Skip to main content

12 June 2017

యూదా దేశానికి రాజు హిజ్కియా. అతడు దేవుడంటే ఎంతో భయభక్తులుగల వాడు. 
సన్హెరీబు(అష్షూరు రాజు) గొప్ప సైనిక బలము గలిగి, అనేక యుద్దాలు చేసి, రాజ్యాలను జయించిన రాజు. అతడు యూదా రాజ్యం మీదికి దండెత్తి, చుట్టుముట్టాడు.

అప్పుడు హిజ్కియా-"నిబ్బరంగా ధైర్యంగా ఉండండి.అష్షూరు రాజును అతడితో ఉన్న పెద్దసైన్యాన్ని చూచి భయపడకండి. మనతో ఉన్న బలం అతడితో ఉన్న బలం కంటే గొప్పది. అతని దగ్గర కేవలం మనుష్యల బలమే వుంది. కాని మన
దగ్గర యెహోవా దైవబలం వుంది. దేవుడు మనకు సహాయపడతాడు. ఆయనే మన యుద్ధాలలో పోరాడుతాడు".
అని తన ప్రజలను ధైర్యపరచాడు. అతను చెప్పిన మాటలను ప్రజలు కూడా నమ్మారు.

ఆ విషయం తెలుసుకొన్న సన్హెరీబు యూదా ప్రజలకు ఒక లేఖ పంపాడు.
దానిలో- "హిజ్కియా చేత మీరు మోసపోకండి, మీరు అక్కడే ఉండి ఆకలి దప్పులతో మాడి చనిపోయే విధంగా మీరు మోసగింపబడుతున్నారు. అతణ్ణి నమ్మకండి. ఎందుకంటే, నేను అనేక ఇతర దేశాల ప్రజలను నాశనం చేసేటప్పుడు వారి దేవుళ్లు నన్నాపలేకపోయారు. అలాగే హిజ్కియా దేవుడు కూడ ఆయన ప్రజలను నాశనం చేయకుండ నన్ను ఆపలేడు!".

హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ లేఖ అందుకొని దానిని చదివాడు. అప్పుడతడు యెహోవా ఆలయానికి వెళ్ళి యెహోవా సముఖంలో ఆ లేఖను తెరచి పరిచాడు.

ఇలా ప్రార్థన చేశాడు-"ఆ దేశాలను అష్షూరు రాజు నాశనం చేసిన మాట నిజమే, ప్రభూ! ఆ జనాంగాల దేవుళ్లను వారు అగ్నిలోకి కాల్చివేశారు. కాని వారు నిజమైన దేవుళ్లు కారు. వారు కేవలము రాయి, కర్రలతో, మనుష్యులు చేసిన ప్రతిమలు. కాని నీవు సజీవుడవు. మా దేవుడువైన యెహోవా, మమ్ము అష్షూరు రాజు నుండి కాపాడు" అన్నాడు.
రాజైన హిజ్కియా మరియు యెషయా అనే ప్రవక్త ఈ సమస్య విషయంలో దేవునికి ప్రార్థించారు.

ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు శిబిరములోని 1,85,000 మందిని చంపాడు. ప్రొద్దున మనుషులు లేచి చూస్తే, వారంతా శవాలుగా పడి ఉన్నారు కనుక అష్షూరు రాజైన సన్హెరీబు సిగ్గుపడి, తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు.


ఆ జీవం గల దేవుడు నేటికి సజీవుడే! ఆయన సర్వశరీరులకు దేవుడు. విశ్వసించిన వారికి సమీపంగా ఉండే దేవుడు. విశ్వాసం ద్వారా మాత్రమే ఆయన ఉనికిని స్పష్టంగా గుర్తించగలం. ఆయన వెలుగును, జీవమునై ఉన్న పరిశుద్ధ దేవుడు. షరతులు లేని ప్రేమతో(శిలువలో నుండి) నిన్ను ప్రేమిస్తున్నాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...