Skip to main content

26Dec2017

❇ మరియ-యోసేపులు బేత్లెహేములో ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి. ఆమె తన తొలిచూలు బిడ్డను కని,పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు.
ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు. ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు.
అయితే ఆ దూత౼“భయపడకండి.! ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మీకు ఇదే ఆనవాలు...."
వారు త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు. ఆ శిశువును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలన్నీ అందరికీ ప్రకటించారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. (లూకా 2:6-18) ❇

జ్ఞానులు క్రీస్తును వెతుక్కుంటూ హేరోదు రాజు అంతఃపురంలోకి వెళ్లారు. వారు జ్ఞానులు కనుక అక్కడ ప్రవేశం దొరికింది! అదే అంతఃపురంలో లోకం చేత  హీనంగా చూడబడే చదువులేని గొఱ్ఱెల కాపరులను అక్కడికి అనుమతించగలరా? క్రీస్తు సర్వ మానవాళికీ రక్షకుడు కనుక అత్యంత అల్పులుగా పిలువబడే ప్రజలు కూడా ఆయన్ను సమీపించగల  ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఆయన్ను సమీపించాలంటే దీనుల వలె తమను తాము తగ్గించుకున్నవారే ఆయన్ను చూడగలరు. దేవుని కుమారుని జన్మదిన సువర్తమానానికి మొదటి ఆహ్వానం తీసుకున్నవారిని గమనించారా(గొఱ్ఱెల కాపరులు)! కశ్చితంగా ఆయన రాక కోసం ఆశతో కనిపెట్టే ప్రజలనే నిస్సానందేహంగా చెప్పవచ్చు. వారు తమ గొఱ్ఱెలను విడిచి తమను జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుని నమ్మకానికి తగినట్లుగా ప్రవర్తించారు. గొఱ్ఱెలు కాపరులు శిశువైన క్రీస్తును గూర్చి ప్రకటించుకుంటూ, దేవుణ్ని స్తుతిస్తూ వెళ్లారు. పరలోకం నుండి ఆ సువర్తమాన సందేశం దేవదూతలు మోసుకొచ్చినా, ఈ లోకానికి అందించడానికి అత్యంత సామాన్యులకు ప్రభువు అప్పగించాడు. ఏ మనిషీ గొప్పలకు పోకుండా ఇప్పటికీ దేవుడు అవలంభిస్తున్న విధానం ఇదే!క్రీస్తు రాకతో, మురికిగా ఉన్న ఆ పశువుల పాకలోకి పరలోక మహిమ దిగి వచ్చింది!నేడు  అసహ్యమైన పాపపు మురికితో ఉన్న హృదయాల్లోకి కృపతో ప్రవేశించి పరలోక మహిమను నింపగల సమర్థుడు యేసు దేవుడు! ఎవరి హృదయంలోకి క్రీస్తు ఆత్మ స్వరూపిగా వస్తాడో, ఎవరి హృదయంలో ప్రముఖునిగా పరిపాలన చేస్తాడో..అదే క్రిస్మస్ కు నిజమైన, పరిపూర్ణమైన అర్ధం!
___________________________________
For more posts visit below links
https://www.facebook.com/kristop4
https://kristop4.blogspot.com

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...