు తలను ఛేదించి దాగోను దేవుడి గుడిలో తగిలించారు. అతని మొండాన్ని బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు. ఇలా దేవుని చేత అభిషేకించబడిన రాజైన సౌలు జీవితం విషాదంతో ముగిసింది. సౌలు దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చి, దేవుని దృష్టి యెదుట ద్రోహము చేశాడు. అంతేకాకుండా దేవుని దగ్గర కనిపెట్టకుండా కర్ణపిశాచముల సహాయంతో సోదె చెప్పె దానిని వెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ కారణాలను బట్టి దేవుడు అతనికి మరణశిక్ష విధించి, రాజ్యాన్ని దావీదు వశము చేసెను.(1దిన 10) ❇ ✔ ఒకప్పుడు ఇదే ఇశ్రాయేలీయులే ఫిలిష్తీయులను తరిమి తరిమి చంపారు(1సమూ 17:52). శత్రువులైన ఫిలిష్తీయులు దండెత్తి వచ్చిన ప్రతిసారీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టారు. కారణం దైవభయం కలిగిన శూరుడైన దావీదు. దేవుని యెదుట సుబుద్ధి కలిగిన ఒక్క వ్యక్తి ప్రభావం, ఆ దేశం అంతటిపైనా కన...

11Oct2017

❇ "దేవుని మీద విశ్వాసం వల్లే మోషే, పెద్దవాడయిన తరువాత ఐగుప్తు చక్రవర్తి కూతురి కుమారుడని అనిపించుకోవడానికి నిరాకరించాడు. అల్పకాలం పాపంలోని సుఖభోగాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడానికే అతడు కోరుకొన్నాడు" "తన ద్వారానే ఇశ్రాయేలీయులను దేవుడు విడిపిస్తాడనే విషయం తన బానిస సోదరులు గ్రహిస్తారని, మోషే అనుకొన్నాడు. కానీ వారు గ్రహించలేదు. వారి నిమిత్తమే మోషే ఒక ఐగుప్తుయుని హత్య చేశాడు. ఆ విషయం బయటపడినందుకు మోషే మిద్యానుకు పారిపోయాడు" ❇ ■ ఐగుప్తు రాజకుమారుడుగా పెరిగిన మోషే, దేవుని మీద విశ్వాసంతో ఎవ్వరూ చేయ్యలేని త్యాగాన్ని చేశాడు. అంతఃపురాన్ని, విలాసవంతమైన సుఖసౌఖ్యాలు వదిలి, బానిసల్లో ఒకనిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. కానీ బానిసలైన అతని స్వంత ప్రజలే అతన్ని తిరస్కరించారు. అతని విశ్వాసం, త్యాగపూరితమైన నిర్ణయం.. అతణ్ణి దేవుని పనికి సమర్థునిగా చెయ్యలేకపోయింది. అవమాన భారంతో,చివరికి చేదైన అనుభవాలతో కృంగిపోయి, అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ■ ఒకవేళ ఆ సమయంలో ఎన్నో ప్రశ్నలు మోషేలో మదిలో మెదిలి ఉండొచ్చు. "వీరి కోసం ఎంత చేసినా గుర్తించని కఠినమైన ప...

10Oct2017

❇  "మీరు పాపం విషయంలో చనిపోయారనీ, దేవుని విషయంలో మన ప్రభువైన క్రీస్తు యేసులో సజీవులనీ మిమ్ములను మీరే ఎంచుకోండి" (రోమా 6:11) "మరణించిన యేసును సజీవంగా లేపిన దేవుని ఆత్మ (పరిశుద్ధాత్ముడు) మీలో నివసిస్తున్నట్లైతే, చనిపోయిన వారిలో నుంచి క్రీస్తును లేపిన దేవుడే, చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా, మీలో నివాసముంటున్న ఆయన ఆత్మ ద్వారానే బ్రతికిస్తాడు" (రోమా 8:11) ❇ ✔ మన పాపం వల్ల దేవునితో ఎడబాటు(ఆత్మలో చచ్చిన స్థితి)౼ రక్షకుడైన యేసులో విశ్వాసం వల్ల దేవుని ఉగ్రత నుండి రక్షణ గూర్చి నిన్నటి ధ్యానంలో తెల్సుకున్నాము. "ఒకప్పుడు పాపంలో స్వేచ్ఛగా జీవించి, దేవునితో సంభంధం విషయంలో చచ్చిన మనం, నేడు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో జీవం గలిగిన వారిగా ఎంచుకోమని" బైబిల్ బోధిస్తుంది. ✔ అంటే "యేసు సిలువలో నా పాపం నిమిత్తం చనిపోయాడు, నా పాపంపై సంపూర్ణ విజయంతో తిరిగి లేచాడు" అని నమ్మిన మనం,అదే విశ్వాసాన్ని మన జీవితంలో కూడా రుజువు చెయ్యాల్సివుంది. క్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు నీ పాపాన్ని తనపై వేసుకొని, నీ స్థానంలో చనిపోయ్యాడు అని నమ్ముతున్నావు కదా! ఇప్పుడు రక...

