Skip to main content

30Oct2017

❇ రాజైన అహష్వేరోషు ద్వారం దగ్గరవున్న సేవకులందరూ 'హామాను'కు వంగి నమస్కారం చేయాలని రాజాజ్ఞను జారీ చేశాడు. కనుక వాళ్ళంతా అలా చేశారు. కానీ, యూదుడైన 'మొర్దెకై' వంగలేదు, నమస్కారం చేయనూ లేదు. కనుక హామాను ఆగ్రహంతో నిండిపోయాడు. అతణ్ని ఒకణ్ణే చంపడం చిన్న సంగతి అనుకొన్నాడు, కనుక అతను ఏ జాతికి చెందాడో ఆ జాతివారందరినీ (యూదులందరినీ) నాశనం చేయడానికి అవకాశంకోసం వెదకసాగాడు. మరియు యాభై మూరల ఎత్తు గల ఉరికొయ్యను మొర్దెకై కొరకు చేయించాడు. రాజు అనుమతి కోసం యుక్తిగా సిద్ధపడ్డాడు.

ఆ రాత్రి రాజైన అహష్వేరోషుకు నిద్ర పట్టలేదు. గనుక రాజ్య చరిత్ర గ్రంథం తెప్పించి చదివి వినిపించమని సేవకులకు ఆజ్ఞ జారీ చేశాడు. ఒక్కప్పుడు మొర్దెకై రాజుగారి ప్రాణాలను తీయాలని కుట్ర పన్నిన వారిని పట్టించాడు కానీ అప్పుడు అతని మేలును రాజు గుర్తించలేదు. ఇప్పుడు మొర్దెకై చేసిన దాని గూర్చి రాజు విని, అతనికి ఏమి చేయలేదని గుర్తెరిగి..

రాజవస్త్రాలనూ ధరింపజేసి, రాజు యొక్క గుర్రం మీద అతణ్ణి ఎక్కించి నగర వీధుల్లో బహిరంగంగా ఘనపర్చాడు. ఈ పని అంతా హామాను చేత చేయించాడు. హామాను మొర్దెకై జాతిని నాశనం చెయ్యాడానికి కుట్ర పన్నాడని, అతని కోసం ఉరి కొయ్యను సిద్ధం చేశాడని రాజు తెల్సుకొని, అదే ఉరికొయ్యపై హామాను చంపించాడు. ❇


■ మనుష్యులందరూ దేవుని ఆధీనంలో ఉన్నారు. ఆధిపత్యాలను, అధికారాలను ఆయన ఏ క్షణంలోనైనా తారుమారు చేయగల సమర్థుడు.ఒకనికి ఇవ్వగలడు, అది తీసివేయ్యగలడు. అధికారం అనే మత్తులో ఉన్నప్పుడు, మనందరిపై హెచ్చుగా ఉన్న సర్వోన్నతుని దేవుని సింహాసనాన్ని అధికారాన్ని మర్చిపోయి౼'అంతా నా చేతిలోనే ఉందనే' భ్రమలోకి నడిపిస్తుంది(ప్రక18:7-10, లూకా12:20).అంతం లేని కాలాల్లో మనుషులను,రాజ్యాలను, దేశాలను పరిపాలన చేస్తున్న రారాజు దేవుడు!

■ 'హామాను' తన అధికారాన్ని ధిక్కరించిన వారిపై విషపు చూపు చూసే..దైవ భయం లేని వ్యక్తి. ఒకవేళ సరిద్దిద్దు కోవడానికి ఇష్టపడని ఇతని కఠిన వైఖరిని బట్టి, ఇతని అంతం కొరకే దేవుడు 'మొర్దెకై'ని ఇతని జీవితంలోకి పంపాడేమో అనిపిస్తుంది! విషపు చూపులకు, కుయుక్తులకు దేవుడు విరోధి(సామె 3:32).ఆయన కన్ను ప్రతి హృదయాన్ని వివేచిస్తుంది. మొర్దెకైను దేవుడు ఎప్పుడూ ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెల్సు. మొర్దెకై రాజుకు చేసిన మేలును దేవుడు ఇప్పుడు ఇలా ఉపయోగిస్తాడని మొర్దెకై కూడా ఊహించి ఉండడు.దేవుడు తన పిల్లల జీవితాల్లో ఆయన ఎంత ప్రణాళికాబద్దంగా ఉంటాడో చూడండి! నడవలేని పరిస్థితుల్లో ఎత్తుకొని నడిపించే గొప్ప తండ్రి. ఆయనను ఆనుకొని జీవించే జీవితాలను ఎన్నడూ చెయ్యి విడువడని నమ్మకమైన దేవుడు.ఆపదల్లో ఆదుకునే సహాయకుడు. మన జీవితాల్లో ఎదుటివారు చెయ్యాలని చూసే ప్రతి చెడును కూడా మేలుగా మార్చగల సమర్థుడు.

౼నిశ్చింతగా ఉండండి!నీ జీవితం దేవుని ఆధీనం(Control)లో ఉంది..మానవుల చేతిలో కాదు. బైబిల్ అంతా ఇలాంటి ఉదాహరణలతో నిండి ఉంది. దీన్ని నమ్ముతున్నావా!ఈ సత్యం గుర్తించలేని రోజుల్లో గలిబిలి అయ్యేవాడ్ని. దానికి కారకులైన మనుష్యులను నిందించే వాడ్ని. కానీ నేడైతే నా ప్రాణం దేవుణ్ని ఆనుకోని నిమ్మళంగా ఉంది. ఇది నా సాక్ష్యం! దేవుణ్ని ఆధారంగా చేసికో! అప్పుడు ఇది నీ సాక్ష్యం కూడా అవుతుంది. సర్వకాలల్లో దేవుడు మహిమ పొందును గాక!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...