Skip to main content

Posts

Showing posts from November, 2017

23Nov2017

❇ సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటితో వచ్చి షోమ్రోన్ను పట్టణాన్ని ముట్టడించాడు. అప్పుడు షోమ్రోనులో తీవ్రమైన కరవు సంభవించింది. ఆ నగర బయట, ద్వారం దగ్గర నలుగురు కుష్ఠురోగులు ఉన్నారు. వారు ఒకడితో ఒకడు౼ "మనం నగరంలోకి వెళ్లినా కరువు వల్ల చస్తాం! లేక ఇక్కడే కూర్చునివున్నా చస్తాం! గనుక మనం ఇప్పుడు సిరియనుల యుద్ధ శిబిరానికి వెళదాం పదండి! ఒకవేళ వాళ్ళు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతాం! చంపితే చస్తాం!" అని చెప్పుకొన్నారు. ఐతే అప్పటికే దేవుడు సిరియా సైన్యానికి, రథాలూ-గుర్రాల చప్పుడు వినిపించేలా చేశాడు గనుక ఇశ్రాయేలీయులు హిత్తియ రాజుల్నీ, ఐగుప్తు రాజుల్నీ సహాయంగా పిలుచుకొని పెద్ద సైన్యంతో దాడికి దిగారనుకొని అక్కడ నుండి ఉన్నపాటున పారిపోయారు. ఆ కుష్ఠురోగులు శిబిరం ప్రవేశించి సిరియనులు పారిపోయ్యారని తెల్సుకొని, ఆకలితో ఉన్నందున వారి గుడారాల్లోకి చొరబడి, తిని త్రాగారు. అక్కడనుంచి వెండి, బంగారం, దుస్తులు ఎత్తుకుపోయి వేరే చోట దాచారు. అప్పుడు వారు ఒకడితో ఒకడు౼"మనం చేసేది మంచి పని కాదు. ఈ రోజు శుభదినం. కానీ మనం ఎవరికీ చెప్పడం లేదు. మనం వెళ్ళి రాజభవనంలో ఈ విషయం తెలియజేద్దాం!" అని చెప్...

22Nov2017

❇ యెహోవా మోషేతో౼"నేను బెసెలేలును ప్రత్యేకించుకొన్నాను. నేను అతణ్ణి దైవాత్మతో నింపాను. అతనికి జ్ఞానం, తెలివి, వివేకం ప్రసాదించాను.నేర్పుతో పనులను కల్పించడానికీ, బంగారం, వెండి, కంచుతో పని చెయ్యడానికీ పొదగడం కోసం రత్నాలను సానపెట్టడానికీ, మ్రానులను చెక్కడానికీ, అన్ని విధాల పనులను చెయ్యడానికీ అతణ్ణి ప్రవీణుణ్ణి చేశాను". బెసెలేలు తుమ్మకర్రతో దేవుని మందసాన్ని చేశాడు. రెక్కలు పైకి విప్పి ఉన్న రెండు కెరూబు ఆకారాలు బంగారంతో, మందసపు మూతపై కప్పి ఉన్నట్లుగా చేశాడు. మరియు తుమ్మకర్రతో బల్లను-ధూపవేదికను-బలిపీఠాన్ని, మేలిమి బంగారంతో దీపస్తంభాన్ని , కంచుతో గంగాళాన్నీ-దాని పీఠాన్నీ, మరియు ఆవరణాన్ని-వాటి తెరలను తయారు చేశాడు. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినది అంతా బెసెలేలు, అహోలీయాబుతో కలిసి చేశాడు. ❇ ■ దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన ప్రత్యక్ష గుడారం నమూనా పరలోక పోలికగా (గుర్తుగా) ఉంటుంది. దేవుడు మెషేకు ప్రత్యక్ష గుడారపు నమూనాను కొండపైన చూపాడు(నిర్గ 25:40).దానిని సరిగ్గా అలాగే చెయ్యడానికి అనగా మోషే దాని గూర్చి వివరణ ఇవ్వగా, ఒకరు సరిగ్గా దేవుడు చెప్పినట్లుగానే మలచాల్సివుంది. ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్...

