Skip to main content

02Nov2017

❇ఒకసారి యేసు వెళ్తుంటే క్రిక్కిరిసిన జనసమూహం ఆయన మీద పడుతున్నారు. అప్పుడు 12 సం|| నుండి రక్తస్రావంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్న డబ్బంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు. ఆమె విశ్వాసంతో యేసు వెనగ్గా వచ్చి ఆయన పైబట్ట అంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.

వెంటనే యేసు౼"నన్ను తాకిందెవరు?" అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు "మాకు తెలియదే" అన్నారు. 
అప్పుడు పేతురు౼"ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ మీద పడుతున్నారు" అన్నాడు.
యేసు౼"ఎవరో నన్ను తాకారు. నాలోనుండి ప్రభావం బయటకు వెళ్లిందని నాకు తెలిసింది" అన్నాడు. 

ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్ధమైంది.ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకుందో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలకి వివరించి చెప్పింది. అందుకు ఆయన౼"కుమారీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు" అన్నాడు. ❇

■ బహిరంగంగా చెప్పుకోలేని రోగంతో౼శారీరకంగా, ఆర్ధికంగా మానసికంగా ఆ స్త్రీ కృంగిపోయివుంది. ఇక బాగవుతానన్న నిరీక్షణ లేనప్పుడు, యేసు గూర్చి విని విశ్వాసంతో ఆయనను దగ్గరకు వచ్చింది(దేవుని గూర్చి వినడం ద్వారా దేవునిపై విశ్వాసం పుడుతుంది). బలహీనమైన ఆ స్త్రీ క్రిక్కిరిసిన జనసమూహం మధ్యలోకి వెళ్లి ఆయన్ను తాకటాన్ని బట్టి౼ యేసుపై ఆమెకు గల దృఢమైన విశ్వాసాన్ని, బాగవ్వడం కోసం ఆమె పడిన తాపత్రయాన్ని తెలియజేస్తుంది. గొప్ప జనసమూహం ఆయనపై పడుతూ ఉన్నప్పటికీ విశ్వాసంతో తాకిన ఆమెను మాత్రమే దేవుని శక్తి తాకింది. దేవుడు ఎన్నటెన్నటికీ శక్తిమంతుడే! కానీ విశ్వాసం అనే plug ను అనుసంధానం చేసినప్పుడే ఆ ప్రభావం flow అవుతుంది. నిజమైన విశ్వాసం-"దానికి తగిన పనులు చేయడం ద్వారానే రుజువు చేయ బడుతుంది". అలా నిజమైన విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చే వారే(విశ్వాసులే), దేవుని శక్తిని-ప్రభావాన్ని వారి జీవితంలో తెల్సుకోగలరు.ఆయన ఎలాంటి వాడో అనుభవాల ద్వారా తెల్సుకున్న ప్రజలు ధన్య జీవులు!

■ ఆ స్త్రీ గురించి క్రీస్తుకు ముందే తెలుసా?అవును.. ముందుగానే తెలుసు! తల్లిదండ్రులకు, భార్యకు, స్నేహితులకు, ఇలా ఎవరికీ పంచుకోలేని విషయాలు దేవునితో పంచుకోవచ్చని నీకు తెలుసా? దేవుడు కూడా అలాంటి స్నేహాన్ని మనుష్యులతో చేయడానికి ఇష్టపడతాడు. నిజానికి ఆయన మనుష్యులను సృష్టించిన ఉద్దేశ్యం అదే! ఎవ్వరికి చెప్పుకోలేని పాపంతో, బలహీనతలతో, సమస్యలతో దిగులుపడుతున్నావా?'ఇలాంటివి దేవునితో చెప్పొచ్చా?'అని సందేహం పెట్టుకోకుండా ప్రతి విషయం ఆయనతో చెప్పొచ్చు!
నిన్ను అర్ధం చేసుకోవడమే కాదు, దాన్నుండి విడిపించ గల సమర్థుడు!..దేవుడు! ఐతే నువ్వు ఆయన మాటను వినటానికి తీర్మానం చేసుకోవాలి.అప్పుడు మాత్రమే ఆయన నీ జీవితంలో కలుగుజేసుకోగలడు.

౼ఆమె silent గా వచ్చి silent గా వెళ్లాలనుకుంది.కానీ దేవుడు  ఆ గొప్ప విశ్వాసాన్ని అందరి ముందు కనబరచాలని ఆశిస్తాడు.
చీకట్లో క్రొవొత్తిని వెలిగించిన తర్వాత, దాన్ని cupboardలో పెట్టి ఎవ్వరూ తాళం వేయ్యారు కదా!అంతటికీ వెలిగివ్వడానికి ఎత్తైన place లో ఉంచినట్లే, విశ్వాసం కూడా బహిరంగంగా కనబరచాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది...

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...