Skip to main content

Posts

Showing posts from December, 2017

29Dec2017

❇ రోగుల విషయంలో యేసు చేసిన అద్భుతాలు చూసిన చాలామంది ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట వెళ్ళారు. అప్పుడాయన 5 రొట్టెలను, 2 చేపలను సుమారు 5000 మందికి  పైగా ఉన్న జనసమూహానికి పంచిపెట్టాడు. కనుక వారందరూ తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడు తున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు... తరువాతి రోజు జన సమూహం ఆయనను వెత్తుకుంటూ సముద్రం అవతలి తీరానికి వచ్చారు. యేసు౼“కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు,రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు..నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు.. నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం.." ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు౼“ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు. ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు. అప్పుడు యేసు తనతో ఉన్న 12 మంది శిష్యులతో౼“మీరు కూడా వెళ్ళాలను కుంటున్నారా?” అని అడిగాడు  ❇ ■ ఆయన వెంబడి వెతుక్కుంటూ వెళ్లిన జనసమూహంలో అనేకులు తన వారు కాద...

28Dec2017

❇  యెరూషలేములో "సుమెయోను" అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు, 'ఇశ్రాయేలుకు ఆదరణ కలిగేదెప్పుడా' అని రక్షకుని కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు. అతడు ప్రభువు రక్షకుణ్ని చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి మరియ-యోసేపులు చంటి బిడ్డయైన యేసును దేవాలయంలోకి తెచ్చారు. ఆ రోజు సుమెయోను ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. అతడు తన చేతుల్లో యేసును ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ౼ “ప్రభూ, ఇ ప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా!అన్ని జనాల ఎదుట నీవు సిద్ధం చేసిన ముక్తిని కళ్ళారా చూశాను.అది ఇతర ప్రజలకు సత్యాన్ని వెల్లడి చేసే వెలుగు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ” అన్నాడు. యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.(లూకా 2:25-33)  ❇ ■ సుమెయోను రక్షకుని రాక కోసం ఆసక్తితో కనిపెట్టాడు కనుకనే పరిశుద్ధాత్మ ద్వారా రక్షకున్ని చూశాకే చనిపోతావని దేవుడు అతనికి వాగ్ధానం చేశాడు.ఎవరు ఆసక్తిపరులై దేవుణ్ని వెతకుతారో వారే దేవుని...

26Dec2017

❇ మరియ-యోసేపులు బేత్లెహేములో ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి. ఆమె తన తొలిచూలు బిడ్డను కని,పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు. ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు. ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు. అయితే ఆ దూత౼“భయపడకండి.! ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మీకు ఇదే ఆనవాలు...." వారు త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు. ఆ శిశువును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలన్నీ అందరికీ ప్రకటించారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. (లూకా 2:6-18) ❇ జ్ఞానులు క్రీస్తును వెతుక్కుంటూ హేరోదు రాజు అంతఃపురంలోకి వెళ్లారు. వారు జ్ఞానులు కనుక అక్కడ ప్రవేశం దొరికింది! అదే అంతఃపురంలో లోకం చేత  హీనంగా చూడబడే చదువులేని గొఱ్ఱెల కాపరులను అక్కడికి అనుమతించగలరా? క్రీస్తు సర...

22Dec2017

❇ సమూయేలు యెష్షయిని, అతని కుమారులను పవిత్ర పరచి, బలి అర్పణలో పాలుపుచ్చుకోమని వారిని ఆహ్వానించాడు.యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసి౼“నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలచాడు. అయితే యెహోవా సమూయేలుతో౼“అతడి ఎత్తునూ ఆకారాన్నీ లక్ష్యపెట్టవద్దు. ఎందుకంటే నేను అతణ్ణి నిరాకరించాను. దేవుడు మనిషిలాగా చూడడు. మనుషులు బయటి ఆకారాన్ని చూస్తారు గాని యెహోవా హృదయంతరంగాన్ని చూస్తాడు” అన్నాడు.... యెష్షయి తన కొడుకులలో ఏడుగురిని సమూయేలు ముందుకు రప్పించాడు గాని సమూయేలు “యెహోవా వీళ్ళను ఎన్నుకోలేదు! నీ కొడుకులందరూ ఇక్కడున్నారా?” అని యెష్షయిని అడిగాడు. యెష్షయి౼“అందరికన్న చిన్నవాడున్నాడు. కానీ వాడు గొర్రెలు మేపుతున్నాడు”. సమూయేలు౼“అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా! అతడొచ్చే వరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు. కనుక యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి రప్పించాడు... యెహోవా సమూయేలుతో౼“లేచి ఇతణ్ణి అభిషేకించు! నేను ఎన్నుకొన్నవాడు ఇతడే!”అని చెప్పాడు. సమూయేలు నూనెతో నిండిన కొమ్మును తీసి అతడి అన్నల సమక్షంలో అతణ్ణి అభిషేకం చేశాడు ❇ ■ యెష్షయి దృష్టిలో దావీదు గొఱ్ఱెలక...

