Skip to main content

01Dec2017

 అప్పుడాయన పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన యూద సమాజ కేంద్రానికి వెళ్ళాడు, లేఖనం చదవడానికి నిలబడ్డాడు. యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే౼

"ప్రభువు ఆత్మ నామీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి, ఆయన నన్ను అభిషేకించాడు...ఆయన నన్ను పంపాడు" అని రాసిన చోటు ఆయనకు దొరికింది.

ఆయన గ్రంథం మూసి పరిచారకుడికిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్న వాళ్ళంతా ఆయనను తేరి చూశారు. "మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది" అని ఆయన వారితో అన్నాడు. అందరూ ఆయన దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడి, ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు.
వారితో ఆయన అన్నాడు "మీరు ‘వైద్యుడా, నిన్ను నీవు బాగు చేసుకో!’ అనే సామెత నాకు చెప్పి ‘కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, అవి ఇక్కడ నీ స్వస్థలంలో చెయ్యి!’ అని తప్పకుండా అంటారు" ఆయన ఇంకా అన్నాడు౼"మీతో ఖచ్చితంగా అంటున్నాను,ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వాళ్ళు అంగీకరించలేదు.."

సమాజ మందిరంలో ఉన్నవాళ్ళంతా ఆ మాటలు విని ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు త్రోసుకువెళ్ళారు. వారి గ్రామం కొండపై కట్టబడింది. నిటారుగా ఉన్న స్థలంనుంచి ఆయనను తలక్రిందుగా పడద్రోయాలని దాని అంచుకు తీసుకు పోయారు. అయితే ఆయన వారి మధ్యనుంచి దాటి తన దారిన వెళ్ళిపోయాడు. (లూకా 4: 16-30) 

■ ప్రజల యొక్క స్వభావం ఈ భాగంలో స్పష్టంగా కనిపిస్తుంది.ఈ వాక్యం ముందు భాగంలో యేసు దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నట్లు మనం చదువుతాము(v14). క్రీస్తు యెషయా గ్రంథ లేఖనం చదివినప్పుడు అంతా ప్రశంసించారు. ఎప్పుడైతే వారిని ఉద్దేశించి మాట్లాడాడో వెను వెంటనే ఆగ్రహంతో నిండి ఆయన్ను చంపాలని చూశారు. అప్పటివరకు యేసు తాను వాడుక (regular)గా వెళ్లిన సమాజ మందిరం అది. నజరేతువారితో యేసుకు అంతకు మునుపు ఇలాంటి విభేధం ఉన్నట్లు చూడలేం కానీ, ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఆయన అక్కడి నుండి మౌనంగా తప్పుకొని వెళ్ళాడు.
■ దేవుని ఆత్మ బలంతో నింపబడిన వారి మాటలు ఎల్లప్పుడూ మృదువుగానే ఉంటాయా?
స్తెఫను పరిశుద్ధాత్మతో నింపబడి ఇశ్రాయేలీయుల గత చరిత్ర గూర్చి మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు మౌనంగానే విన్నారు, ఎప్పుడైతే వారిని వ్యక్తిగతంగా విమర్శించాడో అప్పుడు వారు అతణ్ని మాటలు విని కోపంతో మండిపడి పండ్లుకొరికారు. అతని మీద పడి, రాళ్లు రువ్వి ఛాంపివేశారు
(అ. కా 7: 51-60).
■ ప్రజల వ్యక్తిగత అవసరం దేవుని ఆత్మకే బాగా తెలుసును, కనుక వారిని ప్రేమించి ఆ మాటలనే పలికిస్తాడు. దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడే వ్యక్తి దేవుని ఆధీనంలో ఉంటాడు. పలకబడిన మాటల్లోని సత్యానికి చెవి ఇచ్చి విధేయత చూపినవారు రక్షించబడతారు, ఆదరించబడతారు, సత్యంలో నిలిచివుంటారు (అ.కా 2:37). కఠిన పర్చుకున్న వారు సహజంగా ఇవి ఆ వ్యక్తి మాటలే అనుకుంటారు. నిజానికి అది వారి అంతరంగ స్థితిని అద్దం పట్టినప్పటికి, మొదటి నుంచి వారిని గూర్చి చిన్న చూపు ఉంటుంది(v22,అ.కా 4:13) గనుక ఆ మాటలను త్రోసి పుచ్చుతారు. కారణం..వారు మనిషిని మాత్రమే చూస్తారు, దేవుణ్ని చూడలేని(యదార్థత లేని) వారి హృదయాలపై ముసుగు ధరించుకొని ఉంటారు గనుక యదార్థత లేని వారి హృదయం దేవుణ్ని దాటివెళ్లిపోతాయి. ఈ విధంగా కఠిన పర్చుకుని, ఎదురాడు వారు దైవోగ్రతలోకి వెళ్తారు.
■ దేవుని ఆత్మ చేత నింపబడిన విశ్వాసి మరి ఎక్కువగా(మత సంభంధమైన నాయకుల చేత) మనుష్యుల చేత ద్వేషించబడి, హింసించబడ్డారు.మనుష్యుల దగ్గర నుండి ఇలాంటి తిరస్కారాన్ని సైతం సహించడానికి ఎవరు సిద్ధంగా ఉంటారో, వారిని దేవుడు వాడుకుంటాడు. యేసు 30 సం౹౹ సాక్షాన్ని సైతం వదులుకోబడానికి సిద్ధపడ్డాడు. ప్రాణభయంతో అబద్ధమాడిన పేతురు ధైర్యంగా దేవునికోసం నిలబడ్డాడు. ఒకప్పుడు ప్రధాన యాజకులకు మిత్రుడైన పౌలు వారితో విభేదించడానికి సిద్ధపడ్డాడు. అవసరమైతే హుందా ఉన్న మన సాక్ష్యన్ని సైతం బలిపీఠంపై పెట్టాలి.అలాలేనప్పుడు క్రీస్తు కోసం నా ప్రాణాన్ని సైతం పెడతానని వట్టి మాటలు పలకకూడదు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...