Skip to main content

Posts

Showing posts from June, 2018

13Jun2018

✴️ రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. వెంటనే యేసు-“ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు. పేతురు-“ప్రభూ! నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. యేసు-“రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని, గాలిని చూసి భయపడి మునిగిపోతూ-“ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు.వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని-“అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు. యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది...✴️ ■ ఇక్కడ 'నీళ్ళ మీద నడవడం' అనే సంగతి కంటే లోతైన ఆత్మీయ పాఠాన్ని దేవుడు తన శిష్యులకు నేర్పిస్తున్నాడని మనకు అర్ధమౌతుంది (తర్వాత రోజుల్లో ఎవరూ నీటి మీద నడిచినట్లుగాని, దాని గూర్చి మాట్లాడినట్లు గాని మనం చూడము). పేతురు కూడా మన వంటి పాపపు స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండినప్పటికీ(లుకా 5:8), యేసు వలె నీటిపై నడవడం నిజంగా మనకు మరింత గొప్ప ప్రోత్సాహన్ని కలిగిస్తుంది. మన జీవితంలో దేవుడు పంప...