Skip to main content

29Dec2017

❇ రోగుల విషయంలో యేసు చేసిన అద్భుతాలు చూసిన చాలామంది ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట వెళ్ళారు. అప్పుడాయన 5 రొట్టెలను, 2 చేపలను సుమారు 5000 మందికి  పైగా ఉన్న జనసమూహానికి పంచిపెట్టాడు. కనుక వారందరూ తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడు తున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు...

తరువాతి రోజు జన సమూహం ఆయనను వెత్తుకుంటూ సముద్రం అవతలి తీరానికి వచ్చారు. యేసు౼“కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు,రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు..నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు.. నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం.."
ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు౼“ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు.

ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు. అప్పుడు యేసు తనతో ఉన్న 12 మంది శిష్యులతో౼“మీరు కూడా వెళ్ళాలను కుంటున్నారా?” అని అడిగాడు  ❇

■ ఆయన వెంబడి వెతుక్కుంటూ వెళ్లిన జనసమూహంలో అనేకులు తన వారు కాదని యేసుకు బాగా తెల్సు!(నేడు అనేకులు ఉప్పొంగుతున్నట్లు)తన వెంబడి వస్తున్న గొప్ప జన సమూహన్ని చూసి యేసు ఎప్పుడూ సంతోషపడలేదు. పైగా అనేక సార్లు గుంపును వడగట్టాడు(filter చేశాడు). ఎందుకంటే వారు ఆయనను వెంబడిస్తుంది భూసంభందమైన విషయాల కోసం మాత్రమే గనుక!(ఆత్మలో తీవ్రత(wholeheartedness) లేకుండా వెంబడించే శిష్యులను సైతం ఆయన జల్లెడ పట్టాడు. లూకా 14:25-27). ఎవరైతే భూసంభధిత విషయాల కోసం మాత్రమే(/ప్రథమంగా) వెంబడిస్తున్నారో వారికి ఆత్మీయ సంగతులు మింగుడుపడవు కనుక అలాంటి వారు జీవమైవున్న ఆత్మ సంభంధమైన మాటలను విడిచిపెట్టేస్తారు. తమలాంటి భోధకుల కోసం వెతుకులాడతారు. అలాంటి వారికోసం అప్పటికే సాతాను సిద్ధపర్చిన భోధకుల వెనుక అనేకులు వెళ్తూ, తమ నాశనానికి వెళ్లే దారిలో వారు ప్రయాణం చేస్తారు. అట్టి భోధకులు వాక్యంలో ఉన్న క్రీస్తును కాక, వేరొక క్రీస్తును బోధిస్తారు(2కొరిధి 11:3,4). ఎరను చూపి ఆత్మలను దొంగిలించే వేటగాళ్ళలా సాతాను చేతిలో వాడబడతారు.వీరి వెనుక పొయ్యేవారు అనేకులు!

■ ఆశ్చర్యం! ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి వెళ్ళిపోయారు. యేసు తాను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు.ఇంకా వారికి వెనుక తీయడానికి స్వేచ్ఛ ఉంది.తనతో ఉన్న వారి సంఖ్య తగ్గిపోతుందన్న భయం, బెరుకు ఏమాత్రం ఆయనలో కనిపించవు! పరలోక తండ్రిచే పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడినవారిగా, క్రీస్తును స్వంత రక్షకునిగా (పాపవిమోచకునిగా) అంగీకరిస్తూ, ఈ చెడిపోయిన లోకపోకడ నుండి వేరుపడటం మీద మన పునాది(విశ్వాసం) లేకపోయినట్లయితే పైన చెప్పిన గుంపులో మనం ఉంటాము.ఒకవేళ మనం దేవుని ఆలయానికి క్రమంగా వెళ్ళొచ్చు, యేసే నా దేవుడు అని చెప్పోచ్చు,దేవుని నుండి అద్భుతాలు పొందొచ్చు, పరిచర్యలో పాలుపంచుకొవచ్చు, ఐనా మనం క్రీస్తు వారంగా ఉండము. నీవు క్రీస్తు వాడవైతే క్రీస్తు (పైనున్న) పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన ఉన్నాడు.నీ మనస్సు క్రీస్తుతో కూడా ఉంటే నీ ఆత్మను గూర్చిన విషయాలపై ప్రథమంగా దృష్టించు!ఆయన భూమిపై ఉన్నప్పుడు అలాగే జీవించాడు.
దేవుడు అసహ్యించుకొనే ప్రతి పాపాన్ని తీవ్రంగా యెంచు!
◆ యేసు౼“నీవు కూడా వెళ్ళాలనుకుంటున్నావా?”

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...