Skip to main content

Posts

Showing posts from July, 2017

28 July 2017

యేసు ఒక కథ చెప్పాడు. ❇  ఒక ధనవంతుడి భూమి విస్తారంగా పండింది. అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు. "నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను. నా కొట్లు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ దాచి నిల్వ చేస్తాను. అప్పుడు నా ప్రాణంతో "ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపోయే విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు అని చెప్తాను" అనుకున్నాడు. అయితే దేవుడు అతడితో "మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?" అని అతడితో అన్నాడు. దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు" ❇ ✔  ధనవంతుడు అక్రమంగా సంపాదించాడని చెప్పబడలేదు. సంవత్సర సంవత్సరానికి అతను ఎంతో కష్టపడి సంపాదించివుంటాడు. మెరుగైన పంట పండటానికి రాత్రింబవళ్లు శ్రమించివుంటాడు. అతని మూలంగా అనేకులకు (పంటవేసేవారికి, కోసే వారికి, కూలీలకు, కొట్లు కట్టేవారికి) పని దొరికుతావుంది. అలాంటప్పుడు అతని కష్టార్జీతం అతను తినటానికి యోగ్యుడే కదా? మరి దేవుడేందుకు అ...

27 July 2017

దేవుడు ఇశ్రాయేలీయులతో౼"ఇదిగో వినండి! నేను కానాను దేశాన్ని మీకు అప్పగించాను. మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధినం చేనుకోండి. మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ వారి తరువాత వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి!" (ద్వితియో  1:8) --కనాను దేశాన్ని అబ్రాహాముకు, అతని సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు(ఆది 13:12-17).ఇక కనాను వారి సొత్తు. ఇప్పుడు సుమారు 400 సం|| తర్వాత ఐగుప్తు భానిసత్వ సంకెళ్ళను తెంచుకుని ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమైన కనానుక ు ప్రయణమయ్యారు. పైన చెప్పిన మాటలు అప్పుడు దేవుడు వారితో పలికిన మాటలు.ఐతే కనానులో నివసిస్తున్న ప్రజలు బలవంతులు, గొప్ప దేహదారుడ్యం గల వారు(సంఖ్యా 13:28,31). --దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకొనే నిమిత్తం భానిసత్వపు సంకెళ్ళు తెంచబడ్డాయి. ఆ ప్రదేశాన్ని బలమైన శత్రువుచే ఆక్రమించబడివుంది.ఆయన వాగ్దానం నిలచి ఉంది. ఇక ఇప్పుడు మిగిలివుంది విశ్వాసంతో స్వాధీన పర్చుకోవటమే! ఇశ్రాయేలు ముందు ఉంచబడిన సవాలు౼'విశ్వాసం'. కానీ వారిలో చాలా మంది దేవుణ్ని నమ్మలేకపోయ్యారు. వారిలో నమ్మిన వారు మ...

26 July 2017

  దేవుని మాట ప్రకారం ఎలీషా నయమాను యొక్క కుష్ఠురోగాన్ని బాగుచేశాడు. కృతజ్ఞతతో నయమాను కానుకలను ఇవ్వగా, దైవజనుడైన ఎలీషా వాటిని తిరస్కరించాడు. ఎలీషా దగ్గర గేహజీ అనే శిష్యుడొకడు ఉన్నాడు. గేహజీ౼“గురువు గారు నయమాను తెచ్చిన వాటిని తీసుకోకుండా అతణ్ణి ఊరికే వెళ్ళనిచ్చాడు. యెహోవా జీవము తోడు, నేను అతడివెంట పరుగెత్తి అతడి నుంచి ఏదైనా తీసుకుంటాను" అనుకొని వెళ్ళి, నయమానుకు ఎలీషా తీసుకురమ్మానాడని అబద్ధమాడి, రెండు జతల విలువైన దుస్తులనూ, డెబ్భై కిలోగ్రాముల వెండి రెండు సంచుల నిండా తీసుకొని వచ్చి  దాచి, ఏమీ తెలియనట్లు ఎలీషా ముందుకు తిరిగి వచ్చాడు. ఎలీషా౼“గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?" గేహజీ౼“నీ దాసుడైన నేను ఎక్కడికీ వెళ్ళలేదు" ఎలీషా౼"నయమాను నిన్ను కలుసుకోవడానికి రథం దిగినప్పుడు, నా హృదయం నీతో వున్నది. వెండి, దుస్తులు, ఒలీవచెట్ల తోటలు, ద్రాక్షతోటలు, గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇప్పుడు నయమానుకు ఉన్న కుష్ఠు నీకూ, నీ సంతానానికీ సోకుతుంది" అన్నాడు. మంచులాగా తెల్లటి కుష్ఠు పుట్టి గేహజీ ఎలీషా ముందు నుంచి బయటికి వెళ్ళాడు .  ❇ -- నిజానికి దేవుడు గేహజీ ...

