Skip to main content

Posts

02Aug2017

  యేసు౼"ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణేలు ఉన్నాయనుకోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి, యిల్లంతా ఊడ్చి అది దొరికే దాకా జాగ్రత్తగా వెతకదా? దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి పోగొట్టుకున్న నా నాణెం దొరికింది. మనమంతా ఆనందించుదాం! అని అంటుంది. అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి పరలోకంలో దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెప్తున్నాను"  ❇ ✔  ఆ స్త్రీ మిగిలిన 9 నాణేలు బట్టి ఉరుకోక, కోల్పోయిన ఆ ఒక్క నాణెం కోసం దీపం వెలిగించి, యిల్ లంతా ఊడ్చి ఎంతో శ్రద్ధగా వెతికింది. క్రీస్తు చెప్తున్నాడు..ఇవ్వరైతే దేవుని నుండి దూరమైపోతూ పాపంలో జీవిస్తుంటారో, వారిని నీతి మార్గంలోకి తీసుకురావటం కోసం దేవుడు కూడా అలాగే శ్రద్ధగా వెతుకుతాడు. పాపం చేసిన వారి పట్ల పరలోక తండ్రి మనస్సును క్రీస్తు తెలియజేస్తున్నాడు. ✔  తోటి వారి ప్రవర్తనతో తమను తాము పోల్చుకొని 'నీతి' గా ఉన్నామని సంతోషపడే వారి కంటే అధికంగా, యదార్థంగా తమ తప్పును ఒప్పుకుని, ప్రవర్తన మార్చుకోవాలని ఆశించే వారిపై దేవుని శ్రద్ధ అధికంగా ఉంటుంది. పాపాన్ని యదార్ధంగా ఒప్పుకోలేని వా...

01Aug2017

  సువార్త నిమిత్తం ఖైదీగా ఉన్న పౌలు తన వాదనను కైసరు చక్రవర్తి ముందు చెప్పుకొంటానని కోరాడు. కాబట్టి పౌలుతో పాటు మరికొందరు ఖైదీలను తీసుకొని శతాధిపతి ఓడలో ఇటలీకి ప్రయణమయ్యాడు. కానీ గొప్ప తుఫాను వల్ల ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఓడ కొట్టుకొని పోయి 'మెలితే' అనే ఒక ద్వీపం దగ్గరకు వచ్చింది. అనాగరికులైన ద్వీపవాసులు వారికి ఎంతో సహాయపడ్డారు. వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టారు. అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని  చెయ్యి పట్టుకుంది. ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకొని వేలాడటం చూసి, 'ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకొన్నప్పటికీ న్యాయం మాత్రం అతణ్ణి బతకనియ్యద'ని తమలో తాము చెప్పుకొన్నారు. కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు. వారైతే అతని శరీరం వాచి పోవడమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకొని, 'ఇతడొక దేవుడు' అని చెప్పసాగారు . 🔹 (అ...

28 July 2017

యేసు ఒక కథ చెప్పాడు. ❇  ఒక ధనవంతుడి భూమి విస్తారంగా పండింది. అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు. "నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను. నా కొట్లు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ దాచి నిల్వ చేస్తాను. అప్పుడు నా ప్రాణంతో "ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపోయే విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు అని చెప్తాను" అనుకున్నాడు. అయితే దేవుడు అతడితో "మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?" అని అతడితో అన్నాడు. దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు" ❇ ✔  ధనవంతుడు అక్రమంగా సంపాదించాడని చెప్పబడలేదు. సంవత్సర సంవత్సరానికి అతను ఎంతో కష్టపడి సంపాదించివుంటాడు. మెరుగైన పంట పండటానికి రాత్రింబవళ్లు శ్రమించివుంటాడు. అతని మూలంగా అనేకులకు (పంటవేసేవారికి, కోసే వారికి, కూలీలకు, కొట్లు కట్టేవారికి) పని దొరికుతావుంది. అలాంటప్పుడు అతని కష్టార్జీతం అతను తినటానికి యోగ్యుడే కదా? మరి దేవుడేందుకు అ...

