Skip to main content

09Nov2017

❇ ఆకాశమా, ఆలకించు!భూమీ, విను! దేవుడు మాట్లాడు తున్నాడు౼
“నేను నా పిల్లలను పెంచి పోషించాను. వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దుకు తన యజమాని తెలుసు,
గాడిదకు యజమాని మేత పెట్టే స్థలం తెలుసు.
కానీ (ఇశ్రాయేలు) నా ప్రజలకు నేను తెలియదు. నా ప్రజలు గ్రహించరు.
అయ్యో! ఈ ప్రజలు దోషులు...!వారు దేవుణ్ణి వదలిపెట్టారు,
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుడ్ని) తిరస్కరించారు,
ఆయనను విడిచి తొలగిపోయారు"(యెషయా 1:2-4) ❇


■ దేవుని ఇంట్లో(సన్నిధిలో) ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఉంటుంది. ఆయన మనుష్యులను ప్రాణం లేని గ్రహాల్లాగా, నక్షత్రాల్లాగా, సముద్రాల్లాగా పుట్టించలేదు గాని ఆయన్ను స్వేచ్ఛగా కోరుకుంటూ, సేవించగలిగే వారిగా ఆయన స్వభావంలో పుట్టించాడు. దేవుడు సృష్టిని ఆరు దినాల్లో ముగించాడు. ప్రతి దినం సృష్టిని రూపొందిస్తున్నప్పుడు ఆయన మనస్సులో మానవుని గూర్చి ఆలోచిస్తున్నాడు. సృష్టినంతా వాని కోసమే నిర్మించాడు. ప్రేమగల తండ్రి తన బిడ్డల గురించి ముందుగానే ఆలోచిస్తూ, సిద్ధపర్చినట్లుగా..ప్రతి చిన్న విషయం గురించి ఆలోచించాడు. ఆహారానికి రకరకాల పండ్లను, కూరగాయలను, ధాన్యాలను ఇచ్చాడు. ఈ అందమైన ప్రకృతిలో వానికి ఏ కొదువా ఆయన చెయ్యలేదు. ఆరవ రోజున మనిషిని చేసేటప్పుడు ప్రతి అవయవానికి ఒక పనిని నియమించి, నాశికలో ప్రాణాత్మలను ఊదాడు. స్త్రీ, పురుషులుగా నిర్మించాడు. సృష్టిని ఏలుమని దీవించాడు. ప్రతి మనిషి ఆయనకు ప్రత్యేకమైన వాడే! (ఇప్పటికీ)ఆయన ఎల్లప్పుడూ మనల్ని గురించే ఆలోచిస్తున్నాడు. మనిషి దేవుని స్వభావంలో నిర్మించబడ్డాడు గనుక వాని పరిపూర్ణమైన ఆనందం దేవుని లోనే ఉన్నది. ఆయనకు వెలుపల ఉన్నదంతా మోసపుచ్చే పాపపు ఆనందం,మనల్ని నాశనానికి నడిపే మార్గం.

■ దేవుడు పరిశుద్ధుడు!! ఒకప్పుడు ఆయన సన్నిధిలో, ఆయనే నియమించిన ప్రకాశవంతమైన ప్రధానదూత(సైతాను), దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆయన నిలిపిన ఆ స్థానం నుండి ఆయనే త్రోసివేశాడు. దేవునితో అత్యంత సన్నిహిత్యంలో ఉండటానికి నియమించబడిన వాడు, దేవుణ్ని విడిచి శాశ్వితంగా నిత్యనాశనానికి వెళ్లబోతున్నాడు. ఏదెను తోటలో దేవుడే మనవుణ్ణి అందులో ఉంచాడు, సేద్యపరచే బాధ్యతనిచ్చాడు. దేవుని మాటనుండి వైదొలగి జీవిచడానికి తీర్మానించుకున్నప్పుడు(ఒకే ఒక్క తీర్మానం), శాశ్వతంగా ఆ ప్రదేశం నుండి దేవుడే తోలివేశాడు.ప్రేమగల దేవుడు ఆయన పరిశుద్ధతకు, ఆయన న్యాయానికి వేరుగా ఆయన ప్రవర్తించడు. వారు కోరుకున్నది వారికి ఇవ్వబడుతుంది. దేవుని మాటకు విరోధంగా పోరాడి వారి నాశనాన్ని వారు కోరుకున్నప్పుడు, ప్రేమగల తండ్రిగా ఆ స్వేచ్ఛను గౌరవిస్తూనే, న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో దేవునికి వేరుగా ఉన్నది, దేవుని నుండి ఒకరోజు శాశ్వితంగా వెరైపోతుంది. కానీ అలా జరుగుతునప్పుడు సర్వశక్తుడు ఆవేదన చెందుతాడు..

■ తప్పిపోయిన కుమారుని కథలో తండ్రి నుండి వేరై ఉండగోరిన చిన్న కుమారుని స్వేచ్ఛను గౌరవించి, ఆస్తిని పంచి ఇచ్చినట్లుగా నేడు మానవుని స్వేచ్ఛను దేవుడు గౌరవిస్తు న్నాడు. ఆ స్వేచ్ఛలో నుండే తిరిగి వస్తే, ఏ మాత్రం ప్రశ్నించక వెంటనే అక్కున చేర్చుకుంటాడు. దేవుడిచ్చిన ప్రతి వనరులను మానవుడు వాడుకుంటున్నాడు కానీ 'ఆ దేవుడు మాకు అవసరం లేదని' ఆయనకు దుఃఖాన్ని రేపుతున్నారు. చెడు మార్గం పట్టి, నాశనానికి సిద్ధంగా ఉన్న మానవాళిని చూసి దుఃఖంతో తండ్రియైన దేవుడు పడ్తున్న ఆవేదనను లేఖనాలు చూపిస్తున్నాయి. కనుకనే క్రీస్తును ఈ లోకానికి రక్షకునిగా పంపి ఆయనలో విమోచన(రక్షణ)ను సిద్ధం చేశాడు. మన దోషాలు ఆయనపై మోపాడు,మన నిత్యశిక్షను ఆయన భరించాడు. ఎవరైతే క్రీస్తులో విశ్వాసముంచి పాప క్షమాపణ పొంది, మారుమనస్సు పొందుతారో, క్రీస్తు కృపలో నిలిచి వుంటారో..అంత్యదినాన దేవుడు వారిని కాపాడుకుంటాడు..

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...