Skip to main content

13Dec2017

 మోషే మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావివద్ద ఆగిపోయాడు. మిద్యానులో రగూయేలు అనే యాజకునికి 7 కుమార్తెలున్నారు. ఒకరోజు వారు తమ తండ్రి గొర్రెల మందకు నీళ్లు తీసుకొని రావడాని ఆ బావి దగ్గరకు వెళ్లారు. వారు ఆ నీళ్ల కుండలను నింపడానికి ప్రయత్నం చేశారు కాని అక్కడ ఉన్న కొందరు గొర్రెల కాపరులు నీళ్లు చేదుకోనివ్వకుండా వారిని వెళ్లగొట్టేశారు. కనుక మోషే వారికి సహాయం చేసి, వారి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు.తర్వాత వాళ్లు వారి తండ్రి రగూయేలు దగ్గరకు వెళ్లిపోయారు.
అతడు వారితో ౼"ఈ రోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు” అన్నాడు.
వారు-“గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు.
అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు.
అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు. 

■ ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాలనుకున్న మోషేకు చేదు అనుభవం ఎదురయ్యింది.అప్పటికే మేలుకు ప్రతిగా జరిగిన కీడును బట్టి నిరాశ, నిస్పృహలతో ఐగుప్తును విడిచిన మోషే, యెదుట దేవుడు మరొక సంఘటనను ఉంచాడు. బలహీనులైన స్త్రీలను, బలవంతులైన గొర్రెల కాపరులు అడ్డగించినప్పుడు..తనకు సంబంధంలేని వ్యక్తుల కోసం మెషే నిలబడ్డాడు. ఒక్కడుగా ఉన్న మోషే, తనది కానీ ప్రాంతంలో, గొఱ్ఱల కాపరులకు ఎదురుగా నిలవడం నిజంగా ప్రాణాపాయమే! ఐనా తన గురించి కాకుండా ఎదుటివారి మేలుకోసం మాత్రమే ఆలోచించాడు(ఫిలిప్పీ 2:4). మోషేలోని నాయకత్వ లక్షణాలను పై సందర్భంలో స్పష్టంగా చూడవచ్చు.నాయకుడు ఒంటరిగా మిగిలిపోయినా, ఎవరూ తనను వెంబడింపక పోయినా నాయకుడు.. నాయకునిలాగే ప్రవర్తిస్తాడు. నాయకత్వం అంతరంగంగా ఇమిడి వుండే లక్షణం! దేవుడు నియమించే నాయకులలో పుట్టుకతోనే కొన్ని లక్షణాలను పొందు పరుస్తాడు. మోషే నాయకత్వంలో లోపాలు ఉన్నాయి! అది ముడి వజ్రంలాంటిది, దేవుడు దాన్ని సాన పెట్టబోవుతున్నాడు.

● ఆ సమయంలో ఒకవేళ ఇశ్రాయేలీయులకు మెషే మీది అభిప్రాయం ఇదై ఉండొచ్చు౼'దేవుడు విడిపించే నాయకుడు తానే అనుకుని ఫరోతో తలపడాలని చూసి పారిపోయిన వ్యక్తి'
● ఐగుప్తీయులు/ఫరో ఇంటివారి దృష్టిలో౼'బానిసల్లో ఒక్కడని తెల్సినా జాలిచూపి అంతఃపురంలో రాజకుమారునిగా పెరగనిస్తే..బానిసబుద్ధి చూపించిన ఒక కృతజ్ఞతరహితుడు'
■ కానీ దేవుని మనస్సులో మోషేపై అభిప్రాయం వీటికి భిన్నంగా ఉంది(హెబ్రీ 11:24-27). మనుష్యులు పనులు మాత్రమే చూడగలరు గాని దేవుడు అంతరంగాన్ని చూసే వానిగా ఉన్నాడు(1దిన 28:9).మనుష్యుల ఎదుటి వారి గూర్చి వారి అభిప్రాయాలను వెల్లడిస్తారు(చాలా సార్లు అవి తప్పుడు అభిప్రాయాలగానే ఉంటాయి).కానీ దేవుడు ఆ వ్యక్తి మేలు గోరి సహాయకునిలా నిలుస్తాడు.ఆయన మన పనుల కంటే కూడా దాని వెనుక ఉద్దేశ్యాలను లక్ష్యపెడతాడు. ఆ తప్పిదాలను గూర్చి ఆ వ్యక్తికి వెలిగింపు ఉందా(struggler or rebellion)అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు. మోషే అప్పుడు విధానం పరంగా తప్పిపోయాడు గాని ఆ పని వెనుక ఉన్న ఉద్దేశ్యం సరైనదిగా ఉన్నట్లు దేవుడు చూచాడు.

■ తన మామయైన రగూయేలు ఇంట్లో 40సం౹౹ అతి సామాన్య జీవితం జీవించాడు.ఒకప్పుడు ఆయుధాలు పట్టుకున్న చేతితో, కాపరి దుడ్డు కర్రను పట్టుకున్నాడు. సకలవిద్యలు నేర్చి జ్ఞానంతో మాట్లాడిన నోటితో, గొర్రెలును తోలాడు. యవ్వన వయస్సు దాటిపోయింది. వేటిని బట్టి తాను ఇశ్రాయేలీయులను విడిపించగలనని అనుకున్నాడో అవన్నీ తొలగించబడ్డాయి. తానెప్పుడైతే ఇక అర్హుడను కాను అనుకున్నాడో..అప్పుడే దేవుని చేత పిలువబడి,నిజమైన నాయకునిగా రూపుదిద్దబడ్డాడు.స్వల్పమైన వాటితో గొప్ప కార్యాలను చేయగల దేవుని బలానికి తనను తాను లోపర్చుకున్నాడు.ఐగుప్తు సామ్రాజ్యాన్ని దైవ శక్తితో వణికించాడు.అసాధ్యమైన కార్యాలు దేవుని బలంతో సాధకమవ్వటం కన్నులారా చూచాడు.అలా చరిత్రలో గొప్ప నాయకుడయ్యాడు.

★ 'దేవుడు లేకుండా మన శక్తి శూన్యం౼దేవుని ద్వారానే సమస్తం సాధ్యం' అని ఏ వ్యక్తి(నాయకుడు) ఈ సత్యాన్ని అని గుర్తెరిగి అనుభవపూర్వకంగా లోపర్చు కుంటాడో అప్పుడే దేవుని ఉద్దేశ్యాలు మన జీవితంలో పరిపూర్ణమౌతాయి.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...