21Dec2017

❇ "మీరు క్రీస్తుతోకూడా సజీవంగా లేపబడి ఉంటే పైన ఉన్నవాటినే వెదకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవం క్రీస్తుతో దేవునిలో మరుగై ఉంది."(కొలస్సి 3:1-3) ❇ "మీరు క్రీస్తుతోకూడా సజీవంగా లేపబడి ఉంటే"౼ క్రీస్తు మృతి పొందిన తర్వాతే సజీవంగా లేపబడ్డాడు. క్రీస్తు పునరుద్దానుడు అవ్వాలంటే చనిపోవడం తప్పనిసరి!మృతి లేనిది పునరుద్దానం ఉండదు(అపో 3:15).కనుక మనం క్రీస్తుతో బాటు సజీవంగా లేపబడాలంటే మొదట చనిపోవాలి పాత స్వభావం దేవున్ని విడచిపెట్టి ఈ లోకవిషయాల పైనే మనస్సు నిలుపుతుంది. అవే ప్రధానమైనవిగా వెంపర్లడేటట్లు గ్రుడ్డితనం కలుగజేసి, అపవిత్రకు-పాపానికి బానిసలుగా చేసి, ఆత్మను గూర్చిన విషయాలను మర్చిపోయేట్లుగా జీవింప జేసిస్తుంది(2కోరి 4:4). చివరికి ఆ జీవితం దేవుని నిత్యశిక్షకు, ఆయనతో నిత్య ఎడబాటుకు తీసుకెళ్తుంది(ఎఫె 2:3).ఈ స్వభావం ఎప్పుడూ ఆత్మీయ(దైవ) సంగతులను నిర్లక్ష్యం చేసి, భూసంభందమైన వాటి మీదే మనస్సు నిలిపేట్లుగా ఉంచుతుంది. ఏదెనులో దేవుని వి...

19Dec2017

❇ 450 మంది బయలు ప్రవక్తలు ఒక ఎద్దును తీసుకొని సిద్ధం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ "బయలు స్వామీ! మాకు జవాబివ్వు!" అంటూ బయలు పేరెత్తి మొరపెట్టుకొంటూ ఉన్నారు. వాళ్ళకు జవాబేమీ రాలేదు, ఎవరి స్వరమూ వినిపించలేదు. వాళ్ళు చేసిన బలిపీఠం దగ్గర చిందులు త్రొక్కడం మొదలుపెట్టారు. మధ్యాహ్న కాలంలో ఏలీయా వాళ్ళను గేలి చేశాడు గనుక వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, వాళ్ళ అలవాటుచొప్పున రక్తధార లయ్యేవరకు కత్తులతో ఈటెలతో తమను పొడుచుకొన్నారు.మధ్యాహ్నం నుంచి సందెవేళ నైవేద్యం పెట్టె సమయం వరకు పూనకం వచ్చి పిచ్చిపట్టిన వాళ్ళలాగా మసలుకొన్నారు. అయితే వాళ్ళకు జవాబేమీ రాలేదు. అప్పుడు ఏలీయా ప్రజలందరితో "నా దగ్గరికి రండి" అన్నాడు. ప్రజలంతా దగ్గరికి వచ్చాక అతడు శిథిలమైపోయిన యెహోవా బలిపీఠాన్ని సరి చేసి ప్రార్ధించాడు.... వెంటనే దేవుని దగ్గర నుండి మంటలు దిగివచ్చి బలినీ కట్టెలనూ రాళ్ళనూ మట్టినీ దహించివేశాయి. కందకంలో ఉన్న నీళ్ళను ఇంకిపోయేలా చేశాయి. ప్రజలంతా ఇది చూచి సాష్టాంగపడ్డారు (1రాజు 18:22-39) ❇ ■ ఇక్కడ రెండు రకాల భక్తి విధానాలు కనిపిస్తున్నాయి. బయలు ప్రవక్తలు దేవుడు ఉన్నాడని నమ్మేవారే కానీ నాస్తి...

