(నిన్నటి ధ్యానానికి కొనసాగింపు..)
● ఏదెను తోటలో మానవుని స్వచిత్తం దేవుని ఆజ్ఞాతిక్రమానికి దారితీసి, తద్వారా మానవుని పతనం జరిగింది. పాపంకు మూలకారణం 'స్వచిత్తం'.క్రీస్తు ఆ పాపానికి క్రయధనం చెల్లించాడు. యేసు౼"అనుదినం నీ సిలువ నెత్తుకొని వెంబడించండి" అని చెప్పాడు.'నీ సిలువ నెత్తుకొని వెంబడించు' అంటే౼నీ స్వేచ్చా పూర్వకమైన స్వంత ఏలుబడికి ఇష్టపడక, దేవుని ఏలుబడి క్రింద అనుదినం జీవిచడం. ఇకను జీవించు వాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించాలి అని అనుదినం తీర్మానించు కోవడం. ఇది కూడా విశ్వాసుల స్వేచ్ఛపై ఆధారపడివుంది. పౌలులో క్రీస్తు స్వభావం స్పష్టంగా ఎందుకు కనిపిస్తుంది?మరి మనలో ఎందుకు అంత స్పష్టత లేదు..పౌలు తన జీవితంలో స్వచిత్తానికి సిలువ వేశాడు. మన జీవితాల్లో అది జరగట్లేదు. కనుకనే ఇంకా పాత పురుషుడే కొన్ని విషయాల్లో ఏలుతున్నాడు. విశ్వాసిలో ఈ కార్యం మునుపు జరిగి తిరిగి లోకసంభధమైన జీవితానికి అవకాశం ఉంది(హెబ్రీ 3:12, రోమా 8:13). పౌలు ఆత్మీయ ఎదుగుదలను దేహంతో(పసిబిడ్డలాగా, ఎదిగిన వారిగా) పోల్చాడు(హెబ్రీ 5:13).శిశువు పాలు త్రాగుతూ దినదినం ఎలా ఎదుగుతాడో(రోజు కొంత మార్పు జరుగుతుందో), అలాగే విశ్వాసి పాపంతో రాజీపడు తున్నప్పుడు ఆత్మీయ పతనం కూడా..కొన్నిసార్లు మనం గుర్తించలేని రీతిలో దినదినం (slowగా) జరుగుతుంది.
● బలహీనతల గూర్చి నేను చెప్పట్లేదు కానీ ఆత్మీయ పతనం గూర్చి చెప్తున్నాను..బలహీనతలో పాపం పట్ల దుఃఖం, పశ్చాత్తాపం, బయటికి రావాలనే బలమైన వాంఛ ఉంటుంది. అలాంటి వారికి దేవుడు సహాయకుడు. సహా విశ్వాసి కూడా అట్టి వారికి ఊతగా నిలవాలి.విశ్వాసి అంటే యేసే దేవుడు అని ఒప్పుకునేవాడు కాదు(అది దయ్యాలు/నామకార్థ క్రైస్తవులు కూడా చేస్తారు కదా!) గానీ, దేవుని ఏలుబడి క్రింద యేసులో ఉన్న వాడని అర్ధం. ఒకడు దేవుని ఏలుబడి నుండి (పోరాటం లేకుండా) వేరైపోతే వాడి విశ్వాసానికి అర్ధం ఏమిటి?బలహీనత సమర్ధనగా మారితే అది పతనానికి మార్గం తెరుస్తుంది.
పతనంలో౼ హృదయం నేరారోపణ చేస్తున్నా ఒప్పుకోకుండా, ఎవ్వరైనా చూస్తున్నారా అని మాత్రమే చూసుకుంటూ, దైవ భయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, కఠినం చేసుకొని, గద్దించిన వారిలో లోపాలు వెతుకుతూ, పరిశుద్ధులతో(పరిశుద్ధాత్మతో) పోరాడుచూ, తమ వైఖరిని సమర్ధించుకునే వాక్యాల కోసం వెతుకుతూ, అలాంటి భోధకులు భోధకు చెవి ఇస్తూ తమను తాము నాశనానికి నడుపుకుంటారు. అలాంటి వారిని దేవుడు కూడా మోసం చేస్తాడు(2థేస్స 2:11,12).విశ్వాసి పతనం సాధ్యమేనని బైబిల్ స్పష్టం చేస్తుంది.
