Skip to main content

Posts

Showing posts from 2020

30May2020

★ యేసు సుంకరియైన మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలా మంది అన్యాయస్థులైన పన్నులు వసూలు చేసే వారూ, పాపులూ వచ్చి ఆయనతోనూ, ఆయన శిష్యులతో పాటు కూర్చున్నారు. మతనిష్ఠ గల పరిసయ్యులు అది గమనించి౼“మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యుల్ని అడిగారు. యేసు అది విని౼“ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడాన ికే వచ్చాను, నీతిపరులను కాదు.” అని చెప్పాడు. (మత్తయి 9:10-13) ★ ■ పరిసయ్యులు దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో, విశ్రాంతి దినం-పవిత్ర పండుగలను ఆచరించడంలోనూ ఎంతో మతనిష్ఠను పాటిస్తారు మరియు నిత్యం ఉపవాసాలతో, ప్రార్ధనల్లో తాము ఉంటారు గనుక తామే పవిత్రలమని అనుకుంటారు. మత నిష్ఠలేని, తప్పుడు పనులు చేసే వారంతా పాపాత్ములనేది వారి భావన. కనుక వారితో కలిసి భోజనం (సహవాసం) చెయ్యడానికి కూడా ఇష్టపడరు. అలా చేయడం ద్వారా దేవుడు తమ పట్ల ఎంతో సంతోషిస్తాడని భావిస్తారు. ■ కానీ దేవుని స్వభావం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. యేసు పాపుల స్నేహితునిగా పిలవబడ్డాడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ వారి మధ్యలో జీవించాడు. భూమిపై నివసించ...

29May2020

★యేసు జాలరియైన సీమోను పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు. ఆయన బోధించడం అయిపోయిన తరువాత సీమోనుతో౼"పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి" అన్నాడు. సీమోను"౼ప్రభూ! రాత్రంతా మేము కష్టపడ్డాం..కానీ ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు. వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి.. . సీమోను పేతురు అది చూసి, యేసు ముందు మోకరించి౼"ప్రభూ! నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు" అన్నాడు. అందుకు యేసు సీమోనుతో౼ "భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషుల్ని పట్టే జాలరివౌతావు” అన్నాడు(లూకా 5:1-10) ★ ■ సీమోను పేతురు అతని తోటి జాలరులు రాత్రంతా కష్టపడ్డారు కానీ ఫలితం శూన్యం. నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు యేసు వారి యొద్దకు వచ్చాడు. బైబిల్ అంతటిలో నిరాశ, కొదువ, ఒంటరితనం, అనారోగ్యం, దుఃఖం, నిరీక్షణలేని జీవితం, పాపపు బంధకాలు లాంటి వివిధ రకరకాలైన సమస్యలతో మనుష్యులు ఉన్నప్పుడు, యేసు అక్కడికి వచ్చిన వెంటనే ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అద...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

27May2020

💠  దేవుడు యోనాతో- "నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము"...... యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, యింకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటన చేశాడు. నీనెవె పట్టణం వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించారు. గొప్పవాళ్ళూ, సామాన్యులూ అందరూ గోనె పట్ట కట్టుకున్నారు... నీనెవె వాళ్ళు తమ చెడు  ప్రవర్తన వదిలిపెట్టడం దేవుడు చూసి తన మనస్సు మార్చుకుని వాళ్లకు వేస్తానన్న శిక్ష వెయ్యలేదు. (యోనా 1:2; 3:4,5,10) 💠 ◾  నీనెవె అహంకారంతోనూ, హింసాత్మకంగా, పూర్తిగా చెడిపోయిన క్రూరమైన పట్టణం. అటువంటి పట్టణానికి దేవుడు శిక్ష విధించాలనుకున్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన తీర్పులను భూమి పైకి పంపుతాడు. దేవుని మౌనాన్ని కొన్నిసార్లు ఆయనేమి పట్టించుకొనట్లుగా మనకు అనిపిస్తుంది కానీ ఆయన మౌనంలో కూడా ఆయన పనిచేస్తుంటాడు. ఆయన చెయ్యాలకున్న పనిని ఒక ఘడియ ఆలస్యం చెయ్యడు, ఒక ఘడియ ముందు చెయ్యడు గాని ఆయన సమయంలోనే చేస్తాడు. అయినప్పటికీ దేవుడు కనికరం గలవాడే కానీ శిక్షించాలని ఎదురు చూచువాడు కాదు...