17Nov2017

❇ యేసు సిలువ వేయబడక ముందు రాత్రి..భోజన సమయంలో శిష్యులు తమలో 'ఎవరు గొప్ప' అనే వివాదం వారిలో తలెత్తింది. అప్పుడు యేసు౼"ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. తమ మీద అధికారం చెలాయించే వారు 'ఉపకారులు' అని పిలిపించుకుంటారు. మీరు అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాడిలా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక వడ్డించే వాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను. ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసికొని, దానిని నడుముకు చుట్టుకున్నాడు.అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవసాగాడు. యేసు వాళ్ళ కాళ్ళు కడిగి, ఆయన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వాళ్ళతో౼"నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? మీరు నన్ను 'బోధకుడు, 'ప్రభువు' అని సరిగానే పిలుస్తున్నారు.బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. నేను మీకు చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక మాదిరి చూపించ...

14Nov2017

❇ యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా, ఓడ బ్రద్దలైపోయే తీవ్రమైన తుఫాను రేగింది. నావికులకు భయపడి ప్రతివాడు తన తన దేవుళ్ళకి మొర పెట్టాడు, ఓడ తేలిక చేయడానికి వారు దానిలో ఉన్న సరుకులు సముద్రంలో పారవేశారు. అప్పటికే యోనా ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకొని బాగా నిద్రపోయాడు. ఓడ నాయకుడు యోనాదగ్గరికి వెళ్ళి౼“ఓయ్! నువ్విక్కడ నిద్రపోతున్నావా?లేచి నీ దేవునికి ప్రార్ధన చెయ్!ఒకవేళ ఆయన మనల్ని కనికరించి నాశనం కాకుండా కాపాడతాడేమో"అన్నాడు అప్పుడు నావికులు౼"ఎవరి కారణంగా ఈ ఆపద మనమీదికి వచ్చిందో చీట్లు వేసి తెలుసుకొందాం, రండి" అని చెప్పుకొన్నారు. వారు చీట్లు వేసినప్పుడు..చీటి 'యోనా' పేరు మీద వచ్చింది. ❇ ■ దేవుడు ప్రవక్తయైన యోనాను నీనెవే మహా పట్టణానికి వెళ్లి ఆ ప్రజల ఘోర పాపాలను బట్టి హెచ్చరించమని చెప్పాడు. కానీ యోనా దేవుని మాట వినకుండా పారిపోయ్యాడు. అప్పుడు దేవుడు గొప్ప తుఫానును సముద్రం పైకి పంపాడు. పెద్ద గాలి తుఫానులతో నీటిలో నివసించే ప్రాణులు, అందులో ప్రయాణించే ఓడలు (మనుష్యులు) భయాందోళనకు గురైయ్యారు. ఓడను తేలిక చేయడానికి వారి వస్తువులు సముద్రంలో పడేశారు. ఎంతో నష్టం వారికి ...

10Nov2017

❇ ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుష్యులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు(మతనిష్ఠ గలవాడు), ఇంకొకడు (అన్యాయంగా) పన్నులు వసూలు చేసేవాడు. పరిసయ్యుడు నిలబడి౼"దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదో వంతు నీకిస్తున్నాను" అని తనలో తాను ప్రార్థన చేశాడు. ఐతే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడటానికి కూడా వాడికి ధైర్యం చాల్లేదు. వాడు గుండెలు బాదుకుంటూ పశ్చాత్తాపంతో౼"దేవా, పాపినైన నన్ను కరుణించు! " అన్నాడు. పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాడినే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ❇ ■ పరిసయ్యుడు బాహ్యంగా ఎంతో నీతిమంతునిగా కనిపిస్తున్నాడు. పరులవి ఏమీ ఆశించక, ఆధ్యాత్మిక చింతన(భక్తి) కలిగి జీవిస్తున్నాడు. వారానికి రెండుసార్లు ఉపవాసం, సంపాదనలో పదో వంతు దేవునికి ఇస్తూ, నైతిక విలువలతో ఆలయంలో ఎంతో భక్తిపరునిగా, ఎందరికో మాదిరిగా ఉన్నాడు. ఇతని ప్రార్ధనను బట్టి చూస్తే చెడు మార్గాలకు పోని జీవన...