● "ఒక చర్చిలో పాస్టర్౼అవిశ్వాసియైన ఒకడ్ని సంఘ పెద్దగా నియమిస్తే, అతని వల్ల సంఘానికి చెరుపు జరిగినట్లేతే, ఇప్పుడు ఆ నష్టానికి కారణం మొదట ఎవరిని మీరు అనుకుంటున్నారు?అవిశ్వాసియైన ఆ సంఘ పెద్ద వాడి స్వభావాన్ని బట్టే ప్రవర్తించాడు. అవిశ్వాసిని అలాంటి పవిత్రమైన స్థానంలో, పరిశుద్ధులైన విశ్వాసులపై నియమించిన వాడిదే ఖశ్చితంగా తప్పు అవుతుంది"
ఇప్పుడు చెప్పండి! ఇష్కరియోతు యూదా, విశ్వాసా?అవిశ్వాసా? అనేకమంది శిష్యులు యేసుతో ఉంటే వారిలో 12 మందిని ఎన్నుకున్నాడు. అది రాత్రంతా ప్రార్ధించి ఎన్నుకున్నాడు. క్రీస్తు తండ్రి చిత్తానుసారం ప్రతి విషయం చేస్తాడని మనకు తెల్సు కదా!(లూకా 6:12-16).క్రీస్తు సిలువ మరణం కోసమే ఇతన్ని ఎన్నుకుంటే, అతను పుట్టకుండా ఉంటే మేలు అని ఆయన ఎందుకు చెప్తాడు? అపవాది వాని శరీరాన్ని ఆక్రమించుకునేంతగా విశ్వాస భ్రష్టత్వానికి అప్పగించుకొన్నాడు.
● (ప్రకటన 2-3)యోహాను ప్రకటన గ్రంథంలో ప్రభువు సంఘాలతో మాట్లాడాడు. అప్పుడు ఆయన కొన్ని కఠినమైన హెచ్చరికలు చేసాడు.దేవుడే బలపరచుకుంటాడు అనే సిద్దాంతాన్ని మనస్సులో పెట్టుకొని ఒకసారి ధ్యానించండి, ఆ సిద్ధాంతం తేలిపోతుందని గ్రహిస్తారు. జీవగ్రంధం నుండి పేరు తుడిచి వేయటం గూర్చి చదువుతాము (3:5).ఒక్కసారి వ్రాయబడినది శాశ్వితమైనదైతే, తుడిచి వేయటం అనే ప్రశ్న ఉండదు కదా!(నిర్గ 32:32,33). పడిన స్థితి నుండి మారుమనస్సు పొందకపోతే దీప స్థంభం తీసివేస్తానని హెచ్చరించాడు. క్రీస్తు౼సంఘం వెలుపల ఉంటే, అలాంటి సంఘం దేవుని రాజ్యంలో ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? (3:20).కొండమీద ప్రసంగం శిష్యులతోనే ప్రభువు పలికిన మాటలు(మత్త 5:1,48). అలాంటప్పుడు నరకం గూర్చిన ప్రస్తావన ఇక అవసరమేమిటి?(మత్త 5:22,29,30) ఇంకా ఇలా ఉదాహరణలతో చూపగలను..