27 July 2017

దేవుడు ఇశ్రాయేలీయులతో౼"ఇదిగో వినండి! నేను కానాను దేశాన్ని మీకు అప్పగించాను. మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధినం చేనుకోండి. మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ వారి తరువాత వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి!" (ద్వితియో  1:8) --కనాను దేశాన్ని అబ్రాహాముకు, అతని సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు(ఆది 13:12-17).ఇక కనాను వారి సొత్తు. ఇప్పుడు సుమారు 400 సం|| తర్వాత ఐగుప్తు భానిసత్వ సంకెళ్ళను తెంచుకుని ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమైన కనానుక ు ప్రయణమయ్యారు. పైన చెప్పిన మాటలు అప్పుడు దేవుడు వారితో పలికిన మాటలు.ఐతే కనానులో నివసిస్తున్న ప్రజలు బలవంతులు, గొప్ప దేహదారుడ్యం గల వారు(సంఖ్యా 13:28,31). --దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకొనే నిమిత్తం భానిసత్వపు సంకెళ్ళు తెంచబడ్డాయి. ఆ ప్రదేశాన్ని బలమైన శత్రువుచే ఆక్రమించబడివుంది.ఆయన వాగ్దానం నిలచి ఉంది. ఇక ఇప్పుడు మిగిలివుంది విశ్వాసంతో స్వాధీన పర్చుకోవటమే! ఇశ్రాయేలు ముందు ఉంచబడిన సవాలు౼'విశ్వాసం'. కానీ వారిలో చాలా మంది దేవుణ్ని నమ్మలేకపోయ్యారు. వారిలో నమ్మిన వారు మ...

26 July 2017

  దేవుని మాట ప్రకారం ఎలీషా నయమాను యొక్క కుష్ఠురోగాన్ని బాగుచేశాడు. కృతజ్ఞతతో నయమాను కానుకలను ఇవ్వగా, దైవజనుడైన ఎలీషా వాటిని తిరస్కరించాడు. ఎలీషా దగ్గర గేహజీ అనే శిష్యుడొకడు ఉన్నాడు. గేహజీ౼“గురువు గారు నయమాను తెచ్చిన వాటిని తీసుకోకుండా అతణ్ణి ఊరికే వెళ్ళనిచ్చాడు. యెహోవా జీవము తోడు, నేను అతడివెంట పరుగెత్తి అతడి నుంచి ఏదైనా తీసుకుంటాను" అనుకొని వెళ్ళి, నయమానుకు ఎలీషా తీసుకురమ్మానాడని అబద్ధమాడి, రెండు జతల విలువైన దుస్తులనూ, డెబ్భై కిలోగ్రాముల వెండి రెండు సంచుల నిండా తీసుకొని వచ్చి  దాచి, ఏమీ తెలియనట్లు ఎలీషా ముందుకు తిరిగి వచ్చాడు. ఎలీషా౼“గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?" గేహజీ౼“నీ దాసుడైన నేను ఎక్కడికీ వెళ్ళలేదు" ఎలీషా౼"నయమాను నిన్ను కలుసుకోవడానికి రథం దిగినప్పుడు, నా హృదయం నీతో వున్నది. వెండి, దుస్తులు, ఒలీవచెట్ల తోటలు, ద్రాక్షతోటలు, గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇప్పుడు నయమానుకు ఉన్న కుష్ఠు నీకూ, నీ సంతానానికీ సోకుతుంది" అన్నాడు. మంచులాగా తెల్లటి కుష్ఠు పుట్టి గేహజీ ఎలీషా ముందు నుంచి బయటికి వెళ్ళాడు .  ❇ -- నిజానికి దేవుడు గేహజీ ...

25 July 2017

  యేసు, ఆయన శిష్యులు గలలీకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు. ఆయన ఒడ్డున దిగగానే దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా, సమాధుల్లో తిరుగాడే ఆ ఊరి వాడొకడు ఆయన్ని ఎదురుగా వచ్చాడు.. ఆయన "ఈ వ్యక్తిని వదిలి బయటకు రా" అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు..."పాతాళంలోకి వెళ్ళమని తమకు ఆజ్ఞ ఇవ్వవద్దని" దెయ్యాలు ఆయనను ఎంతో బతిమాలాయి.పందుల మందలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు. వెంటనే ఆ మంద ఎత్తైన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి  సరస్సులో పడి ఊపిరి ఆడక చచ్చాయి. ఆ పందుల్ని మేపుతున్న వారు వెళ్ళి, పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు.ఆ ఊరి ప్రజలు యేసు దగ్గరకు వచ్చి, అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండటం చూసి భయపడి, తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు. ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్లబోతుంటే దయ్యాలు విడిచిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు. కానీ ఆయన "నువ్వు నీ ఇంటికి వెళ్లి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు" అన...

