❇ పౌలు౼"నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడ్డాను. కాబట్టి ఇక మీదట నేను జీవించటం లేదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న ఈ జీవితం..'నన్ను ప్రేమించి, నా కోసం తన్నుతాను అప్పగించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను'" ❇
1.జ్ఞానం(intellectual) 2.భావోద్వేగాలు (emotions), 3.స్వచిత్తం(self will)తో కలబోసిన దేవుని స్వభావంలో మానవుడు ప్రత్యేకంగా దేవునిచేత నిర్మించబడ్డాడు. ఏదెను తోటలో మొదటి మానవులు బుద్ధిపూర్వకంగా దేవుడ్ని తిరస్కరించినప్పుడు, చెడిపోయిన స్వభావాన్ని ఫలితంగా పొందారు. తద్వారా దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. మానవుడు తిరిగి ఆయనతో సంభంధంలోకి రావడానికి ఈ మూడింటిని ఆయన తిరిగి వాడుకుంటాడు. మనలో ఆయన్ను గూర్చిన జ్ఞానంతో వెలిగిస్తాడు. మన చెడిపోయిన స్థితిని బట్టి, పశ్చాత్తాపంతో మారుమనస్సు సంబంధమైన దుఃఖాన్ని కలిగిస్తాడు. మన స్వేచ్ఛపూర్వకమైన నిర్ణయంతో మన హృదయాల్లో నివసిస్తాడు. జ్ఞానం, భావోద్రేకాలు మనల్ని చివరికి దేవుని చెంతకు మరలే తీర్మానాలకు నడిపించాలి. అలా జరగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి.
1) (వాక్య)జ్ఞానం: దేవుణ్ని గూర్చిన జ్ఞానం మన తలల్లోకి హెచ్చుగా ఆపేక్షిస్తూ..దేవుణ్ని అనుభవపూర్వకంగా తెలియని వారంగా కూడా ఉండొచ్చు. అంటే బైబిల్లోని వాక్యాలు, భక్తుల జీవిత చరిత్రలు, లేఖనాల గూర్చిన లోతైన భావాలు తెల్సుకొని కూడా..దేవునితో అట్టి అనుభవాలను ఆపేక్షించక, అవి కేవలం తలకే పరిమితమౌతాయి. అలాంటి వ్యక్తులు వ్యక్తిగతంగా రహస్య జీవితంలో ఓడిపోయే వారుగా ఉంటారు.తమకే వ్యక్తిగతంగా అనుభవాలు ఉండవు గనుక నూతనంగా దేవునిలో పుట్టిన వారికి సహాయకులు ఎన్నడూ కాలేరు.మహా ఐతే పండిన వారి తలల్లో నుండి కొంత జ్ఞానం తీసి ఇస్తారు. వారిని వెంబడించే వారు కూడా వారిలానే తయారౌతారు. దేవునితో సహవాసం అంటే పుస్తక ధ్యానంగా భావిస్తారు తప్ప, ఆయనతో వ్యక్తిగత సహవాసాన్ని,సన్నిహిత్యాన్ని వారు యెరుగలేరు. ఒకప్పుడు అట్టి అనుభవాలు ఉండి నేడు చల్లారిపోయి, లోకసంబంధుల వంటి జీవనంలో మునిగిపోయి వుండవచ్చు.
2) భావోద్రేకాలు: ఈ చివరి దినాల్లో అనేకమంది ప్రజలు కేవలం ఉద్రేకంతో కూడిన ప్రసంగాలకు, మనస్సుకు ఉల్లాసపర్చే సంగీతాలకు, కార్యక్రమాలకు, మత్తెకించే కొత్త సిద్దాంతాలకు, హెల్త్-వెల్త్ గాస్పెల్కు, మనుష్యుల కేంద్రీకృత శుభవార్తలకు చెవి ఇచ్చి అపవాది వెంట వెళ్తున్నారు. దేవుని పేరుతోనే ఇవ్వన్నీ జరుగుతాయి. కానీ వాక్యానుసారమైన ఆధారాలతో వారికి పని ఉండదు. ఇలాంటి భావోద్రేకాల వల్ల జీవితాలను ఇంచుకంతైనా మారవు. చర్చ్/మీటింగ్ నుండి బయటికి రాగానే ఉద్రేకాలు చల్లారిపోతాయి. మళ్ళీ పాత బ్రతుకులే! ఆ భోధకులు, వారిని అనుసరించువారు అలాంటి వారిగానే ఉంటారు. దేవునితో వీరికి బంధం ఉండదు.
3) స్వచిత్తం: పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని వాక్యము మనల్ని తాకితే, మన ఆత్మలో ఉన్న స్వచిత్తం (own Will) చనిపోవడం మొదలౌతుంది. అంటే "నేను,నా౼ఏలుబడి" నుండి, దేవుని ఏలుబడికి మనల్ని మనం అప్పగించుకునేట్లు సిద్ధం చేస్తుంది. వాక్యంలోని దేవునితో వ్యక్తిగత సహవాసం చేస్తాము. ప్రతి పరిస్థితిలో క్రీస్తు మాదిరినే చూపడానికి ఇష్టపడ్తాము. దేవునికి, మనకు మధ్య ఉన్న (స్వచిత్తం అనే)తెర చినిగి, అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధిని దగ్గర నుండి అనుభవిస్తాము.దేవుని వాక్యంలో ఆయన స్వరాన్ని, పరిశుద్దాత్ముని నడిపింపుని గుర్తిస్తాము. వాక్యము జ్ఞానం కోసం కాక, అనుదినం క్రీస్తు స్వరూపాన్ని చూసి మనల్ని మనం సరిదిద్దుకొనే అద్దం వలె చూస్తాము. మనుష్యులను, మనకెదురయ్యె పరిస్థితులను దైవకోణంలో చూడటం మొదలౌతుంది. ప్రతి అనుభవంలో దేవుడు దాచివుంచిన పాఠాలను శ్రద్ధగా నేర్చుకొంటాము. పరిస్థితులన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయని గుర్తెరిగి ఆయనలో ఆనందించడం నేర్చుకొంటాము. అనుదినం "నేను" అనే స్వభావాన్ని క్రీస్తు-సిలువ కొయ్యకు కొట్టి, స్వచిత్తం విషయంలో చనిపోయిన వారిగా ఎంచుకొని, "ఇక నేను కాదు క్రీస్తే!" అని క్రీస్తులో సజీవులుగా ఎంచుకున్నప్పుడు జరిగే అనుభవాలు ఇవి.
౼కేవలం జ్ఞానమా! భావోద్రేకాల భక్తా!లేక క్రీస్తుతో పాటు మరణమా! దేన్ని ఇష్టపడున్నావు?ఎలాంటి భోధకు చెవి ఇస్తున్నావు?
Comments
Post a Comment