● యోహాను 15 అధ్యాయం శిష్యులతో యేసు మాట్లాడు తున్నాడు. (15:6)నిలిచి ఉండమన్న పదే పదే క్రీస్తు చెప్తున్న మాటలను గమనించండి. ద్రాక్షవల్లిలో నిలిచి ఉండని తీగెలను అగ్నిలో పారవేయబడుతుందని హెచ్చరించాడు. మానవుని రక్షణ ప్రణాళిక మొదట దేవుని ఆలోచన. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు(1యోహా 4:14).కానీ ఒకడు క్రీస్తులో నిలిచి ఉండటం అనేది మాత్రం వాని స్వేచ్ఛ నిర్ణయం. అలా అంతం వరకు నిలిచి ఉండిన వారే రక్షించబడతారు(హెబ్రీ 3:15, మత్త 24:13).నిలిచివుండమని లేఖనాలు విశ్వాసిని హెచ్చరిస్తున్నాయి.(కొలస్సి 1:23, రోమా 11:22, 2కొరింధి 1:21,గలతి 5:1,1 థేస్స 3:8, 1యోహా 2:6,24,28, 3:6)
నిలిచివున్న ప్రతీ తీగెను ఆయన ఫలిపజేస్తాడు, బలపరుస్తాడు, నిలువబెట్టుటకు శక్తిమంతుడు. దానిలో సందేహమే లేదు. ఆయన ఏమి చెయ్యగలడో అది మనందరం దాన్ని ఎలాగూ నమ్ముతున్నాం గనుక నేను దానిని నొక్కి చెప్పదల్చుకోలేదు!(యూదా 1:21,24, ఫిలిప్పీ 1:4, యోహా 10:28) ఆయన స్వరం విని(follow), క్రీస్తులో దాగివున్న(నిలిచివున్న) విశ్వాసికి దేవుడిచ్చిన వాగ్దానాలు అవి.సగం సత్యాన్ని అపవాది వాడి ఆయుధంగా వాడతాడు(మత్త 4:6). ఆయన ఆత్మ బలపరచకుండా ఒక విశ్వాసి క్రీస్తులో నిలిచివుండటం అసాధ్యం. నూతన నిబంధన జీవితానికి పరిశుద్ధాత్ముడే సహాయకుడు. ఆయన ఆత్మ నింపుదల లేకుండా క్రీస్తు సారూప్యం అసంభవం.నిలిచివుండాలి కాబట్టి కేవలం మానవ శక్తి, తీర్మానాలతో ఇది సాధ్యం పడదని చెప్పాలనేదే నా ప్రయత్నం.
● సంపూర్ణ సత్యం ఏమిటంటే...మన రక్షకుడైన క్రీస్తు యేసు నందు దేవుడు మనల్ని భద్రం చేసి, రక్షించుకోవాలని అనాధికాల మర్మంగా, దేవుడు భూమికి పునాది వేయబడక ముందే నిర్ణయించాడు.క్రీస్తు తన వారినందరిని రక్షించగల సమర్థుడు. ఏవరైతే క్రీస్తు సత్యానికి లోబడి రక్షకుడైన క్రీస్తు యేసుని నీడకు వచ్చి దాగుతారో, అందులో నిలిచివుంటారో వారు క్రీస్తులో భద్రపరచబడినవారు.ఐతే ఈ క్రీస్తు సరళతలో నున్న (కన్య వంటి) విశ్వాసిని సైతం అపవాది హవ్వను మోసాగించినట్లు లాగి వేసి(2కోరింధి 11:3), ఆత్మీయ వేశ్యలుగా తిరిగి లోక సాంగత్యనికి తిప్పివేయగలడు(యకో 4:4).మనల్ని పిలుచుకున్న వాడు నమ్మదగిన వాడు, నిలబెట్ట సమర్థుడు. ఐనా నీ స్వచిత్తాన్ని ఆయనకు లోబర్చుతూ, క్రీస్తు ప్రేమలో, విశ్వాసంలో నిలిచివుంటూ భయంతో, వణకుతో సొంత రక్షణను కొనసాగించాలి.
౼దేవుడు నాకు అప్పజెప్పిన ప్రధమ పని౼సిద్దాంత బోధన/వాటి నిరూపణ వాదనలు కావు గాని, విశ్వాసికి అనుభవజ్ఞానంలో బోధించడం, సహాయకునిగా ఉండటం, సువార్త సత్యానికి నమ్మకస్తునిగా కొనసాగడం.నేను ఇక్కడితో ఈ ధ్యానాలు ముగిస్తాను. దేవుని కృప మనందరికీ తోడైవుండును గాక!

Comments
Post a Comment