09Nov2017

❇ ఆకాశమా, ఆలకించు!భూమీ, విను! దేవుడు మాట్లాడు తున్నాడు౼ “నేను నా పిల్లలను పెంచి పోషించాను. వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దుకు తన యజమాని తెలుసు, గాడిదకు యజమాని మేత పెట్టే స్థలం తెలుసు. కానీ (ఇశ్రాయేలు) నా ప్రజలకు నేను తెలియదు. నా ప్రజలు గ్రహించరు. అయ్యో! ఈ ప్రజలు దోషులు...!వారు దేవుణ్ణి వదలిపెట్టారు, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుడ్ని) తిరస్కరించారు, ఆయనను విడిచి తొలగిపోయారు"(యెషయా 1:2-4) ❇ ■ దేవుని ఇంట్లో(సన్నిధిలో) ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఉంటుంది. ఆయన మనుష్యులను ప్రాణం లేని గ్రహాల్లాగా, నక్షత్రాల్లాగా, సముద్రాల్లాగా పుట్టించలేదు గాని ఆయన్ను స్వేచ్ఛగా కోరుకుంటూ, సేవించగలిగే వారిగా ఆయన స్వభావంలో పుట్టించాడు. దేవుడు సృష్టిని ఆరు దినాల్లో ముగించాడు. ప్రతి దినం సృష్టిని రూపొందిస్తున్నప్పుడు ఆయన మనస్సులో మానవుని గూర్చి ఆలోచిస్తున్నాడు. సృష్టినంతా వాని కోసమే నిర్మించాడు. ప్రేమగల తండ్రి తన బిడ్డల గురించి ముందుగానే ఆలోచిస్తూ, సిద్ధపర్చినట్లుగా..ప్రతి చిన్న విషయం గురించి ఆలోచించాడు. ఆహారానికి రకరకాల పండ్లను, కూరగాయలను, ధాన్యాలను ఇచ్చాడు. ఈ అందమైన ప్రకృతిలో వానికి ఏ కొదువా ఆయన చెయ్యలేదు. ఆరవ...

08Nov2017

❇ అప్పుడు ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ, అగాధం తాళం చెవి ఉన్నాయి. ఆ దేవదూత 'అపవాది', 'సాతాను' అనే పేర్లున్న ఆది సర్పాన్ని పట్టుకొని 1000 సంవత్సరాల వరకూ బంధించి, వాణ్ణి అగాధంలో పడవేసి, దానిని మూసివేసి, దానికి ముద్ర వేసాడు. ఆ తరువాత వాణ్ణి కొద్ది కాలానికి విడుదల చేయడం జరిగి తీరాలి... 1000 సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలోనుండి విడుదల అవుతాడు. వాడు బయల్దేరి నాలుగు దిక్కులలో ఉన్న గోగు, మాగోగు అనే దేశాల్ని మోసం చేసి యుద్ధానికై సమకూరుస్తాడు. వారు అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకంనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేస్తుంది. వారిని మోసం చేసిన అపవాదిని అగ్ని గంధకములు గల గుండములో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ(anti-christ), అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు యుగయుగాలకు రాత్రింబగళ్లు వేదనపాలై ఉంటారు (ప్రకటన 20:1-10).❇ ■ సాతాను(అపవాది) యొక్క అంతిమ గతి ఇలా ఉండబోతుంది. "సాతాను భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకు న్నాడు"(ప్రక 12:12).ఆ అంతిమ తీర్ప...

