❇ యేసు సిలువ వేయబడక ముందు రాత్రి..భోజన సమయంలో శిష్యులు తమలో 'ఎవరు గొప్ప' అనే వివాదం వారిలో తలెత్తింది.
అప్పుడు యేసు౼"ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. తమ మీద అధికారం చెలాయించే వారు 'ఉపకారులు' అని పిలిపించుకుంటారు. మీరు అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాడిలా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక వడ్డించే వాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.
ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసికొని, దానిని నడుముకు చుట్టుకున్నాడు.అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవసాగాడు.
యేసు వాళ్ళ కాళ్ళు కడిగి, ఆయన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వాళ్ళతో౼"నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? మీరు నన్ను 'బోధకుడు, 'ప్రభువు' అని సరిగానే పిలుస్తున్నారు.బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. నేను మీకు చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక మాదిరి చూపించాను. ❇
■ దేవుడు యేసు నామమును అన్ని నామములకన్నా పైన ఉంచాడు. ఆయన తన కుమారుడిని కాదు గాని మనుష్యులందరి కంటే తనను తాను తగ్గించుకొని దీనుడయ్యాడు. దేవునితో సమానంగా అత్యున్నత సింహాసనంపై ఆశీనుడై ఉన్నవాణ్ణి౼"జననం నుండి మరణం వరకు మనుష్యులు హీనపర్చుకునే స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేసినా దీనుడై స్వీకరించాడు". దేవుని జ్ఞానంలో, పరిశుద్ధతలో అందరి కంటే ఎంతో ఉన్నతుడై ఉన్నప్పటికీ ఎన్నడూ మనుష్యులను చిన్న చూపుచూడలేదు గానీ అత్యంత హీనులుగా, పాపులుగా లోకం చేత పిలువ బడిన వారితో స్నేహం చేసి వారిని దైవమార్గంలో నిలిపాడు. వేషధారులను గద్దించి, కోపపడి దీనుడిగా కనిపించాడు.
దేవుని దృష్టిలో గొప్పవాడంటే మనుష్యుల చేత ఘనుడిగా, పేరు కలిగి మన్ననలు పొందటమా?లేదు(లూకా 6:26)! దేవుడు ఏ స్థానాన్ని ఏర్పరచినా, నిజానికి అది నీకు తగినది కాదు అని అనిపించినా, ఆ స్థానాన్ని తీసుకోవడానికి సిద్ధపడటం! ఒకడు రాజు స్థానంలో ఉండి, దేవుని దృష్టిలో ఘనహీనుడిగా ఉండొచ్చు! ఒకడు సేవకుని స్థానంలో ఉండి దేవుని దృష్టిలో ఘనుడిగా ఉండొచ్చు!(హేరోదు, పిలాతు ముందు నేరస్థునిగా నిలబడిన క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి).
■ ఒక ఘనమైన స్థానాన్ని తీసుకునేటప్పుడు మనసులో ఎంతో ఆనందంగా ఉంటుంది కదా!ఐతే దేవుని బట్టి (అవమానకరమైన)తక్కువ స్థానాన్ని తీసుకుంటే దాని మెప్పు పరలోకంలో అధికంగా ఉంటుందని మరవొద్దు(మత్త 5:11,12). శిష్యులు హీనపర్చుకున్న 'కాళ్ళు కడగటం' లాంటి పనిని క్రీస్తు చేశాడు(నిజానికి ఆయనకది స్వల్పమైన విషయమే!ఎందుకంటే, అంత కంటే హీనమైన స్థానాన్ని తీసుకోవడానికి ఆయన అప్పటికే సిద్ధమైపోయ్యాడు). తగ్గింపు జీవితం అనే ఒక గొప్ప మాదిరి మన ముందు ఉంచాడు. 'ప్రభువా!ప్రభువా!' అని పెదవులతో పిలిచే వారు కాదు గాని, దేవుని చిత్తాన్ని గౌరవించి "నేను" అనే స్వభావాన్ని సిలువకు గొట్టి, "చిత్తం! నీ దాసుణ్ణి..చెప్పండి ప్రభూ!" అని పలుకగలిగే వారే నిజంగా దేవుని అధికారంలో ఉన్నట్లు!నీరు ఎగువ నుండి దిగువకు ప్రవహించినట్లుగా, దేవుని బట్టి తగ్గింపు జీవితాన్ని ఎంచుకున్న వారి మీద దేవుని కృప మరి హెచ్చుగా నిలిచివుంటుంది.ఆయన స్వభావాన్ని ఘనంగా ఎంచుకొని, దానిని ధరించుకోవాలి అని ఆరాటపడే ప్రతి ఒక్కరికి ఈ పాఠాలను నేర్పుతాడు(ఇప్పటికే చేరుకున్నామని ఎవ్వరం చెప్పకూడదు! ఇది జీవితకాలం కొనసాగించే పని).
౼యెరూషలేం వీధుల్లో ఆయన్ను ఘనపరచిన వారే, కొద్దీ రోజుల్లో అదే చోట అవమానిస్తారని క్రీస్తుకు తెల్సు! దేవుడు ఏది తన జీవితంలో ఏర్పాటు చేసినా, తన శరీరాన్ని అప్పగించుకోవడానికి సిద్ధపడ్డాడు (హెబ్రీ 10:5-7). మనం ఆయన వారం(సొత్తు). ఆయన చిత్తం మనలో నెరవేర్చడానికే ఆయన మనకు శరీరం అమర్చాడు. బలిపీఠంపై సజీవయాగంగా సమర్పించుకొనే జీవిత అనుభవంలోకి మనం రావాలి(హెబ్రీ 11:16). దీని అంతం దేవుని పవిత్ర జీవితం(పరిశుద్ధత).

Comments
Post a Comment