Skip to main content

29Nov2017

❇ ఫిలిప్పు యేసుతో౼"ప్రభువా, తండ్రి(తండ్రియైన దేవుణ్ణి)ని మాకు చూపించు. అది మాకు చాలు"

యేసు అతనితో౼"ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే! 'తండ్రిని చూపించు' అని నువ్వు ఎలా అంటున్నావు? 'నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాడు' అని నువ్వు నమ్మడంలేదా? నేను మీతో చెపుతూ ఉన్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు గాని నాలో నివాసం చేస్తున్న తండ్రి ఈ పనులు జరిగిస్తూ ఉన్నాడు.

...తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ చెప్పడు. ఏవైతే తండ్రి దగ్గర వింటాడో అవే చెపుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు"
(యోహా 14:8-10,26; 16:13) ❇


■ దేవదూత క్రీస్తు పుట్టకమునుపు ఆయన పేరును (ప్రవచనాల ప్రకారం) "ఇమ్మానుయేలు" గా పిలిచాడు. అంటే దేవుడు మనతో ఉన్నాడని అర్ధం.

దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తులో నివసిస్తుంది. క్రీస్తులోని దైవత్వాన్ని గుర్తుపట్టి, ఆయన సహవాసంలోకి వచ్చిన వారంతా తండ్రియైన దేవుణ్ని హత్తుకున్నవారే! ఆయన తమను విడచి తిరిగి పరలోకం వెళ్లబోతున్నా డని శిష్యులు తెల్సుకొని కంగారుపడ్డారు. అప్పుడు ఆయన వారికి ఆదరణ కర్త, సత్య స్వరూపియైన(పరిశుద్ధాత్ముని) గూర్చిన వాగ్దానంతో బలపరచాడు.ఆయన చేసిన కార్యాల కంటే ఇంకా గొప్ప కార్యాలను చేయగలరని చెప్పాడు.

■ క్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు ఒక సమయంలో ఒకే చోట మాత్రమే ఉన్నాడు. కానీ ఆయన పరలోకం వెళ్లిన తర్వాత అంతటా ఉండేట్లు ఆత్మరూపిగా క్రీస్తు ఆత్మను(పరిశుద్ధాత్ముణ్ని) పంపాడు. క్రీస్తు తండ్రియైన దేవుణ్ని చూపుతూ-తన స్వంతగా ఏమి చెయ్యకుండా ఉన్నట్లు, పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తును (మాటలను)చూపుతూ, ఆయన్ను ఘనపరుస్తాడు, కానీ తనంతట తానేమీ భోధించలేదు. క్రీస్తును అంటే తండ్రినే పరిశుద్ధాత్మ చూపుతాడు. నేడు "దేవుని తోడు" పరిశుద్ధాత్ముని ద్వారా మన హృదయాల్లోనే నివసిస్తుంది. క్రీస్తు భూమిపై ఉన్నప్పుడు క్రీస్తుకు వేరుగా, పాత నిబంధనలో మనం చూసినట్లుగా ప్రవక్తల ద్వారా, సూచక క్రియల ద్వారా తండ్రి మాట్లాడలేదు గాని, 'క్రీస్తు' ద్వారానే మాట్లాడాడు. అంటే క్రియాశీలత(active part) క్రీస్తు ద్వారానే జరిగింది. అలానే నేడు క్రియాశీలమైన పరిచర్య క్రీస్తు యేసునందు, పరిశుద్ధాత్ముని ద్వారానే జరుగుతుంది.

■ పెంతుకోస్తూ దినం నుండి దేవుని ఆత్మ వారిని నడపటం స్పష్టంగా చూస్తాము. నేడు దేవుని తోడు పరిశుద్ధాత్ముని ద్వారా మనలో జరిగేటట్లు తండ్రియైన దేవుడు నియమించాడు. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు (ఆధీనంలోకి వెళ్ళినప్పుడు) శిష్యులు శక్తితో నింపబడి కొత్త వ్యక్తులుగా మారిపోయారు. ఒకరి కంటే ఒకరు గొప్ప అని తగువులాడుకున్న వారు సహోదర ఐక్యత కలిగి ఏకమనస్కులయ్యారు.భూసంభంధులుగా మాట్లాడిన వారు ఆధ్యాత్మికమైన వ్యక్తులుగా మారారు. సామాన్యులు, బలహీనులైన వారిలోకి ఒక క్రొత్త శక్తి అదనంగా వచ్చినట్లు కనబడ్డారు.బలహీనులైన మనుష్యులకు దేవుడు అందించిన కృప క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఏ ఆత్మ మూలంగా లేపబడ్డాడో, ఎండిన ఎముకలను ఎవరి మూలంగా జీవాత్మలతో బ్రతికించగలడని వాక్యం చెప్తుందో, ఆ ఆత్మే మనకు సహాయకునిగా నేడు ఈ క్రొత్తనిభంధనలో ఉన్నాడు. జయించలేని బలహీనతలకి, నిస్సరమైన భక్తికి జీవం పోసేది ఆయనే! వాక్యం అనే విత్తనానికి ఫలించునట్లుగా ఊపిరి పొసే వర్షం పరిశుద్దాత్ముడు. ఆయనపై పరిపూర్ణంగా ఆధారపడకుండా చేసేది మన సొంత శక్తే అవుతుంది. "పరిశుద్ధాత్ముడు" అంటే ఊగిపొయ్యే పెంతుకోస్తూ వారి భోధకాదు! బైబిల్ బోధ(విలువైన దేవుని ఆత్మ నియమం క్రిందికి రాకుండా అపవాది వేసే ఎత్తుగడ అది) అలాంటి తప్పుడు భోధను చూసి, దేవుడు అనుగ్రహించిన గొప్ప అనుగ్రహాన్ని వదిలి పెట్టి, స్వశక్తితో ఏమి చేయలేము, ఒకవేళ చేసినా నిస్సారమైన వ్యక్తిగత జీవితం-శక్తిలేని సేవా జీవితమే దాని ఫలితం.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...