25 July 2017

  యేసు, ఆయన శిష్యులు గలలీకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు. ఆయన ఒడ్డున దిగగానే దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా, సమాధుల్లో తిరుగాడే ఆ ఊరి వాడొకడు ఆయన్ని ఎదురుగా వచ్చాడు.. ఆయన "ఈ వ్యక్తిని వదిలి బయటకు రా" అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు..."పాతాళంలోకి వెళ్ళమని తమకు ఆజ్ఞ ఇవ్వవద్దని" దెయ్యాలు ఆయనను ఎంతో బతిమాలాయి.పందుల మందలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు. వెంటనే ఆ మంద ఎత్తైన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి  సరస్సులో పడి ఊపిరి ఆడక చచ్చాయి. ఆ పందుల్ని మేపుతున్న వారు వెళ్ళి, పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు.ఆ ఊరి ప్రజలు యేసు దగ్గరకు వచ్చి, అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండటం చూసి భయపడి, తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు. ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్లబోతుంటే దయ్యాలు విడిచిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు. కానీ ఆయన "నువ్వు నీ ఇంటికి వెళ్లి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు" అన...

22 July 2017

పరిశుద్ధాత్మ-"ఆనాడు ఎడారిలో మూర్ఖులైన మీ పూర్వీకులు నాకు కోపం రేపి ఎదురు తిరిగారు. నా సహనాన్ని పరీక్షించారు. కాని నేడు మీరాయన మాటలు వినబడుతున్నప్పుడు మీ హృదయాలు కఠిన చేసుకోకండి. నేను 40 సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా మీ పూర్వీకులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు. కనుక నేను ఆ తరంవారిమీద కోపపడి, ౼ 'వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాల్లో సత్యానికి దూరంగా ఉంటున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు. వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు' అని ప్రమాణం చేశాను" ✔  "సోదరులారా(విశ్వాసులారా), జీవం గల దేవుని నుండి తొలగిపోయే, విశ్వాసంలేని చెడ్డ హృదయం హృదయం మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. ఆ ‘నేడు’ అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. 'మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం! (పాలివారమైఉంటాము)' ✔  దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేసిందెవరు? ఐగుప్తులో నుండి మోషే బయటకు నడిపించిన వారందరే కదా! దేవుడు 40 ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి...

21 July 2017

 ఎలీషా ప్రవక్త మరణించగా, ప్రజలు అతనిని సమాధిలో ఉంచారు. ఒక సంవత్సరమైన తరువాత మోయాబీయుల సైన్యము ఇశ్రాయేలు దేశము మీదికి వచ్చినప్పుడు..కొంతమంది ఒక శవాన్ని పాతిపెడుతూ సైన్యమునికి భయపడి, ఆ శవాన్ని ఎలీషా యొక్క సమాధిలో ఉంచారు. ఎలీషా ఎముకలను ఆ చనిపోయిన వ్యక్తి తాకగానే, ఆ వ్యక్తి సజీవుడయ్యాడు(2రాజులు 13: 20,21)   ❇ దేవుడు ఎలీషా ద్వారా చాలా అద్భుతాలు జరిగించాడు.కాని ఎలీషా రోగగ్రస్తుడై చనిపోయ్యాడు. ఎలీషా రోగం వల్ల చనిపోయ్యేట్లు దేవుడే అనుమతించాడు. దేవుడు ఆయనకు నమ్మకమైన వారి జీవితంలో పంపే  భాధలన్ని "శిక్షలు" కావు. చాలా సార్లు నమ్మకత్వానికి పరీక్షలుగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎలీషా గ్రహించాడు, కనుకనే దేవుని పట్ల విముఖత చూపలేదు. పైగా ఆయన చిత్తాన్ని గౌరవించాడు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం కోసం దేవుడు ఎలీషా ఎముకల్ని సైతం వాడుకోనడం ద్వారా, ఎలీషా తనకు నమ్మకమైన సేవకుడని దేవుడు ఆమోదించాడు. ౼ సంతానంలేని అబ్రాహాము, రాజైన అబీమెలేకు ఇంటివారి కొరకు ప్రార్ధించగా, దేవుడు తిరిగి గర్భ ఫలాన్ని ఇచ్చాడు.(ఆది 20:17,18) ౼ అనేక శ్రమల పాలైన యోబు ప్రార్ధించగా, దేవుడు అతని స్నేహితులను శిక్షిం...

