✴️ అబ్రాముకు అతని భార్యయైన శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఐగుప్తు దేశానికి చెందిన హాగరు అను ఒక దాసి ఉంది. శారయి అబ్రాముతో౼ "ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో" అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.(ఆది 16:1,2) ✴️ ■ రాహేలు, లేయాలు కూడా సరిగ్గా ఇలాగే యకోబుకు సలహా ఇచ్చారు(ఆది 30:3,9). కానీ దేవుడు వారిని తప్పు పట్టినట్లుగా చూడము. వారి దాసీలకు పుట్టిన పిల్లలను కూడా తక్కిన వారితో సమాన గోత్రాలుగా దేవుడు చేశాడు. ఎందుకంటే అబ్రాము విషయంలో పుట్టబోవు సంతానం గూర్చి స్పష్టమైన దేవుడు వాగ్ధానం ఉంది. అబ్రాము విశ్వాసంతో కనిపెట్టి ఆ వాగ్ధానం పొందుకోవాలి. దేవుని వాక్కు ఎవరికి స్పష్టంగా తెలియజేయబడుతుందో (ప్రత్యక్షత) వారి నుండి దేవుడు ఎక్కువ విధేయతను ఎదురుచూస్తాడు. దేవుడు అబ్రాముతో సంతానం గూర్చి వాగ్దానం(నిబంధన) చేశాడు. సుమారు 10 సం|| ల తర్వాత కూడా పిల్లలు కలుగనందుకు అబ్రాము, అతని భార్యయైన శారయిల విశ్వాసం సన్నగిల్లి పోయింది(ఆది 15:2,16,2). శారయి తనకు ఇక పిల్లలు పుట్టరని దృఢ నిర్ణయానికి వచ్చినదై, అబ్రాముకు పై...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.