07Nov2017

❇ దెలీలా తన తొడ మీద సమ్సోణ్ని నిద్రపోయేలా చేసి, ఒక మనిషిని పిలిపించి, సమ్సోను తలమీద ఉన్న ఏడు జడలు గొరిగించింది. సమ్సోను బలహీనుడయ్యాడు. అప్పుడామె అతణ్ణి బాధించడం మొదలు పెట్టింది. మరియు ఆమె౼“సమ్సోను! ఫిలిష్తీయులు మీ మీదికి వచ్చేస్తున్నారు” అని ఆమె అరచింది. అతడు నిద్ర మేల్కొని “మునుపులాగే బయటికి వెళ్ళి విజృంభిస్తాను” అనుకొన్నాడు. యెహోవా తనను విడిచిపెట్టాడని అతనికి తెలియదు. వెంటనే ఫిలిష్తీయులు అతణ్ణి పట్టుకొన్నారు. అతని కళ్ళు ఊడబెరికారు. అతణ్ణి గాజాకు తీసుకుపొయ్యారు. అక్కడ అతణ్ణి కంచు గొలుసులతో కట్టివేసి, ఖైదులో తిరగలి విసిరేవాడుగా చేశారు. అయితే గొరిగిన అతని తలవెండ్రుకలు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి.❇ ■ సమ్సోను పుట్టుక చాలా ప్రత్యేకమైనది. బైబిల్ లో అతి కొద్దిమంది గూర్చి మాత్రమే, ఒకడు పుట్టక మునుపే వాని జననం గూర్చి, వాని పట్ల దేవుని ప్రణాళికల గూర్చి దేవుడు ముందుగానే తెలియజేశాడు. సమ్సోను వారిలో ఒకడు. దేవుడు తన దూతను పంపి తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెప్పి, హెచ్చరించి దేవునికి ప్రతిష్ఠితుడైన వాడని తెలియజేశాడు. ఒక్క సమ్సోనే దేవుని సైన్యంలా వాడబడ్డ గొప్ప బలశాలి. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబ...

06Nov2017

❇ లుస్త్రలో పుట్టు కుంటివాడొకడు కూర్చుని ఉన్నాడు. కాళ్ళలో సత్తువ లేక అతడు పుట్టినప్పటి నుండి ఎన్నడూ నడవలేదు. పౌలు మాట్లాడుతూ ఉంటే అతడు విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసముందని గ్రహించి౼ "లేచి నిలబడు!" అని బిగ్గరగా చెప్పాడు. అతడు తటాలున లేచి నిలబడి, గంతులు వేసి నడవసాగాడు ❇ ■ దేవుడు అనాధికాల సంకల్పంలో ప్రతి మనిషిని కలుసుకోవడానికి ఒక సమయం నిర్ణయిస్తాడు. లుస్త్రలో పుట్టు కుంటివాడు ఎన్నోసార్లు ఆ దారిలో వచ్చి ఉండొచ్చు..కానీ ఆ రోజు అతనికి-దేవునికి ఒక ప్రత్యేకమైన రోజు. సృష్టికర్త అతణ్ని కలుసుకునే రోజు. పౌలు మాటలను అతను శ్రద్ధగా వింటున్నప్పుడు..అతనిలో దేవునిపై లోతైన విశ్వాసం కలిగింది. తమ సృష్టికర్తయిన దేవుని మాటలు తమ దగ్గరకు వచ్చినప్పుడు, నిజానికి మానవహృదయాలు గుర్తుపడతాయి. ఐతే యదార్థవంతులు హత్తుకోగా, హృదయంలో పాపాన్ని ప్రేమించే వారు, సత్యానికి చెవి ఇవ్వనివారు, వారి హృదయ కఠినత్వాన్ని బట్టి త్రోసిపుచ్చుతారు. దేవుణ్ని హత్తుకున్నవారు దేవునితో జీవిస్తారు, ఆయన్నుండి వెరై ఉండాలనుకునే వారు పాపానికి దాసులుగా జీవిస్తారు. సత్యాన్ని ప్రేమించే ప్రతివాడు దేవుణ్ని హ...

