
ఒక సేవకుణ్ణి పిలిచి౼‘ఏం జరుగుతోంది?’ అని అడిగాడు.
ఆ పనివాడు అతనితో౼‘నీ తమ్ముడు వచ్చాడు. అతడు తన దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు.
దాంతో పెద్ద కొడుక్కి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళలేదు.
అతని తండ్రి బయటకు వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు.
కాని అతడు౼‘ఇన్నేళ్ళ నుండి నీకు సేవలు చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు. కానీ నీ ఆస్తిని వేశ్యలకు ఖర్చు చేసిన నీ చిన్న కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు’ అంటూ నిష్టూరంగా మాట్లాడాడు. (లూకా 15:25-30)
❇
ఆ పనివాడు అతనితో౼‘నీ తమ్ముడు వచ్చాడు. అతడు తన దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు.
దాంతో పెద్ద కొడుక్కి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళలేదు.
అతని తండ్రి బయటకు వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు.
కాని అతడు౼‘ఇన్నేళ్ళ నుండి నీకు సేవలు చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు. కానీ నీ ఆస్తిని వేశ్యలకు ఖర్చు చేసిన నీ చిన్న కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు’ అంటూ నిష్టూరంగా మాట్లాడాడు. (లూకా 15:25-30)

■ చిన్న కొడుకు తండ్రిని ఆస్తి పంచి ఇవ్వమని అడిగినప్పుడు, తండ్రి ఇద్దరికీ ఆస్తిని పంచిపెట్టాడు. ఐనా పెద్దవాడు తండ్రితోనే ఉన్నాడు. తండ్రి ఇంట్లో, తండ్రి పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. అతడు తండ్రిని ఎన్నడూ వదిలి జీవించలేదు ఇది మంచి సాక్ష్యం..! ఈ విషయం ఏ ఒక్కరిని అడిగినా అదే చెప్తారు. ఆ తండ్రికి నమ్మకమైన కొడుకుగా పిలువబడుతున్నాడు. ఐనప్పటికీ ఆ తండ్రిలాంటి వాడు కాదని ఈ సందర్భంలో కనిపిస్తుంది(పరిసయ్యుని భక్తి). తండ్రి చిన్నవాడి కోసం దిగులుపడి ఎదురు చూసాడు. వాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి కనికరం చూపి, పరుగెత్తి, హత్తుకొని ముద్దాడాడు కానీ నష్టపర్చిన డబ్బు గురించి ఏమి మాట్లాడలేదు. తండ్రికి డబ్బు కంటే, జరిగిన నష్టం కంటే, తిరుగుబాటు గూర్చిన తీర్పు కంటే, తన కొడుకే తనకు ముఖ్యం అన్నట్లు ప్రవర్తించాడు.వాణ్ని ఎంతో ప్రేమించాడు.పెద్దవాడు తన పనిలో తాను ఏ మాత్రం భాధ లేకుండా సంతోషంగానే ఉన్నాడు. చిన్నవాడు వచ్చాడని అతన్ని బట్టి తండ్రి విందు చేస్తున్నాడని తెల్సుకొని, కోపంతో లోపలికి రాలేదు. తండ్రి ఇంటిలోని సంతోషం ఇతని హృదయంలో లేదు. తండ్రి స్వభావానికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. ఇతను బయటికి(అందరి ముందు) మంచి సాక్ష్యంతో కనిపించవచ్చు, కానీ అంతరంగంలో తండ్రికి తప్పిపోయిన మరో కుమారుడు(ఈ స్థితి చిన్నకొడుకు తిరుగుబాటు కంటే అపాయకరమైనది.బాగానే ఉన్నమనే భ్రమకు తీసుకెళ్తుంది).
■ మనం దేవునితో ఉన్న వారమైతే దేవుని పోలి నడుచుకోవాల్సిన వారము. దేవుని లక్షణాలు, ఆయన స్వభావం అంతరంగంలో నుండి కనిపించాలి. అప్పుడే మనం తండ్రితో సహవాసంలో ఉన్నట్లు! ఒకప్పుడు ఎదుటివారిని ప్రేమించలేని, వారి మేలు కోరని౼మేలు చూడలేని, చెడిపోయిన స్వభావం మనది. కానీ మన పరమ తండ్రి స్వభావం కల్మషం లేనిది. ఎప్పుడైతే దేవుని స్వభావానికి వేరుగా మనం ఉన్నామని దేవుడు చూపాడో వెను వెంటనే మన పాత స్వభావాన్ని అసహ్యించుకోవాలి. దేవుని స్వభావంకై తృష్ణగొనాలి.మన తండ్రి తప్పిపోయిన వారి పట్ల ఎలాంటి వైఖరి ఆయనకు ఉంటుందో, మనం కూడా అలాంటి వైఖరినే ధరించుకోవడానికి ఇష్టపడాలి. ఇది మార్పు చెందే క్రైస్తవుని లక్షణం. పాతకాలపు స్వభావాన్ని సమర్ధించుకొని, తృప్తిపడే వారెవ్వరూ ఈ జీవితంలోకి ఎన్నడూ ప్రవేశించలేరు. ఉన్నపాటున ప్రజలను అంగీకరించడానికి దేవుని కృపలో నుండి సాధకం చెయ్యాలి!
■ దేవుని ఇంట్లో ఉంటున్నానని చెప్తున్నావా?దేవుని కోసం పనిచేస్తున్నానని చెప్తున్నావా? ఐతే దేవుని మనస్సు కలిగి జీవించడానికి ఇష్టపడ్తున్నావా? 'ఆయన లక్షణాలన్నీ ఇప్పుడు నీలో ఉన్నాయా?' అని అడగట్లేదు! కానీ నీ పాతకాల స్వభావాన్ని సమర్ధించుకోకుండా, దేవుని స్వభావాన్ని ధరించుకోవడానికి ఇష్టపడుతున్నావా? పోరాడుతున్నావా!? అప్పుడు తండ్రి జీవం నీలో ఉన్నట్లు!(1యోహా 2:6). ఎదుటివారిని క్షమిస్తున్నప్పుడు, హత్తుకొంటున్నప్పుడే ఇది బయటపడుతుంది. తప్పు జరిగినప్పుడు దేవుణ్ని బట్టి సమాధానం కొరకు ఆరాటపడ్తున్నావా? ఇది మనది కానీ స్వభావం! దేవుని స్వభావం!స్వశక్తితో దీనిని పొందుకోలేము. ఆయనే ఈ జీవితంలోకి నడిపించాలి. చిన్న బిడ్డలా దేవుని చెయ్యి పట్టుకో! ఆయనే నడక నేర్పుతాడు.
Comments
Post a Comment