19 July 2017

  ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చి, అక్కడ సమాధి పైన ఉంచిన రాయి తీసి ఉండటం చూసింది..మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది. ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వాళ్ళు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు. దేవదూతలు-"అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" మరియ-"ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు" ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండటం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్ట లేదు. యేసు-"అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవర్ని వెదకుతూ ఉన్నావు?". ఆమె ఆయన్ను తోటమాలి అనుకుని- "అయ్యా! ఒకవేళ నువ్వు ఆయన్ను తీసుకు వెళ్తే, ఆయన్ను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ను మోసుకొని వెళ్తాను" అప్పుడు యేసు- "మరియా" అని పిలిచాడు.   ❇ ✔  పునరుద్దాన దినం రోజు ఆయన తల్లియైన మరియ గూర్చిన ప్రస్తావన లేదు, కాని 4 సువార్తల్లో మగ్దలేనే మరియ(7దయ్యాలు పట్టి, యేసుచేత బాగుచేయ్యబడ్డ స్త్రీ) గూర్చి వ్రా...

15 Feb 2017

"We know that God works all things together for good for the ones who love God, for those who are called according to his purpose" రోమీయులకు 8: 28 "దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" Whatever happened now, TRUST that GOD will turn it to your Good.You are in his SAFE HANDS.He LOVES you.

19 Feb 2017

When we’re suffering, grieving, dealing with persecution or injustice, we can have confidence in these two truths:  1. God knows us intimately(closely).  2. God cares for us deeply.  Jesus--"రెండు పిచ్చుకలు పది పైసలకు అమ్ముడు పోతాయి గదా. అయినా వాటిలో ఒక్కటి కూడా మీ పరమ తండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. మీ తల వెంట్రుకలు ఎన్నో లెక్క ఉంది. అందుచేత నిర్భయంగా ఉండండి. అనేక పిచ్చుకలకంటే మీ విలువ ఎక్కువ" Matt10:29-31 Peter--"ఆయన మీ విషయం పట్టించుకొంటున్నాడు.గనుక మీ చింత యావత్తూ ఆయనమీద వేయండి". 1 Peter 5:7 *** He Loves you ***

21 Feb 2017

Who will experience(take part) amazing things from God..? The one Who take stand for Him.. Even though they may fall, God will raise(renewed) them by His great strength. Here the question is, are you willing to bear trails, shame and cross to be His witnesses? Ps 145:14

22 Feb 2017

A lesson from David's life: If God made you a Shepherd boy..under GOD, be faithful to the flock. 1 Sam 17:36 If God made you a Soldier..under GOD, be faithful to your king. 1 Sam 22:14 If God made you a King..under GOD, be faithful to your kingdom. 1 Chron 21:17 But don't grudge or blame the people who suppress you. Above all recognize and respect your beloved GOD's SOVEREIGNTY.

15 March 2017

Don't delight in the resources(which made you more accountable), you won't get anything from the LORD, unless you surrender yourself to (the Truth)HIM.