18Dec2017

❇  తండ్రితో గొడవ పడి, ఆస్తిని నష్టపర్చి తిరిగి వచ్చిన చిన్న కొడుకును బట్టి ఆ తండ్రి విందు చేశాడు. ఆ సమయంలో అతని పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు ఇంటిని సమీపిస్తుండగా సంగీతం, నాట్యధ్వని అతనికి వినిపించాయి. ఒక సేవకుణ్ణి పిలిచి౼‘ఏం జరుగుతోంది?’ అని అడిగాడు. ఆ పనివాడు అతనితో౼‘నీ తమ్ముడు వచ్చాడు. అతడు తన దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు. దాంతో పెద్ద కొడుక్కి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళలేదు. అతని తండ్రి బయటకు వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు. కాని అతడు౼‘ఇన్నేళ్ళ నుండి నీకు సేవలు చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు. కానీ నీ ఆస్తిని వేశ్యలకు ఖర్చు చేసిన నీ చిన్న కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు’ అంటూ నిష్టూరంగా మాట్లాడాడు. (లూకా 15:25-30) ❇ ■ చిన్న కొడుకు తండ్రిని ఆస్తి పంచి ఇవ్వమని అడిగినప్పుడు, తండ్రి ఇద్దరికీ ఆస్తిని పంచిపెట్టాడు. ఐనా పెద్దవాడు తండ్రితోనే ఉన్నాడు. తండ్రి ఇంట్లో, తండ్రి పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. అతడు తండ...

13Dec2017

❇  మోషే మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావివద్ద ఆగిపోయాడు. మిద్యానులో రగూయేలు అనే యాజకునికి 7 కుమార్తెలున్నారు. ఒకరోజు వారు తమ తండ్రి గొర్రెల మందకు నీళ్లు తీసుకొని రావడాని ఆ బావి దగ్గరకు వెళ్లారు. వారు ఆ నీళ్ల కుండలను నింపడానికి ప్రయత్నం చేశారు కాని అక్కడ ఉన్న కొందరు గొర్రెల కాపరులు నీళ్లు చేదుకోనివ్వకుండా వారిని వెళ్లగొట్టేశారు. కనుక మోషే వారికి సహాయం చేసి, వారి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు.తర్వాత వాళ్లు వారి తండ్రి రగూయేలు దగ్గరకు వెళ్లిపోయారు. అతడు వారితో ౼"ఈ రోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు” అన్నాడు. వారు-“గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు. అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు. అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు.  ❇ ■ ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాలనుకున్న మోషేకు చేదు అనుభవం ఎదురయ్యింది.అప్పటికే మేలుకు ప్రతిగా జరిగిన కీడు...

08Dec2017

❇ సాయంత్రమైనప్పుడు యేసు తన శిష్యులతో ౼“సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి!” అన్నాడు. శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సముద్రంపై బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది. కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి౼“ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం!మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలను గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు.. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది. అప్పుడు ఆయన౼“మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు(మార్కు 4:35-40) ❇ ■ దేవుడు తోడున్న పడవపైకి గాలివాన-తుఫానులు(శ్రమలు) వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి! ఇంకా చెప్పాలంటే ఆయనే (శ్రమలను) పంపుతాడు! ఈ సంఘటనకు ముందు యేసు శిష్యులకు అనేక పరలోక సత్యాలను భోధించాడు (మార్కు 4:33,34). అదే రోజు సాయంత్రం ఆయనే వారిని ఈ ప్రయాణానికి పిలిచాడు. ఇప్పుడు వారి ముందున్న యేసు(దేవుని) మాట౼"అవతలి...

06Dec2017

❇ అహరోను కుమారులైన నాదాబు, అబీహు తమ ధూపార్తులను చేతపట్టుకొని వాటిలో నిప్పు ఉంచి ధూప ద్రవ్యాన్ని వేశారు. ఈ నిప్పు యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరే నిప్పు. ఈ విధంగా వారు పాపం చేసారు కనుక యెహోవా సన్నిధానంనుంచి మంటలు వచ్చి వారిని కాల్చివేశాయి. అలాగే వారు యెహోవా సన్నిధానంలో చనిపోయారు. అప్పుడు మోషే అహరోనుతో౼“యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు,’నా దగ్గరకు వచ్చే యాజకులు నన్ను గౌరవించాలి. వారికీ, ప్రజలందరికీ నేను పరిశుద్ధుడుగా ఉండాలి'”. అహరోను తన కుమారుల చావునుగూర్చి ఏమీ అనలేదు. అప్పుడు అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులను మోషే పిలిపించాడు. వారు మీషాయేలును ఎల్సాఫానును. అతడు వారితో౼“పరిశుద్ధ స్థలం ముందుకు వెళ్లండి. మీ సోదరుల శవాలను పాళెము వెలుపలకు తీసుకొని పొండి” అన్నాడు. అప్పుడు వారు నాదాబు, అబీహు శవాలను పాళెము వెలుపలకు మోసుకొని పోయారు. నాదాబు, అబీహు అప్పటికి ఇంకా వారి ప్రత్యేక చొక్కాలు ధరించే ఉన్నారు.(లేవీ 10:1-5) ❇ ■ ధర్మశాస్త్రంలో అదేశించబడిన పనులు రాబోయే క్రీస్తు విమోచన కార్యానికి ముంగుర్తులు. ఎక్కడ దేవుని ప్రత్యక్షత (revelation) ఎక్కువగా ఉంటుందో అక్కడ విధేయత ఎక్కువగా ఎదురు చూడబడుతుంద...