22 July 2017

పరిశుద్ధాత్మ-"ఆనాడు ఎడారిలో మూర్ఖులైన మీ పూర్వీకులు నాకు కోపం రేపి ఎదురు తిరిగారు. నా సహనాన్ని పరీక్షించారు. కాని నేడు మీరాయన మాటలు వినబడుతున్నప్పుడు మీ హృదయాలు కఠిన చేసుకోకండి. నేను 40 సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా మీ పూర్వీకులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు. కనుక నేను ఆ తరంవారిమీద కోపపడి, ౼ 'వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాల్లో సత్యానికి దూరంగా ఉంటున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు. వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు' అని ప్రమాణం చేశాను" ✔  "సోదరులారా(విశ్వాసులారా), జీవం గల దేవుని నుండి తొలగిపోయే, విశ్వాసంలేని చెడ్డ హృదయం హృదయం మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. ఆ ‘నేడు’ అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. 'మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం! (పాలివారమైఉంటాము)' ✔  దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేసిందెవరు? ఐగుప్తులో నుండి మోషే బయటకు నడిపించిన వారందరే కదా! దేవుడు 40 ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి...

21 July 2017

 ఎలీషా ప్రవక్త మరణించగా, ప్రజలు అతనిని సమాధిలో ఉంచారు. ఒక సంవత్సరమైన తరువాత మోయాబీయుల సైన్యము ఇశ్రాయేలు దేశము మీదికి వచ్చినప్పుడు..కొంతమంది ఒక శవాన్ని పాతిపెడుతూ సైన్యమునికి భయపడి, ఆ శవాన్ని ఎలీషా యొక్క సమాధిలో ఉంచారు. ఎలీషా ఎముకలను ఆ చనిపోయిన వ్యక్తి తాకగానే, ఆ వ్యక్తి సజీవుడయ్యాడు(2రాజులు 13: 20,21)   ❇ దేవుడు ఎలీషా ద్వారా చాలా అద్భుతాలు జరిగించాడు.కాని ఎలీషా రోగగ్రస్తుడై చనిపోయ్యాడు. ఎలీషా రోగం వల్ల చనిపోయ్యేట్లు దేవుడే అనుమతించాడు. దేవుడు ఆయనకు నమ్మకమైన వారి జీవితంలో పంపే  భాధలన్ని "శిక్షలు" కావు. చాలా సార్లు నమ్మకత్వానికి పరీక్షలుగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎలీషా గ్రహించాడు, కనుకనే దేవుని పట్ల విముఖత చూపలేదు. పైగా ఆయన చిత్తాన్ని గౌరవించాడు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం కోసం దేవుడు ఎలీషా ఎముకల్ని సైతం వాడుకోనడం ద్వారా, ఎలీషా తనకు నమ్మకమైన సేవకుడని దేవుడు ఆమోదించాడు. ౼ సంతానంలేని అబ్రాహాము, రాజైన అబీమెలేకు ఇంటివారి కొరకు ప్రార్ధించగా, దేవుడు తిరిగి గర్భ ఫలాన్ని ఇచ్చాడు.(ఆది 20:17,18) ౼ అనేక శ్రమల పాలైన యోబు ప్రార్ధించగా, దేవుడు అతని స్నేహితులను శిక్షిం...

19 July 2017

  ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చి, అక్కడ సమాధి పైన ఉంచిన రాయి తీసి ఉండటం చూసింది..మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది. ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వాళ్ళు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు. దేవదూతలు-"అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" మరియ-"ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు" ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండటం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్ట లేదు. యేసు-"అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవర్ని వెదకుతూ ఉన్నావు?". ఆమె ఆయన్ను తోటమాలి అనుకుని- "అయ్యా! ఒకవేళ నువ్వు ఆయన్ను తీసుకు వెళ్తే, ఆయన్ను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ను మోసుకొని వెళ్తాను" అప్పుడు యేసు- "మరియా" అని పిలిచాడు.   ❇ ✔  పునరుద్దాన దినం రోజు ఆయన తల్లియైన మరియ గూర్చిన ప్రస్తావన లేదు, కాని 4 సువార్తల్లో మగ్దలేనే మరియ(7దయ్యాలు పట్టి, యేసుచేత బాగుచేయ్యబడ్డ స్త్రీ) గూర్చి వ్రా...

15 Feb 2017

"We know that God works all things together for good for the ones who love God, for those who are called according to his purpose" రోమీయులకు 8: 28 "దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" Whatever happened now, TRUST that GOD will turn it to your Good.You are in his SAFE HANDS.He LOVES you.