04Nov2017

(నిన్నటి ధ్యానానికి కొనసాగింపు..) ● ఏదెను తోటలో మానవుని స్వచిత్తం దేవుని ఆజ్ఞాతిక్రమానికి దారితీసి, తద్వారా మానవుని పతనం జరిగింది. పాపంకు మూలకారణం 'స్వచిత్తం'.క్రీస్తు ఆ పాపానికి క్రయధనం చెల్లించాడు. యేసు౼"అనుదినం నీ సిలువ నెత్తుకొని వెంబడించండి" అని చెప్పాడు.'నీ సిలువ నెత్తుకొని వెంబడించు' అంటే౼నీ స్వేచ్చా పూర్వకమైన స్వంత ఏలుబడికి ఇష్టపడక, దేవుని ఏలుబడి క్రింద అనుదినం జీవిచడం. ఇకను జీవించు వాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించాలి అని అనుదినం తీర్మానించు కోవడం. ఇది కూడా విశ్వాసుల స్వేచ్ఛపై ఆధారపడివుంది. పౌలులో క్రీస్తు స్వభావం స్పష్టంగా ఎందుకు కనిపిస్తుంది?మరి మనలో ఎందుకు అంత స్పష్టత లేదు..పౌలు తన జీవితంలో స్వచిత్తానికి సిలువ వేశాడు. మన జీవితాల్లో అది జరగట్లేదు. కనుకనే ఇంకా పాత పురుషుడే కొన్ని విషయాల్లో ఏలుతున్నాడు. విశ్వాసిలో ఈ కార్యం మునుపు జరిగి తిరిగి లోకసంభధమైన జీవితానికి అవకాశం ఉంది(హెబ్రీ 3:12, రోమా 8:13). పౌలు ఆత్మీయ ఎదుగుదలను దేహంతో(పసిబిడ్డలాగా, ఎదిగిన వారిగా) పోల్చాడు(హెబ్రీ 5:13).శిశువు పాలు త్రాగుతూ దినదినం ఎలా ఎదుగుతాడో(రోజు కొంత మార్పు జరుగుత...

03Nov2017

"ఒకసారి వెలిగింపబడిన వాళ్ళు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసిన వాళ్ళు, పరిశుద్దాత్మలో భాగం పంచుకున్న వాళ్ళు, దేవుని శుభవాక్కునూ౼దైవ సందేశం యొక్క మంచితన్నాన్ని రుచి చూసిన వాళ్ళు, రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచిన వాళ్ళు", ఒకవేళ మార్గం విడిచి (పడిపోతే)తప్పిపోతే౼'వారిని తిరిగి మారుమనస్సు పొందేటట్లు(పశ్చాత్తాప పడేలా) చేయటం అసంభవం. ఎందుకంటే, వాళ్ళు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువవేసి చంపుతున్నారు. ఆయనను బహిరంగంగా అవమానపరుస్తున్నారు' (హెబ్రీ 6:4౼6). "ఒకప్పుడు క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను, గనుక నేను శాశ్వితంగా రక్షణ పొందాను.." అనేది మనకు తెల్సిన,అనేక సార్లు మనం వింటున్న మాటలు. ఐతే సత్యనికి సరైన ప్రామాణికం౼ భక్తిపరుడైన భోధకుని మాటలో, ఇప్పటివరకు మనం నమ్మిన సిద్దాంతపు భోధో కాకూడదు కానీ దేవుని వాక్యము మాత్రమే ప్రామాణికం అవ్వాలి. రక్షణ౼ మన క్రియలను బట్టి కాకుండా క్రీస్తు యేసుపై ఉంచిన విశ్వాసం మూలంగా, మారుమనస్సు ఫలితంగా దేవుడు అనుగ్రహించిన ఒక బహుమనం(కృప). ఇది అందరి రక్షణ నిమిత్తం దేవుడు బాహాటంగా ఉంచిన ఒక పిలుపు(మత్త 11:28). వి...

02Nov2017

❇ఒకసారి యేసు వెళ్తుంటే క్రిక్కిరిసిన జనసమూహం ఆయన మీద పడుతున్నారు. అప్పుడు 12 సం|| నుండి రక్తస్రావంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్న డబ్బంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు. ఆమె విశ్వాసంతో యేసు వెనగ్గా వచ్చి ఆయన పైబట్ట అంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. వెంటనే యేసు౼"నన్ను తాకిందెవరు?" అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు "మాకు తెలియదే" అన్నారు.  అప్పుడు పేతురు౼"ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ మీద పడుతున్నారు" అన్నాడు. యేసు౼"ఎవరో నన్ను తాకారు. నాలోనుండి ప్రభావం బయటకు వెళ్లిందని నాకు తెలిసింది" అన్నాడు.  ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్ధమైంది.ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకుందో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలకి వివరించి చెప్పింది. అందుకు ఆయన౼"కుమారీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు" అన్నాడు. ❇ ■ బహిరంగంగా చెప్పుకోలేని రోగంతో౼శారీరకంగా, ఆర్ధికంగా మానసికంగా ఆ స్త్రీ కృంగిపోయివుంది. ఇక బాగవుతానన్న నిరీక్షణ లేనప్ప...