01Dec2017

❇  అప్పుడాయన పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన యూద సమాజ కేంద్రానికి వెళ్ళాడు, లేఖనం చదవడానికి నిలబడ్డాడు. యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే౼ "ప్రభువు ఆత్మ నామీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి, ఆయన నన్ను అభిషేకించాడు...ఆయన నన్ను పంపాడు" అని రాసిన చోటు ఆయనకు దొరికింది. ఆయన గ్రంథం మూసి పరిచారకుడికిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్న వాళ్ళంతా ఆయనను తేరి చూశారు. "మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది" అని ఆయన వారితో అన్నాడు. అందరూ ఆయన దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడి, ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. వారితో ఆయన అన్నాడు "మీరు ‘వైద్యుడా, నిన్ను నీవు బాగు చేసుకో!’ అనే సామెత నాకు చెప్పి ‘కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, అవి ఇక్కడ నీ స్వస్థలంలో చెయ్యి!’ అని తప్పకుండా అంటారు" ఆయన ఇంకా అన్నాడు౼"మీతో ఖచ్చితంగా అంటున్నాను,ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వాళ్ళు అంగీకరించలేదు.." సమాజ మందిరంలో ఉన్నవాళ్ళంతా ఆ మాటలు విని ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు త్రోసుకువెళ్ళారు....

29Nov2017

❇ ఫిలిప్పు యేసుతో౼"ప్రభువా, తండ్రి(తండ్రియైన దేవుణ్ణి)ని మాకు చూపించు. అది మాకు చాలు" యేసు అతనితో౼"ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే! 'తండ్రిని చూపించు' అని నువ్వు ఎలా అంటున్నావు? 'నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాడు' అని నువ్వు నమ్మడంలేదా? నేను మీతో చెపుతూ ఉన్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు గాని నాలో నివాసం చేస్తున్న తండ్రి ఈ పనులు జరిగిస్తూ ఉన్నాడు. ...తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ చెప్పడు. ఏవైతే తండ్రి దగ్గర వింటాడో అవే చెపుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు" (యోహా 14:8-10,26; 16:13) ❇ ■ దేవదూత క్రీస్తు పుట్టకమునుపు ఆయన పేరును (ప్రవచనాల ప్రకారం) "ఇమ్మానుయేలు" గా పిలిచాడు. అంటే దేవుడు మనతో ఉన్నాడని అర్ధం. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తులో నివసిస్తుంది....

25Nov2017

❇ గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో పెళ్ళికి యేసుని, ఆయన తల్లిని, ఆయన శిష్యుల్ని కూడా పిలిచారు. ఆ సమయంలో ద్రాక్షరసం అయిపోయింది. యేసు తల్లి ఆయనతో౼“వీరి దగ్గర ఇక ద్రాక్షారసం అయిపోయింది” అంది. యేసు ఆమెతో౼“అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకా రాలేదు” ఆయన తల్లి పనివారితో౼“మీతో ఆయన చెప్పినది చేయండి” అంది. అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. యేసు పనివారితో౼“ఈ బానల నిండా నీళ్లు పోయండి” అన్నాడు. అంచుల వరకు వారు నీళ్ళు నింపారు. అప్పుడాయన వారితో౼“ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకు వెళ్ళండి” అన్నాడు. అలాగే వారు తీసుకువెళ్ళారు. ద్రాక్షరసంగా మారిన ఆ నీరు గురించి ఆ పనివారికి మాత్రమే తెలుసు. విందు ప్రధానికి తెలియదు. అతడు దానిని రుచి చూచి పెండ్లి కొడుకును పిలిచి౼“ప్రతి ఒక్కరూ మొదట్లోనే మంచి ద్రాక్షరసం పోస్తారు.ఆ తర్వాత నాసిరకంది పోస్తారు. మీరైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసమే ఉంచారు” అన్నాడు ❇ ■ మొదట ద్రాక్షారసం మనుష్యుల చేత తయారు చేయబడినదైతే, రెండవది దేవుని చేత చేయబడినది. ఖచ్చితంగా రెండవదే శ్రేష్ఠమైన ద్రాక్షారసమై ఉండి ఉంటుంది(త్రాగిన వెంటనే విందు ప్రధాని పెండ్లి కుమారుని కలిశాడు). మొదటి ద్రాక్షరసం దేవ...