❇ 450 మంది బయలు ప్రవక్తలు ఒక ఎద్దును తీసుకొని సిద్ధం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ "బయలు స్వామీ! మాకు జవాబివ్వు!" అంటూ బయలు పేరెత్తి మొరపెట్టుకొంటూ ఉన్నారు. వాళ్ళకు జవాబేమీ రాలేదు, ఎవరి స్వరమూ వినిపించలేదు. వాళ్ళు చేసిన బలిపీఠం దగ్గర చిందులు త్రొక్కడం మొదలుపెట్టారు. మధ్యాహ్న కాలంలో ఏలీయా వాళ్ళను గేలి చేశాడు గనుక వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, వాళ్ళ అలవాటుచొప్పున రక్తధార లయ్యేవరకు కత్తులతో ఈటెలతో తమను పొడుచుకొన్నారు.మధ్యాహ్నం నుంచి సందెవేళ నైవేద్యం పెట్టె సమయం వరకు పూనకం వచ్చి పిచ్చిపట్టిన వాళ్ళలాగా మసలుకొన్నారు. అయితే వాళ్ళకు జవాబేమీ రాలేదు.
అప్పుడు ఏలీయా ప్రజలందరితో "నా దగ్గరికి రండి" అన్నాడు. ప్రజలంతా దగ్గరికి వచ్చాక అతడు శిథిలమైపోయిన యెహోవా బలిపీఠాన్ని సరి చేసి ప్రార్ధించాడు....
వెంటనే దేవుని దగ్గర నుండి మంటలు దిగివచ్చి బలినీ కట్టెలనూ రాళ్ళనూ మట్టినీ దహించివేశాయి. కందకంలో ఉన్న నీళ్ళను ఇంకిపోయేలా చేశాయి. ప్రజలంతా ఇది చూచి సాష్టాంగపడ్డారు (1రాజు 18:22-39) ❇
■ ఇక్కడ రెండు రకాల భక్తి విధానాలు కనిపిస్తున్నాయి.
బయలు ప్రవక్తలు దేవుడు ఉన్నాడని నమ్మేవారే కానీ నాస్తికులు కారు. ప్రతిదినం వారి భక్తిలో ఉద్రేకం, ఉత్సాహం(excitement) పొందుతున్నారు. వీరితో అధికారుల మన్నన ఉంది(ఈ విశ్వాసంతో రాజు,రాణిలు ఏకీభవిస్తారు). పెద్ద గుంపే వారిని వెంబడిస్తున్నారు. బయలు ప్రవక్తలు ప్రతి దినం బయలును సేవిస్తూ, ఆరాధించే వారిగా కనిపిస్తున్నారు. ఐతే ఇది ఒకవైపు భక్తే(one way communication). వారు ఎవరిని దేవునిగా ఆరాధిస్తూ సేవిస్తున్నారో అటు వైపు నుంచి వానితో సహవాసం(relationship) ఏమాత్రం ఉండదు. వారు చేస్తున్న భక్తికి జవాబు ఉండదు(వారికి అవసరం కూడా లేదు). "తమకు నచ్చినట్లు స్వేచ్ఛగా బ్రతకాలి" అనుకునే వారికి ఇలాంటి భక్తి అనువైనది. ఇది విశాల మార్గం కనుక ఈ భక్తికి మొగ్గు చూపేవారు సహజంగానే ఎక్కువగా ఉంటారు.ఇది మతసంబంధమైన భక్తి. ఆదిలో కయీను చేసిన భక్తి!
■ ఈ christmas season లో ఇలాంటి నామకార్థ క్రైస్తవుల్ని పెద్ద గుంపుల్నే చూడొచ్చు.christmasని అడ్డం పెట్టుకొని Dances, skits, songs, carol service..full excitement..! క్రీస్తు పేరే చెప్పొచ్చు కానీ క్రీస్తుతో సంభంధం లేని భక్తి.(దేవునితో సంభంధం కలిగి దేవుని మహిమార్ధం, దేవుణ్ని ప్రకటించడానికి చేసే పనులు ఉంటాయి. నేను మాట్లాడుతుంది క్రీస్తుతో సహవాసం లేని వాటి గూర్చి). అలాంటి వారి ఉద్దేశ్యలను సరిదిద్ది, క్రీస్తును కేంద్రీకృతం చేస్తే సంఘాలు ఖాళీ ఐపోతాయి కనుక భోధకులు గద్దించరు..బయలు ప్రవక్తల వంటి భక్తే 'ఈ భక్తి' అని చెప్పటానికి నేను సంశయించను(religion without relationship). దేవుడు ఇలాంటి ఆరాధనలకు బదులు పలుకడు.
■ మరొక భక్తి ఉంది. ఒక్కడిగానే ఉన్నా అతనితో దేవుడు ఉన్నాడు. ఏలీయా చేసిన ప్రార్ధన అతి చిన్న ప్రార్ధన! అతను అనుదినం దేవుని మాట కోసం కనిపెట్టి, దేవుని స్వరం వినే(నడిచే) వ్యక్తి. ఇందులో దేవుడు-మనిషి ఇరువురు కలిసి నడిచే సహవాసం ఉంటుంది (bidirectional communication). ఇలాంటి వారే పడిపోయిన దేవుని బలిపీఠం కట్టి దేవునికి మహిమ తెగలరు. ప్రత్యేకమైన అనుబంధం కలిగి దేవుణ్ని ఆనుకొని, ఆయనతో సహవాసం చేసే వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. వాక్యానుసారం కానీ భక్తికి, లోకంతో కొట్టుకుపోయ్యె భక్తికి, వేరుగా కొత్త నిబంధన క్రైస్తవునిగా దేవుని ఆత్మ నడుపుదలకు మనల్ని మనం అప్పగించుకొని, ప్రభువుకు సాక్షులంగా జీవిద్దాం!
★ Religion or Relationship? To be who you want to be?

Comments
Post a Comment