Skip to main content

22Dec2017


❇ సమూయేలు యెష్షయిని, అతని కుమారులను పవిత్ర పరచి, బలి అర్పణలో పాలుపుచ్చుకోమని వారిని ఆహ్వానించాడు.యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసి౼“నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలచాడు.

అయితే యెహోవా సమూయేలుతో౼“అతడి ఎత్తునూ ఆకారాన్నీ లక్ష్యపెట్టవద్దు. ఎందుకంటే నేను అతణ్ణి నిరాకరించాను. దేవుడు మనిషిలాగా చూడడు. మనుషులు బయటి ఆకారాన్ని చూస్తారు గాని యెహోవా హృదయంతరంగాన్ని చూస్తాడు” అన్నాడు....

యెష్షయి తన కొడుకులలో ఏడుగురిని సమూయేలు ముందుకు రప్పించాడు గాని సమూయేలు “యెహోవా వీళ్ళను ఎన్నుకోలేదు! నీ కొడుకులందరూ ఇక్కడున్నారా?” అని యెష్షయిని అడిగాడు.

యెష్షయి౼“అందరికన్న చిన్నవాడున్నాడు. కానీ వాడు గొర్రెలు మేపుతున్నాడు”. సమూయేలు౼“అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా! అతడొచ్చే వరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు. కనుక యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి రప్పించాడు...

యెహోవా సమూయేలుతో౼“లేచి ఇతణ్ణి అభిషేకించు! నేను ఎన్నుకొన్నవాడు ఇతడే!”అని చెప్పాడు. సమూయేలు నూనెతో నిండిన కొమ్మును తీసి అతడి అన్నల సమక్షంలో అతణ్ణి అభిషేకం చేశాడు ❇


■ యెష్షయి దృష్టిలో దావీదు గొఱ్ఱెలకు మంచి కాపరి మాత్రమే!అతని కంటే గొప్ప దేహదారుఢ్యం గల పెద్దవారైన అన్నలు ఉన్నారు గనుక దావీదు ఇక అవసరం లేదని(లేక సరిపోడని) అతని అభిప్రాయం కావొచ్చు. ఇక్కడ దేవుడు తన ప్రవక్తయైన సమూయేలుకు కూడా ఒక పాఠం నేర్పుతున్నాడు. ఎత్తు, రూపం దేవుని చేత వాడబడటానికి అర్హతలు కావు. అప్పటికే సౌలు విషయంలో అది నిరూపించబడింది. దేవుడు దావీదును చేసిన ఎంపిక అప్పటికప్పుడు జరిగిన నిర్ణయం కాదు. అది దేవునితో అతని ప్రయాణాన్ని బట్టి కలిగింది. దేవుడు అనేక విధాలుగా అతని విశ్వాసాన్ని, అప్పగించబడిన దాని విషయంలో కనబర్చిన శ్రద్ధను, అతని త్యాగాన్ని, దేవునితో అంటుకట్టబడి, ఆయన్ను ఆధారం చేసుకున్న జీవితాన్ని చూశాడు.. ఇలా దావీదు దేవుణ్ని ఆధారం చేసుకొన్న విశ్వాస వీరునిగా-యోధునిగా దేవుని ముందు కనబడ్డాడు. సైన్యంలో కాదు! అరణ్యంలో గొర్రెల సంరక్షణలో!మందకు నమ్మకమైన కాపరిగా, ఎవ్వరూ చూడనప్పుడు దేవుని యెదుట ఆరాధికునిగా కనబడ్డాడు. దేవుడు గొప్ప విషయాల్లోనే ఉంటాడని అనుకోవద్దు.. మనుష్యులకు అతి స్వల్పంగా కనిపించే విషయాల్లోనూ అతి సమీపంగా ఉంటాడు.

■ ఒకవేళ ముందే అక్కడ దావీదు వారితో ఉన్నట్లేతే సమూయేలు సైతం దావీదును అభిషక్తునిగా ఉహించకపోవచ్చు! దావీదు ఇంటివారికి కూడా దావీదు మీద మంచి అభిప్రాయం లేదు(1సమూ 17:28)! కానీ దేవుని చూపు మునుష్యల చూపు కంటే విభిన్నమైనది. మొదట మనుష్యుల అభిప్రాయం అనే సంకేళ్ళ నుండి విడుదల చెయ్యబడాలి.దేవుని ఆత్మ మరియు దేవునితో నడిచే ప్రజల గద్దింపులకు మాత్రమే చెవి ఇవ్వాలి. అవి మన మేలుకోరి పలుకబడే మాటలు. విమర్శించే, నిందించే మాటలుగా ఉండవు. దావీదు దేవుని సముఖంలో, దేవుణ్ని ఆధారం చేసుకుని జీవించే వ్యక్తి. మనుష్యులు దేవుని సంబంధిని గుర్తుపట్టలేకపోవచ్చు గాని, దేవుడు తన వారిని గుర్తుపడతాడు. నీవు చిన్న చూపు చూడబడ్తున్నావని భాధపడుతున్నావా? నీకొక నిరీక్షణ మాటలు చెప్పనివ్వు!నీ విలువ దేవుని మనస్సులో ఉంటుంది..కానీ మనుష్యుల అభిప్రాయాలలో కాదు.నీవు దేవుని సముఖంలో జీవించే వ్యక్తివైతే, నీ విశ్వాసం దేవునిలో లోతుగా పాతుకపోనివ్వు!దేవుణ్ని బట్టి నిమ్మళంగా ఉండు! ఒక సమయం వస్తుంది..మనుష్యుల అభిప్రాయ కంచెను దేవుడే తీసివేస్తాడు..దానికి ఎదురు నిలవటం ఏ నరునికి సాధ్యపడదు.

౼ దావీదులో ఒక గొర్రెల కాపరిని వారు మాత్రమే చేశారు, కానీ దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప రాజును దేవుడు చూశాడు.ఇశ్రాయేలు చరిత్రలో దావీదు వంటి రాజు మరెవ్వరూ లేరు. నిన్ను గురించి నీ సృష్టికర్తకు గాక మరెవరకు సంపూర్ణంగా తెలియదు. కనుక కృంగిపోకు(మీకా 5:2)! దేవుని దృష్టిలో నీ విలువ ప్రత్యేకమైనది. మన ప్రాణాత్మలు సేద తీరడానికి దేవుని సన్నిధి అనువైన చోటు!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...