పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసిన వాళ్ళు, పరిశుద్దాత్మలో భాగం పంచుకున్న వాళ్ళు,
దేవుని శుభవాక్కునూ౼దైవ సందేశం యొక్క మంచితన్నాన్ని రుచి చూసిన వాళ్ళు,
రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచిన వాళ్ళు",
ఒకవేళ మార్గం విడిచి (పడిపోతే)తప్పిపోతే౼'వారిని తిరిగి మారుమనస్సు పొందేటట్లు(పశ్చాత్తాప పడేలా) చేయటం అసంభవం. ఎందుకంటే, వాళ్ళు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువవేసి చంపుతున్నారు. ఆయనను బహిరంగంగా అవమానపరుస్తున్నారు' (హెబ్రీ 6:4౼6).
"ఒకప్పుడు క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను, గనుక నేను శాశ్వితంగా రక్షణ పొందాను.." అనేది మనకు తెల్సిన,అనేక సార్లు మనం వింటున్న మాటలు. ఐతే సత్యనికి సరైన ప్రామాణికం౼ భక్తిపరుడైన భోధకుని మాటలో, ఇప్పటివరకు మనం నమ్మిన సిద్దాంతపు భోధో కాకూడదు కానీ దేవుని వాక్యము మాత్రమే ప్రామాణికం అవ్వాలి.
రక్షణ౼ మన క్రియలను బట్టి కాకుండా క్రీస్తు యేసుపై ఉంచిన విశ్వాసం మూలంగా, మారుమనస్సు ఫలితంగా దేవుడు అనుగ్రహించిన ఒక బహుమనం(కృప). ఇది అందరి రక్షణ నిమిత్తం దేవుడు బాహాటంగా ఉంచిన ఒక పిలుపు(మత్త 11:28). విశ్వసించిన వారు కేవలం ఆయన ఉచితమైన కృప చొప్పునే పొందుతారు. రక్షణకు మూలం "విశ్వాసం౼దేవుని కృప" (ఎఫెస్సి 2:8). ఒకణ్ని దేవుడు(ఆయన ఆత్మ ద్వారా) ఒప్పిస్తే తప్ప, 'యేసు వాని రక్షకుడు' అనే సత్యాన్ని ఒప్పుకోవడం అసాధ్యం (మత్త 16:17).
మరి దేవుడు పక్షపాతా?! కొందరు మాత్రమే ఆయన్ను అంగీకరిస్తున్నారు. అనేకులు తిరస్కరించి నశించిపోతున్నారు! వీరిని దేవుడు ఒప్పించట్లేదా!? దేవుడు పక్షపాతి కాదు. అందరూ, అంతటా మారుమనస్సు పొందాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు(2పేతు 3:9,1తిమో 2:4). సర్వలోకానికి సువార్తను పంపుతున్నాడు. దేవుని ఆత్మ ఒప్పించడంతో పాటు మానవుని స్వేచ్ఛ పూర్వకమైన నిర్ణయంతోనే విశ్వాసం కార్యరూపం దాల్చుతుంది. గుర్తుంచుకోండి! పక్షపాతం లేకుండా దేవుని కృప సిద్ధంగానే ఉంది, మానవుని తీర్మానమే వారి నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది.
౼అంటే 'దేవుని(క్రీస్తుని) గూర్చిన ప్రత్యక్షతకు "అవును" అని మనుష్యుని స్వేచ్చా నిర్ణయంతో ఏకీభవించడం',దేవుని రక్షణకు పాత్రులముగా చేస్తుంది.!
రక్షణ పొందిన తర్వాత, ఆ స్వేచ్ఛను ఇక దేవుడు ఆయన ఆధీనంలోకి తీసుకుంటాడా!లేదు..!ఆ స్వేచ్ఛలో నుండే ఆయన్ను వెంబడించడానికి తీర్మానం చేసుకోవాలి. కనుకనే ఒకరి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మరొకరి ఎదుగుదలకు తేడా ఉంటుంది. ఒకడు అనేక సం|| దేవునితో ఉండి క్రీస్తును పోలి నడవకపోవచ్చును,మరొకడు అతి కొద్ది దినాల్లో ఎంతో ఆధ్యాతిక పరిణతిలోకి, క్రీస్తు స్వరూప్యంలోకి మార్చపడ వచ్చును. దేవుణ్ని అనుభవ పూర్వకంగా తెల్సుకోవడానికి, ఆయనలో ఆనందించడానికి కావాల్సిన కృపను దేవుడు ఎల్లప్పుడూ వారికి చేరువలోనే ఉంచుతాడు(2కోరింధి 6:1, 1కోరింధి 15:10).
క్రైస్తవ లోకంలో నేను విన్న ఒక సిద్ధాంతం౼"రక్షణలో నీ క్రియలు లేనట్టే, రక్షించబడిన తర్వాత నీ క్రియలు అవసరం లేదు.దేవుడే నిలువబెట్టుకుంటాడు." అని చెప్పే వ్యర్ధ వాదన! ఈ క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మ నియమం క్రింద విశ్వాసి నడవాల్సిన హెచ్చరికలతో పౌలు/అపొస్తలుల పత్రికలు నిండివున్నాయి. విశ్వాసి ఇక (ఆధ్యాత్మిక)క్రీస్తు యోధుని వలె సిద్ధపడి ఉండాలని, కృపలో నిలిచి ఉండాలని బోధించారు (ఎఫెస్సి 6:13, హెబ్రీ 12:4, అకా 13:43). రక్షించబడిన విశ్వాసి, క్రీస్తులో నిలిచి ఉండాలని దేవుని వాక్యము బోధిస్తుంది. ఆ తీర్మానం మొదట విశ్వాసిదే అని గమనించండి(యోహా 15:4).ఇప్పటికీ విశ్వాసి తాను కోరుకున్నదే చేయగలిగిన స్వచ్ఛ కలిగి ఉన్నాడని మనకు తెల్సు కదా!నీవు కోరుకుంటేనే దేవునితో సమయం గడుపుతావు.నీవు తీసుకున్న నిర్ణయాలు నిరాటంకంగా చేసుకునే స్వేచ్ఛ నీకు ఉంది. దేవుడు దాన్ని తీసియేయ్యలేదు. ఐతే దేవుడు రక్షణ విషయంలో ఒక అవిశ్వాసి ఆయన్ను కలుసుకోవడానికి ఎంత కృపను అనుగ్రహిస్తాడో, విశ్వాసి ఎదుగుదలకు కూడా అవసరమైన కృపను/అవకాశాలను అనుగ్రహిస్తాడు.మానవుని దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన దేవుని లక్షణం "స్వేచ్ఛ". దానిని ఆయన ఎన్నడూ హరించడు.
మిగితా విషయాలు రేపటి ధ్యానంలో ఇంకా వివరంగా వ్రాస్తాను. వీటిని జ్ఞానం కోసం వ్రాయటం లేదు. దేవుని వాక్య వెలిగింపు నిమిత్తం మాత్రమే నా స్వహస్తాలతో వ్రాస్తున్నాను. దయచేసి రెఫర్స్ చదవండి. ౼Bro.Christopher
Comments
Post a Comment