07Oct2017

❇ యేసు ఒక కథ చెప్పాడు–"తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా పరలోకరాజ్యం ఉంది. ఆ రైతు పనివాళ్ళు నిద్రపోతూ ఉంటే, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు. మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి . అప్పుడు పనివాళ్ళు ఆ రైతు దగ్గరికి వచ్చి౼"అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా! అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?" అని అడిగారు. "ఇది పగవాడు చేసిన పని!" అని అతడు వారితో అన్నాడు. పనివాళ్ళు౼"మేము వెళ్లి ఆ కలుపు మొక్కల్ని పీకేయ మంటారా?" అని అతన్ని అడిగారు. అందుకా రైతు౼"వద్దు! కలుపు మొక్కల్ని పీకివేసేటప్పుడు, వాటితోపాటు గోధుమ మొక్కల్నీ పెళ్లగిస్తారేమో..కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో 'ముందుగా కలుపు మొక్కలు పోగుచేసి కాల్చి వేయడానికి కట్టలు కట్టండి. అప్పుడు గోధుమలు నా గిడ్డంగిలో చేర్చండి' అని కోత కోసే వారికి చెబుతాను" అన్నాడు ❇ ✔ ప్రతి రైతు తన పొలం నుండి శ్రేష్ఠమైన పంటనే ఆశిస్తాడు. దేవుడు ఈ లోకమనే పొలంను శ్రేష్ఠమైన వాటితో నింపాడు. ఆయన మాటలనే మంచి...

09Oct2017

❇ మన అతిక్రమాల వల్ల, పాపాల వల్ల మనం చచ్చిన వాళ్ళంగా ఉన్నాము...ఐతే దేవుడు కరుణాసంపన్నుడు కాబట్టి, మనం ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనల్ని క్రీస్తుతో ద్వారా బ్రతికించాడు.క్రీస్తులో విశ్వాసం ద్వారా, దేవుని కృప చేతనే మనకు రక్షణ కలుగుతుంది. ఇది మన మంచి పనుల వల్ల కలిగింది కాదు, దేవుడిచ్చిన బహుమానమే! కాబట్టి ఎవరూ దేవుని రక్షణ గూర్చి గొప్పలు చెప్పుకోడానికి వీల్లేదు. ❇ ✔ మనం దేవునితో ఏమాత్రం సంబంధం లేనివారమై, పాపం చేస్తూ ఉన్నాము. దేవునితో ఉన్న ఈ ఎడబాటునే బైబిల్ "ఆత్మలో చచ్చిన స్థితి" అని పిలుస్తుంది. చనిపోయిన వాడు లోకంతో ఉన్న అన్ని సంభంధాలను, అనుబంధాలను కోల్పోతాడు. అలాగే దేవుడు సృష్టించిన సృష్టిలో బ్రతుకుతున్నప్పటికీ, ఆ దేవుని ఉనికిని, సహవాసాన్ని ఏమాత్రం గుర్తించని వాడిగా ఉంటాడు. కానీ మానవాళి(సృష్టి) అంతా ఆ దేవుని మీదే ఆధారపడి జీవిస్తువుంది. దేవుడు మనిషికి దూరంగా ఉన్నాడా?లేదు..మనమే చచ్చిన స్థితిలో దేవునితో సంభంధం లేక ఉన్నాము. వాయుమండలంలో తిరుగాడే (సాతాను) దైవవిరోధమైన ఆత్మ సృష్టిలో ఉంది. ఎంతో జ్ఞానపూరితమైన ఈ లోకంలో, అత్యంత అసహ్యమైన పనులు జరుగుతూ ఉన్నాయి...

05Oct2017

❇ పేతురు పెంతుకోస్తూ దినాన నిలువబడి౼"ఇశ్రాయేలు ప్రజలారా! ఈ మాటలు వినండి..దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకూ తెలుసు!..ఈయన్ని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించారు. మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనల నుంచి ఆయన్ను విడిపించి సజీవంగా లేపాడు" ఇది వింటూ ఉంటే వారికి గుండెలలో బాకుతో పొడిచినట్లయి ౼"సోదరులారా, మేమేం చేయ్యాలి?"అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. దానికి పేతురు౼"మీరు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం ప్రతివాడూ యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం పొందండి". ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో వారికి సాక్ష్యమిచ్చి "మీరు యీ దుష్టతరం నుండి వేరుపడి రక్షణ పొందండి" అని వారిని హెచ్చరించాడు. ❇ ✔ ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే వారు యేసును సిలువకు అప్పగించి మహా పాపానికి ఒడిగట్టారు. నిజానికి యేసును ప్రధాన యాజకులు, మత పెద్దలే కుట్రపన్ని చంపినా..పరోక్షంగా ప్రజలు దానికి సమ్మతి పలికారు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైన సమ్మతించిన పాపం పాపమేనని ఈ మాటల ద్వారా గ్ర...