20 March 2017

Bible - “దేవుడు ఈ లోకాన్ని (నిన్ను) ఎంతో ప్రేమించి, తన ఒకే ఒక కుమారుణ్ణి (యేసు క్రీస్తును)ఇచ్చాడు. యేసు క్రీస్తు మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే, నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని దేవుని ఉద్దేశం." ఎందుకనగా, "యేసు తానే, తన శరీరంలో మన పాపాలు మ్రాను మీద భరించాడు" యోహాను 3: 16, 1పేతురు 2: 24

22 March 2017

హెబ్రీ 9: 14 "క్రీస్తు యొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును" అపో 20: 28 “దేవుడు తన సొంత రక్తమిచ్చి సంపాదించుకొన్న ఆయన సంఘానికి మీరు కాపరులుగా ఉండాలని పరిశుద్ధాత్మ మిమ్మల్ని నాయకులుగా చేశాడు. అందువల్ల మిమ్మల్ని గురించీ, మంద అంతటిని గురించీ జాగ్రత్తగా ఉండండి"

23 March 2017

Do you know GOD much interested to INVOLVE in your life? How much WORST it is, as of now. When He came into your life, you will enter into the FULLNESS of life. Because GOD is your CREATOR. He knew EVERYTHING about His creation(YOU). Try Him today with good motive. Then you will experience it's TRUE.

24 March 2017

"సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు.ఆయన కంటికి సమస్తమును మరుగులేక తేటగా కనిపిస్తుంది.అలాంటి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి" హెబ్రీయులకు 4: 13 Don't pretend as sinless. But ACCEPT your SIN, ask GOD for His HELP to come out from your sinful life. You will receive God's favour. GOD Himself, hurry to fellowship you.

27 March 2017

After watched "Passion Of Christ" movie, how many people scolded​ & hated Jesus? Might be NO ONE. We thought that cruel generation hated and crucified Him. Is this generation good than that generation. Simply 'NO'. Even worst. Then what is the truth? Jesus-"No prophet is accepted (welcomed among his own people)in his own country" Luke 4:24. యేసు-"మీతో ఖచ్చితంగా చెప్పుచున్నాను – ఏ ప్రవక్తనూ తన స్వస్థలం స్వీకరించదు". In this worst generation who hate and cause to suffer godly men, are the sons and daughters of that generation who crucified Christ. No more lesser.   Godly and ungodly will exist every generation. Which side are you?

28 March 2017

"For you know the GRACE of our Lord JESUS CHRIST, who for your sake became POOR, when He was RICH, so that you might become RICH by His POVERTY" 2 Corinthians 8:9 "మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తెలుసు గదా. ఆయన ధనవంతుడై ఉన్నా మీ కోసం దరిద్రుడు అయ్యాడు. ఆయన దరిద్రం వల్ల మీరు ధనవంతులు కావాలని ఆయన ఉద్దేశం" 2 కోరింథీయులకు 8: 9 For (you&me) made unholy to HOLY, He died on the cross. We are PRECIOUS at His sight.

30 March 2017

లూకా 11: 13 దేవుడు(పరలోకమందున్న మీ తండ్రి) తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. అపో 1: 8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు. 2కోరింథీ 3: 17 ప్రభువు ఆత్మే. ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ యెక్కడ నుండునో అక్కడ పాపము నుండి విడుదల ఉంటుంది. యోహాను 16: 13 సత్య స్వరూపియైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోకి నడిపించును;

31 March 2017

Think of it !! , When does​ God knows you? “GOD chose us in CHRIST, Before the foundation of the WORLD(before He begins the creation).…”. "GOD's eyes are not fixed on you in MOTHER's womb, but even before you are CONCEIVED". Simply, before no one knows you, GOD knew everything about you. You are purposefully born. "YOU ARE NO ACCIDENT; GOD CHOSE YOU"

3 April 2017

What is CROSS?(Luke 9:23) The one who goes for CROSS, it's sure that he has to bear torture and will DIE (won't return back&no more). The nature of man is, want to PLEASE himself. When we are crucified with CHRIST by faith in Him, we are to COMPLETELY surrender selfish desires​ and ambitions​ to the PERFECT will of GOD. We have to consider ourselves DEAD to self life (daily) & made CHRIST as a ki ng to our lives(daily). PAUL says.. “I have been crucified with Christ; and it is no longer I who live..but Christ lives in me." Gal 2:20 "God bought you with a high price(with His blood),You are not your own." 1Co 6:19,20 "For to me, living means living for Christ, and dying is even better." Php1:21 Be a PRACTICAL CHRIST follower.