❇ "మీరు క్రీస్తుతోకూడా సజీవంగా లేపబడి ఉంటే పైన ఉన్నవాటినే వెదకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవం క్రీస్తుతో దేవునిలో మరుగై ఉంది."(కొలస్సి 3:1-3) ❇
"మీరు క్రీస్తుతోకూడా సజీవంగా లేపబడి ఉంటే"౼
క్రీస్తు మృతి పొందిన తర్వాతే సజీవంగా లేపబడ్డాడు. క్రీస్తు పునరుద్దానుడు అవ్వాలంటే చనిపోవడం తప్పనిసరి!మృతి లేనిది పునరుద్దానం ఉండదు(అపో 3:15).కనుక మనం క్రీస్తుతో బాటు సజీవంగా లేపబడాలంటే మొదట చనిపోవాలి పాత స్వభావం దేవున్ని విడచిపెట్టి ఈ లోకవిషయాల పైనే మనస్సు నిలుపుతుంది. అవే ప్రధానమైనవిగా వెంపర్లడేటట్లు గ్రుడ్డితనం కలుగజేసి, అపవిత్రకు-పాపానికి బానిసలుగా చేసి, ఆత్మను గూర్చిన విషయాలను మర్చిపోయేట్లుగా జీవింప జేసిస్తుంది(2కోరి 4:4). చివరికి ఆ జీవితం దేవుని నిత్యశిక్షకు, ఆయనతో నిత్య ఎడబాటుకు తీసుకెళ్తుంది(ఎఫె 2:3).ఈ స్వభావం ఎప్పుడూ ఆత్మీయ(దైవ) సంగతులను నిర్లక్ష్యం చేసి, భూసంభందమైన వాటి మీదే మనస్సు నిలిపేట్లుగా ఉంచుతుంది. ఏదెనులో దేవుని విషయంలో చనిపోయిన ఈ స్వభావానికి క్రీస్తుతో పాటు సిలువలో చంపి, క్రీస్తు ఎలాగైతే నూతన జీవంతో పునరుద్ధనుడయ్యాడో, అలాగే మనకూ నూతన జీవాన్ని(New Life) అనుగ్రహించడం దేవుని చిత్తం(2కోరి 5:17)! అంటే ఇప్పటికే ఉన్న మన స్వభావానికి అతుకులు వేయటం వంటిది కాదు గానీ, దేవుని కృపలో క్రొత్త జన్మగా మార్చుతున్నాడు. ('క్రీస్తును నమ్మండి' అని మాత్రమే కాదు 'పాపాలను బట్టి పశ్చాత్తాపడండి' అని మారుమనస్సును ప్రకటించాలి. అపో 2:38). పాపాల విషయంలో పశ్చాత్తాపడకుండా క్రొత్త జన్మ ఉండదు.
"పైన ఉన్నవాటినే వెదకుతూ ఉండండి.పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి"౼
పడిపోయిన మన పాత స్వభావం మన మాంసయుక్తమైన మన దేహాల్లో నిలిచి ఉంటుంది. మనం దాని ఏలుబడి నుండి విడుదల చేయబడి, అపవాది అధికారం విషయమై చనిపోయిన వారము(రోమా 6:5). గనుక దేవుడు అనుగ్రహించిన ఈ నూతన స్వభావానికి౼వెనకకు లాగే శక్తి గల శరీర మనస్సుకు మధ్య పోరాటాలు మనలో జరుగుతుంటాయి(గలతి 5:17). శరీరారీత్యా మనం భూమిపైనే ఉన్నా, మనం ఆత్మలో పరలోక సంభంధులంగా(అంటే శరీరం భూమి మీద౼మన తల పరలోకంలో ఉన్నట్లుగా) బ్రతకాలి. 'పాత స్వభావానికి చనిపోయిన వారిగా ఎంచుకోవడం' అనేది దినదినము జరిగే అనుభవం(లూకా 9:23). "నేను" అనే స్వభావానికి ప్రతి రోజూ సిలువకు కొట్టాలి. దేవుని ఆత్మకు లోబడి జీవిస్తామో లేక శరీరం మనస్సు క్రింద జీవిస్తామో అది ఖశ్చితంగా విశ్వాసి తీర్మానమే!దేవుడు బలవంతం చెయ్యడు. క్రీస్తును సజీవునిగా లేపిన ఆత్మే, ఈ నూతన జీవితంలో మనల్ని క్రీస్తుతో కూడా లేపి, మనకు సహాయుడై దేవుని చిత్తం మనలో నెరవేరునట్లుగా చేస్తాడు.
౼ పరిశుద్దాత్ముడు బహు సున్నితమైన వాడు. ఆయనకు లోబర్చుకున్న వారినే బలపరుస్తాడు(ఆత్మపూర్ణులుగా చేస్తాడు. విశ్వాసులందరూ ఆత్మపూర్ణులు కారు అపో 6:3). విశ్వాసి పాపానికి మరలినప్పుడు దుఃఖపడతాడు. ఆయనే నేడు దేవుని చిత్తం మనలో జరిగేట్లుగా భాధ్యత తీసుకుంటాడు. దేవుని చిత్తం౼ 'మొదట తన కుమారుని(క్రీస్తు) సారూప్యంలోకి మార్చడం'(రోమా 8:29), 'రెండవదిగా మన పట్ల ఆయన ఉద్దేశించిన వ్యక్తిగత ప్రణాళికలు నెరవేర్చబడటం (ఎఫెస్సి 2:10) ఇలా ఒక వ్యక్తి పైనున్న(పరలోకంలో ఉన్న) దేవుని ఉద్దేశ్యలను వెదకగలడు. ఇవి భూసంభందమైన విషయాలన్నింటి కంటే శ్రేష్టమైనది. ఇదే విశ్వాసి అంతిమ గురి (హెబ్రీ 12:2) !
Comments
Post a Comment