26May2020

💠  ఆయన (యేసు) ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి-"ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు" అనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి-"నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని" చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయెను. (మత్తయి 8:1-3) 💠 ◾  ఆ రోజుల్లో కుష్టరోగము వైద్యం లేని భయంకరమైన వ్యాధి. గొప్ప పాపాత్ములకు దేవుడు విధించే శిక్షగా ప ్రజలు భావించేవారు. సొంత కుటుంబీకులకు, సమాజానికి దూరంగా వెలివేయబడి, శారీరక-మానసిక క్షోభకులోనవుతూ బ్రతికే దుర్భరమైన జీవితం. ఈ కుష్ఠు రోగి కూడా అటువంటి పరిస్థితిల్లో యేసుని గూర్చి విని, ఆయన తనను బాగుచేయగలడని నమ్మి, ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో జనసమూహంలోకి కుష్ఠు రోగులకు ప్రవేశం లేదు కానీ, ఆ కుష్ఠు రోగి ఏదో ఒక విధంగా ఆయన్ను సమీపించాడు. ◾  విశ్వాసం- అననుకూల పరిస్థితులను అధిగమిస్తుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో దేవుని దృష్టి అటుగా మరలుతుంది. అతను యేసు దగ్గరకు రాకముందే, అతనిలో విశ్వాసం క్రియను ఆరంభించిన దేవుడు, ముందుగానే అతణ్ణి యెరిగి ఉన్నాడు. అతనితో పాటు ఇంకొంత మంది కూడ...

25May2020

💠 "పేతురు రెండు సంకెళ్ళతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలివారు తలుపు యెదుట చెరసాల కాచుకొనుచుండిరి" (అ.కా 12:6) 💠 🔶  అప్పటికి కొద్ది రోజుల క్రితమే హేరోదు, క్రీస్తు శిష్యుడైన యాకోబును ఖడ్గంతో చంపించి, యూదుల మెప్పు కోసం కూడా పేతురును చెరసాలలో వేయించాడు. పేతురు మరణానికి అతి సమీపంలో ఉన్నప్పటికీని.. పేతురు నిశ్చింతగా నిద్రపోతున్నట్లు మనం లేఖనాలల్లో చూస్తాము. కానీ ఇదే పేతురు ఒకప్ పుడు ప్రాణ భయంతో ఉన్న వ్యక్తిగా మనకు తెల్సు(మత్తయి 8:25, 14:30, మార్కు 14:71) అప్పటికి కూడా పేతురు విశ్వసే అయినప్పటికీ ప్రాణ భయంతో భయపడే వానిగా ఉన్నాడు. దానికి గల కారణాన్ని ప్రభువు చెప్పాడు. అదే "అల్ప విశ్వాసం" (మత్తయి 8:26, 14:31). 🔶  సమస్త పరిస్థితులు దేవుని అధీనంలో ఉన్నాయని సంపూర్ణంగా నమ్మి, ఆయనను ఆనుకోవడం విశ్వాసం. ఆయన అనుమతి లేకుండా విశ్వాసి జీవితంలో ఏమి జరగదని, ఆయన అనుమతితోనే ప్రతికూల పరిస్తితుల్లోకి మనం అడుగు పెట్టామని సంపూర్ణంగా నమ్మడం. ఆ విశ్వాసమే క్రీస్తును పిలాతు ముందు దైర్యంగా నిలబడునట్లు చేసింది (యోహాను 19:11) పరిపూర్ణమైన విశ్వాసంలోకి మనమందరం (ప్రతి విశ్...

24May2020

✴   దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది. దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు. అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు. (ఆది 6: 11,12, 8 ) ✴ ■ నోవహు దినాల్లో ప్రజల అక్రమము ప్రబలిపోయింది. హింసతోను, దురాక్రమణతో నింపబడి..దేవుడు-'నేను నరుణ్ణి ఎందుకు చ ేశానని' నొచ్చుకునేంతగా చెడుతనం విస్తరించింది. ఎవరి మూలంగా మనిషి ఉనికిలోకి వచ్చి ఈ లోకంలో బ్రతుకుతున్నాడో, ఆయన్ను విడచి, మరచి తమ సొంత మార్గాల్లో ఇష్టానుసారంగా జీవిస్తూ తమ నడత లను చేరిపి వేసుకున్నారు. ప్రతి మనిషి విషయంలో దేవుడు నిర్దిష్టమైన, శ్రేష్టమైన ప్రణాళికలను ముందుగానే కలిగి ఉంటాడు. అది దేవుడు వారి మేలు కోసమే ఏర్పాటు చేసిన మంచి మార్గం. దానికి అవతలనున్న దేవుడు లేని ప్రతి మార్గం శరీర సంబంధమైనదై లోకపు దురాశలతో పాపంతో నిండి ఉంటుంది. ఐతే మంచిని చెడును తమ స్వేచ్ఛలో నుండి కోరుకునే దేవుని లాంటి లక్షణాలతో నరుడు పుట్టించబడ్డాడు. అలాంటి స్వేచ్ఛ నరునికి దేవునిచే ఇవ్వబడింది. దేవుడు లేని జీవిత...