❇ యోసేపు మరణశయ్యపై ఉన్నప్పుడు తన సహోదరులతో ౼"నేను చనిపోబోతున్నాను, అయితే దేవుడు మిమ్ములను తప్పక దర్శించి, ఈ దేశం(ఐగుప్తు)నుంచి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన వాగ్ధాన దేశానికి తప్పక తీసుకువెళ్తాడు.
సహోదరులారా! నాకు ఒక ప్రమాణం చెయ్యండి. దేవుడు మిమ్మల్ని ఆ వాగ్ధాన దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో కూడ తీసుకొని వెళ్లండి" అని అడిగాడు.
యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఐగుప్తులో మరణించాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని మృతదేహాన్ని సిద్ధపరచి, ఐగుప్తులో ఒక శవపేటికలో ఉంచారు ❇
■ (ఇశ్రాయేలు జాతికి మూలపురుషుడైన) అబ్రాహాముతో దేవుడు ప్రమాణం చేసినట్లుగా, తప్పకుండా ఐగుప్తు దేశం నుండి దేవుడు తీసుకుని వెళ్తాడని యోసేపు దృఢంగా నమ్మాడు(ఆది 15:13,14). అతని విశ్వాసానికి గుర్తుగా తన ఎముకలను వాగ్దాన దేశంలో పూడ్చిపెట్టమని కోరాడు. జ్ఞానవంతుడైన యోసేపు ఒకప్పుడు భయంకరమైన కరువు నుండి ఐగుప్తు సామ్రాజ్యాన్ని రక్షించాడు.తర్వాత ఎన్నో తరాలు గడిచిపోయాయి.ఆ తర్వాత రోజుల్లో యోసేపు ఎవరో కూడా గుర్తుపట్టలేని రాజులు పరిపాలన చేశారు.యోసేపు విశ్వాసాన్ని దేవుడు తరాల వెంబడి తరాలకు చేరవేస్తూ, అతని ఎముకలను వాగ్దాన దేశం కోసం భద్రం చేశాడు. అతని విశ్వాసాన్ని సజీవమైనదిగా ఉంచాడు. అతని శవపేటికను చూసిన ప్రతి ఇశ్రాయేలు తరం విశ్వాసంతో, తమ దేవుని వాగ్దానాల నెరవేర్పును గూర్చిన ఎదురుచూపుతో ప్రోత్సహించబడ్డారు. యోసేపు చనిపోయినా అతని విశ్వాసం సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది.
■ మరి నేడు మన విశ్వాసం ఏమిటి?
పౌలు౼"సోదరులారా! ఆర్భాటముతోనూ, ప్రధానదూత చేసే గొప్ప శబ్దంతో, దేవుని బాకా ధ్వనితో ప్రభువు పరలోకం నుండి దిగి వస్తాడు. క్రీస్తులో విశ్వాసముంచి చనిపోయిన వారు మొదటగా లేస్తారు.
ఆ తర్వాత బ్రతికి ఉండే మనల్ని వారితో కూడా ఆకాశమండలం లో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపైన తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మనం నిత్యం ప్రభువుతో కూడా ఉంటాము" (1థెస్స 4:16,17).
■ చనిపోయిన తర్వాత మన శరీరాలు మట్టిలో కలిసిపోవచ్చు!కానీ లేఖనాలు చెప్తున్న గొప్ప నిరీక్షణ౼"క్రీస్తు రెండవ సారి ఈ లోకానికి వస్తాడు. అప్పుడు మనం తిరిగి మహిమా శరీరాలతో లేపబడతాము. దేవునితో నిత్య సహవాసానికి సిద్ధపడే (పాపం ఏలుబడిలేని) శరీరాలను పొందుతాము" అని దేవుని వాగ్ధానం! క్రీస్తు మొట్టమొదటగా, మనకు ముందుగా ఈ విధంగానే దేవునిచేత లేపబడ్డాడు. గనుక 'క్రీస్తులో విశ్వసించిన వారందరిని క్రీస్తు వంటి శరీరాలతో, పవిత్రమైన ఆత్మలతో మనం తిరిగి లేపబడతాము' అనే మాటకు ఆధారాన్ని దేవుడు ఇచ్చాడు!ఈ గొప్ప నిరీక్షణతో యోసేపు వంటి సజీవమైన విశ్వాసంతో నేడు మనం జీవించాలి. అలాంటి విశ్వాసాన్ని దేవుడు గౌరవిస్తాడు. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపడనివ్వదు. ఖచ్చితంగా దేవుడు తిరిగి లేపుతాడు.
◆ యోసేపు వలె నీ మరణ పడక మీద విశ్వాసంతో ఈ నిరీక్షణ గూర్చి నిలిచి ఉన్న వారితో దైర్యంగా చెప్పగలవా?యోసేపు ఆ గొప్ప విశ్వాసానికి తగినట్లుగా భూమిపై జీవించాడు. కనుకనే అలా చెప్పగలిగాడు. భూసంబంధివి కాక, నీ విశ్వాసం సజీవమైనదిగా, నీ తర్వాత తరాలకు మాదిరిగా ఉండనివ్వు!

Comments
Post a Comment