❇ ఆ రాత్రిలోనే దేవుడు గిద్యోనుతో౼"మీ తండ్రికున్న ఎద్దులల్లో ఏడేళ్ళ వయస్సున్న ఎద్దును తీసుకో! మీ తండ్రి బయలు దేవుడికి కట్టిన బలిపీఠాన్ని పడగొట్టు! దాని ప్రక్కన ఉన్న అషేరాదేవి స్తంభాన్ని నరికివెయ్యి! అప్పుడు ఈ బండమీద చక్కగా పేర్చి నీ దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టు. ఆ ఎద్దును తీసుకువచ్చి, హోమబలిగా అర్పించు! నీవు నరికివేసిన అషేరాదేవి స్తంభం చెక్కను కట్టెలుగా వాడుకో!"
గిద్యోను తన పనివాళ్ళలో పదిమందిని తీసుకువెళ్ళి, యెహోవా తనకు చెప్పినట్టే చేశాడు. ఐతే అతడు తన కుటుంబం వారికీ, ఆ ఊరివాళ్ళకూ భయపడి పగలు చెయ్యకలేక రాత్రి వేళ అలా చేశాడు.
ప్రొద్దున ఊరివాళ్ళు లేచేసరికి బయలు దేవుడి బలిపీఠం ముక్కలైవుంది! దాని ప్రక్కగా ఉన్న అషేరాదేవి స్తంభం నరికివేసివుంది! క్రొత్తగా కట్టిన బలిపీఠం ఒకటి ఉంది! దానిమీద ఎద్దు బలిగా అర్పించబడివుంది! ఆ ఊరి వారు గిద్యోను చేశాడని తెల్సుకొని, అతణ్ణి చంపాలనుకున్నారు. ❇
■ ఇశ్రాయేలీయులు సజీవుడైన దేవుణ్ణి విడిచి, విగ్రహారాధన వైపు తిరిగి, దేవునికి బహు దుఃఖాన్ని కలుగజేశారు. కనుక ఆయన వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. వారు ఇశ్రాయేలీయుల్ని దోచుకొని, విపరీతంగా వారిని భాధిస్తున్న రోజులవి. గిద్యోను యదార్ధవంతుడు.గిద్యోను స్వతహాగా భయస్తుడు.కానీ అతని తండ్రి చేస్తున్న విగ్రహారాధన అంగీకరించక, ఇలాంటి పరిస్థితులను దేవుడు ఎందుకు పంపాడో అర్ధంకాక సతమతమౌతున్న ఒక సామాన్యుడు. అతని మదిలో సమాధానంలేని ఎన్నో ప్రశ్నలు.అలా ఉన్నప్పుడు ఒక రోజు..
■ దేవుడు అతణ్ణి పిలిచి, ఆ ప్రజలను విడిపించే రక్షకుడిగా నియమించాడు. వెంటనే ఆయన చేయమన్న పని ఏంటో తెలుసా? తన తండ్రి ఇంటికీ, ఆ ఊరి వారికి విరోధంగా పైన చెప్పినట్లు చేయమని చెప్పాడు.అప్పటి వరకు అతను ఇలాంటి పనులేన్నడూ చెయ్యలేదు. దేవుడు మొదట ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని ఈ లోకం నుండి,లోక సంభంధుల(విధానాల) నుండి ప్రత్యేకపరుస్తాడు. ఇది ఆదిలో నుండి ఆయన విధానం.
"అబ్రాహామును తన తండ్రి ఇంటి నుండి, యోసేపును అన్నల నుండి, మోషే ఫరో కోటనుండి..యాకోబు, యోహానులు తమ తండ్రియైన జెబదేయ నుండి.." etc. వెలుగు నుండి చీకటిని వేరు చెయ్యటం సృష్టారాభం నుండే దేవుడు తలపెట్టిన కార్యం.
■ యేసు"౼నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. అది ఇప్పటికే రగులుకుని మండాలని ఎంతగానో కోరుతున్నాను. భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చానని అనుకొంటున్నారా? శాంతి కాదు! దానికి బదులుగా చీలిక కలిగించడానికి వచ్చానని మీతో చెపుతున్నాను. ఇప్పట్నుంచి ఒకే ఇంట్లో అయిదుగురు ఉంటే, విభేదం కలిగి ముగ్గురు ఇద్దరికి ప్రతికూలంగా, ఇద్దరు ముగ్గురికి ప్రతికూలంగా ఉంటారు"(లూకా 12:49-53).
దేవుడు సమాధానానికే కాదు, అగ్ని కూడా కారకుడని వాక్యం సెలవిస్తుంది.అంటే అందరూ ఒకరి నుండి ఒకరు వేరై విరోధుల్లా ఉండాలనా? కాదు! సత్యం విషయంలో బంధుత్వాలను సైతం లెక్కచేయకుండా దేవుణ్ణి హత్తుకోవాలని దానార్ధం! 'మొదటి స్థానం దేవునిదే' అని దేవుని పక్షాన నిలవటం.అలా నిలిచిన వారే దేవుని వారౌతారు. అలాంటి వారిని గూర్చి క్రీస్తు ఒకరోజు తన తండ్రి ముందు,దేవదూతలు ముందు సాక్ష్యంపలుకుతాడు.
(దేవునిలో మనకు నచ్చిన కొన్ని లక్షణాలను తీసుకుని, మిగితా వాటిని నిర్లక్యం చేస్తే,ఆయన వాక్యంలో క్రీస్తు అవ్వడు, గానీ మన స్వంత ఆలోచనల్లో క్రీస్తు అవుతాడు. దేవుడు ఎల్లప్పుడూ క్షమాపనే కాదు శిక్షించే తండ్రి కూడా! ప్రేమ మాత్రమే కాడు, న్యాయాధిపతి కూడా!దీర్ఘశాంతమే కాదు ఆయనలో ఉగ్రత కూడా ఉంది)
Comments
Post a Comment